ఒడిశా అడవుల్లో ఈగల్ ఫోర్స్ దాడి.. 500 కిలోల గంజాయి స్వాధీనం

Publish Date:Jun 18, 2026

Advertisement

తెలంగాణకు భారీ ఎత్తున గంజాయి తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాపై ఈగల్ ఫోర్స్ మరోసారి ఉక్కు పాదం మోపింది.  ఒడిశా లోని దట్టమైన కోరాపుట్ అటవీ ప్రాంతంలో అత్యంత సాహసోపేతంగా నిర్వహిం చిన ఈ ఆపరేషన్‌లో ఈగల్ ఫోర్స్ 500 కిలోల గంజా యిని స్వాధీనం చేసుకు న్నారు. ప్రాణాలను సైతం పణంగా పెట్టి ఈగల్ ఫోర్స్ నిర్వహించిన ఈ హై రిస్క్ ఆపరేషన్‌కు ఒడిశా పోలీసులు ప్రత్యేకంగా ప్రశంసల వర్షం కురిపిం చారు.విశ్వసనీయమైన సమాచారం అందడంతో రంగంలోకి దిగిన ఈగల్ ఫోర్స్ బృందాలు, బలిమేళా నుంచి జయపూర్ వరకు సుమారు 80 కిలోమీటర్ల మేర గంజాయి తరలిస్తున్న బొలెరో వాహనాన్ని వెంబడించారు. 

అడవులు, ఘాట్ రోడ్లు దాటుకుంటూ సాగిన ఉత్కంఠభరిత చేజింగ్ అనంతరం వాహ నాన్ని అటవీ ప్రాంతం లో నిలిపివేసిన డ్రైవర్ చీకటి మాటున పరారయ్యాడు. అనంతరం వాహనాన్ని తనిఖీ చేసిన అధికారులు అందులో మొత్తం 115 ప్యాకెట్లలో దాచిన 500 కిలోల గంజాయి ఉన్నట్లుగా గుర్తించారు. వీటిలో 90 ప్యాకెట్లు ఐదు కిలోల చొప్పున, మరో 25 ప్యాకెట్లు రెండు కిలోల చొప్పున ఉన్నట్లుగా అధికారులు వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న గంజాయితో పాటు బొలెరో వాహనాన్ని ఒడిశా కోరాపుట్ పోలీసు లకు అప్పగించారు. 

ఈ ఘటనపై ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసు కున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వాహనం ఒడిశాలోని నబరంగ్‌పూర్ జిల్లాకు చెందిన అమీర్ అలీ ఖాన్ పేరిట రిజిస్ట్రేషన్ అయినట్లు అధికారులు గుర్తించారు. పరారీలో ఉన్న నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.కాగా, 2024లో కూడా రాంచీ వరకు వెంబడించి 500 కిలోల గంజాయిని పట్టుకున్న ఈగల్ ఫోర్స్, మరోసారి అదే స్థాయిలో విజయవంతమైన అంతర్రాష్ట్ర ఆపరేషన్ నిర్వ హించడం విశేషం.... తెలంగాణకు మాదకద్ర వ్యాల సరఫరాను అడ్డుకునే క్రమంలో ఈగల్ ఫోర్స్ చేప డుతున్న వరుస చర్యలు స్మగ్లింగ్ ముఠాల్లో గుండె దడ పుట్టిస్తున్నాయి... తెలంగాణ ఈగల్ ఫోర్స్ చేసిన సాహసాన్ని చూసి ఒరిస్సా పోలీసులు సైతం అవాక్కయ్యారు.... ఒరిస్సా పోలీసు ఉన్నతాధికారులు  ఈగల్ ఫోర్స్ ను అభినందించారు...

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ పురపాలక ఎన్నికల ఫలితాల్లో కడప జిల్లాలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి
విశాఖపట్నం మేయర్ పీఠాన్ని తెలుగుదేశం పార్టీ దక్కించుకుంది
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తన సత్తా చాటింది.
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన మద్యం రవాణా కాంట్రాక్టుల కుంభకోణం కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత కారుమూరి వెంకట నాగేశ్వరరావుకు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
20 వార్డుల్లో 17 స్థానాలు గెలుపు.!
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాతావరణ మార్పుల కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరో పెను తుపాను ముప్పును ఎదుర్కొంటోంది.
​కడప పులివెందుల మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్ ఎన్నికల కౌంటింగ్‌లో తెలుగుదేశం పార్టీ విజయపథంలో దూసుకుపోతోంది
ఆ పసివాడికి చట్టాలు తెలియవు.. నిబంధనలు అసలే తెలియవు. తెలిసిందల్లా అమ్మానాన్నల ప్రేమ మాత్రమే!
ఏపీలో జరుగుతున్న పురపాలక సంఘం ఎన్నికల ఫలితాల్లో అధికార కూటమి పక్షాలు తమ జోరును ప్రదర్శిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.
రాష్ట్రంలోని పలు ముఖ్యమైన మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయాలు నమోదు చేస్తున్నారు. ముఖ్యంగా  కడప జిల్లాలోని బద్వేల్ మున్సిపల్ చైర్‌పర్సన్ పీఠాన్ని కూటమి దక్కించుకుంది.
 పులివెందుల మున్సిసిపల్ ఎన్నికల పోలింగ్ రోజున వైసీపీ  అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్లాన్ చేసిన డ్రామాలు, ఎన్నికల వాతావరణాన్ని దెబ్బతీసేందుకు చేసిన ప్రయత్నాలను ఎస్ఈసీ  దృష్టికి తీసుకెళ్లారు. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడమే లక్ష్యంగా వైసీపీ శ్రేణులు ప్రవర్తించాయని, రాజ్యాంగబద్ధంగా జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడానికి ప్రయత్నించారని ఆరోపించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.