రాజాసింగ్ పై పీడీ యాక్ట్..ఇప్పట్లో జైలు నుంచి విముక్తి లేదా?

Publish Date:Aug 26, 2022

Advertisement

రాజాసింగ్.. ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ వ్యాప్తంగా ఇప్పుడో సెన్సేషనల్ లీడర్. ధర్మం కంటే పార్టీ ఎక్కవేం కాదని కుండబద్దలు కొట్టేసిన వ్యక్తి. ఆయనే బీజేపీ నాయకుడు, ఘోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్. రాజా సింగ్ పై పోలీసులు పీడీయాక్ట్ నమోదు చేసి అరెరస్టు చేశారు.

ఆ యాక్ట్ ప్రకారం అరెస్టయిన తొలి ఎమ్మెల్యేగా రాజాసింగ్ నిలిచారు. ఇక పీడీ యాక్ట్ కింద రాజా సింగ్ ను అరెస్టు చేయడంతో ఆయన ఇక ఇప్పుడప్పుడే బయటకు వచ్చే అవకాశం లేనట్టేనని న్యాయరంగ నిపుణులు అంటున్నారు. ఎందుకంటే ఈ యాక్ట్ ప్రకారం అరెస్టు చేసిన వ్యక్తిని కోర్టులో హాజరు పరిచే అవసరం ఉండదు. కనిష్టంగా మూడు నెలలు, గరిష్టంగా ఏడాది వరకూ ఆయనను జైల్లో ఉంచొచ్చు.

  ఓ వర్గం మత మనోభావాలను కించ పరిచేలా ఆయన ఓ వీడియోను యూట్యూబ్‌లో అప్ లోడ్ చేయడంతో వివాదం ప్రారంభమైన సంగతి విదితమే. ఈ కేసులో ఆయనను అరెస్ట్ చేసినప్పటికీ.. నిబంధనల ప్రకారం నోటీసులు ఇవ్వలేదన్న కారణంతో న్యాయమూర్తి బెయిల్ ఇచ్చారు. దీంతో పాతబస్తీలో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. చివరికి పోలీసులు పీడీయాక్ట్ కింద అరెస్ట్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

 2014 నుంచి ఇంత వరకూ ఆయనపై 101 కేసులు నమోదయ్యాయి. అదనంగా 18 మత కల్లోలాల కేసులు ఉన్నాయి. పైగా రౌడీషీట్ కూడా ఉంది. ఈ కారణంగానే ఆయనపై పీడీయాక్ట్ ప్రయోగించామని కమిషనర్ సీవీ ఆనంద్ ప్రకటించారు. రౌడీషీటర్లు, అసాంఘిక శక్తులపైనే పీడీయాక్ట్ నమోదు చేస్తూంటారు. కానీ రాజకీయ నేతలపై మాత్రం ఎప్పుడూ అమలు చేయలేదు. అయితే రాజాసింగ్‌పై మాత్రం అమలు చేశారు.

అంతే కాకుండా ఒక వర్గం వారి మనోభావాలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసినందుకు ఆయనను బీజేపీ సస్పెండ్ చేసింద. దీంతో ఆయనకు పార్టీ పరంగా మద్దతు లభించే అవకాశం లేదని తేలిపోయింది. సున్నితమైన అంశం కనుక ఆయనకు ఎటువైపు నుంచీ కూడా మద్దతు లభించే అవకాశాలు కనిపించడం లేదు.దీంతో ఆయన ఇప్పటిలో బయటకు వచ్చే అవకాశం లేదని పరిశీలకులు అంటున్నారు.

By
en-us Political News

  
ఈ భవనాన్ని అలాగే వదిలేయడం వల్ల ఇప్పటివరకు 6 కోట్ల రూపాయల ప్రజాధనం బుడిదలో పోసిన పన్నీరైందన్నారు.
సూర్యనారాయణ రెడ్డికి సొంతంగా మాట్లాడే శక్తి లేదని, చేతిలో స్క్రిప్ట్ ఉంటే తప్ప ఆయన ప్రెస్ మీట్లలో కూడా మాట్లాడలేరని ఎద్దేవా చేశారు. ఆయన ప్రవర్తనను సినీ నటుడు బ్రహ్మానందం హావభావాలతో పోలుస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
ఏసీ రూముల్లో కూర్చుని సోషల్ మీడియా వేదికగా అసత్యాలు ప్రచారం చేయడం కాదు.. ధైర్యముంటే ప్రజాక్షేత్రంలోకి వచ్చి నేరుగా చర్చకు రావాలని సవాల్ విసిరారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, ఉద్యోగాల భర్తీపై బహిరంగ చర్చకు తాను ఎప్పుడైనా సిద్ధమేనని లోకేష్ స్పష్టం చేశారు.
తమిళ రాజకీయాల్లో డీఎంకే చిరకాల మిత్రుడు ఎండీఎంకే అధ్యక్షుడు వైకో తాజాగా స్టాలిన్‌కు ఊహించని షాక్ ఇచ్చారు.
ఎవరికీ ఉపయోగపడకుండా ఖాళీగా పడి ఉన్న ఈ ప్యాలెస్ నిర్వహణ కోసమే నెలకు లక్షలాది రూపాయల ప్రజాధనం ఖర్చవుతుండటం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణకు భారీ ఎత్తున గంజాయి తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాపై ఈగల్ ఫోర్స్ మరోసారి ఉక్కు పాదం మోపింది.
వైసిపి నేత పెర్ని నాని ఈ విషయంపై చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. పవన్ కళ్యాణ్ ఆంధ్రా ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదనీ.. కానీ తెలంగాణలో ఎవడో ఒంట్లో బాలేదు అంటే వస్తున్నా తమ్ముడూ అంటూ వెళ్ళిపోయారంటూ చేసిన వ్యాఖ్యల పట్ల సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది.
ఇటీవల ఒక జాతీయ టీవీ చానల్ కు కవిత ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో బీఆర్ఎస్ నుంచి ఆహ్వానం వస్తే తిరిగి సొంత గూటికి వెడతారా అన్న ప్రశ్రకు ఆమె భావోద్వేగంగా స్పందించారు.
దెందులూరు నియోజకవర్గంలో ఏమి జరుగుతుంది..
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన ప్రత్యేక సమావేశం
కాక్రోచ్ పార్టీ కేవలం ఒక నిరసన వేదికగా కాకుండా, కాక్రోచ్ జనతా పార్టీగా రూపాంతరం చెందుతూ యువతను విశేషంగా ఆకర్షిస్తోంది.
మంగళగిరి నియోజకవర్గం నూతక్కి గ్రామానికి చెందిన వైసీపీ నేత కొత్తపల్లి మోహన రావు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరారు.
కూటమి రెండేళ్ల పాలనపై ఎండీ కంఠంనేని రవిశంకర్, జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో విశ్లేషణాత్మకంగా చర్చ నిర్వహించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.