Publish Date:Nov 11, 2024
మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డిని పోలీసులు విచారిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన కాకాణిపై టిడిపి శ్రేణులు ఫైర్ అయ్యాయి.
Publish Date:Oct 26, 2024
గత ఏప్రిల్ నెలలో మహరాష్ట్ర నుంచి తెలంగాణలో ఎంటరై అయి ఇద్దరిని చంపేసిన గజరాజు ఉదంతం తెలిసిందే. తాజాగా ప్రస్తుతం మరో ఏనుగుల గుంపు తెలంగాణలో ప్రవేశించే అవకాశం ఉందని ఆటవిశాఖ అధికారులు చాటింపు వేశారు.
Publish Date:May 23, 2023
If AL Basham were alive today, he would have written a book with this title. In these turbulent times, when the very existence of democracy, secularism...
Publish Date:Oct 18, 2022
ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు మొత్తంగా రాజధాని చుట్టూనే తిరుగుతున్నాయి. నిజానికి ఆంధ్ర ప్రదేశ్ రాజధాని విషయంలో ఎలాంటి వివాదం లేదు. అదొక వివాదమే కాదు. చట్ట పరంగా చూసినా, మరోల చూసినా, అమరావతి ఆంధ్ర ప్రదేశ్ ఏకైక రాజధాని.అందులో మరోమాటకు అవకాశమే లేదు. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ తీర్మానం చేసింది. కేంద్ర ప్రభుత్వం గెజిట్’లో ప్రకటించింది. న్యాయస్థానాలు తీర్పులిచ్చాయి. ఎనిమిదేల్లాకు పైగా, అకడి నుంచే పరిపాలన సాగుతోంది., ఏపీ ఏకైక రాజధాని అని చెప్పేందుకు ఇంకేమి కావాలి, అంటే, సమాధానం ఉండదు. ఒక విధంగా బీజేపీ వారి భాషలో చెప్పాలంటే, ప్రత్యేక హోదా వివాదం లానే, రాజధాని విషయం కూడా ముగిసిన అధ్యాయం.
Publish Date:Aug 31, 2022
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పైకి ఏ కారణం చెప్పినా ఆయన బీహార్ పర్యటన మాత్రం కచ్చితంగా తన జాతీయ రాజకీయ ఆకాంక్ష నెరవేర్చుకునే దిశగా మరో అడుగేనని చెప్పడానికి ఇసుమంతైనా సందేహం అవసరం లేదు. ఇప్పటి వరకూ ఆయన వేసిన అడుగులకు ఎటువంటి సత్ఫలితాలూ రాలేదు.
Publish Date:Aug 12, 2022
ఉత్తరప్రదేశ్ బులంద్‌షెహర్ లో దేవేంద్రి అనే మహిళకి పాము కరిస్తే ఆమె భర్త ఏకంగా పేడగుట్ట కింద పడుకోబెట్టాడు. ఆమె పాము కాటు విషం నుంచి బయటపడి బతుకుతుందని!
Publish Date:Jul 19, 2022
మాథ్యూపదకండో ఏట జబ్బు చేసి చనిపోయాడు. అతని తల్లి కోరీ మాత్రం ఆకాశం వేపు చూసినపుడల్లా పోనీ అక్కడకి వెళ్లాలనే వెళ్లాడనే అనుకుంటోంది. దుఖాన్ని మింగుతూ. పిల్లాడి చితాభస్మాన్ని చంద్రుడి మీదకి పంపడానికి సిద్ధపడింది కోరి. వచ్చే ఏడాది ఆమె కోరిక ఫలించవచ్చు
Publish Date:Jun 19, 2022
పాలన ఎప్పుడూ జనరంజకంగా వుండాలి. ప్రభుత్వ పథకాలు, లక్ష్యాలూ ప్రజాసంక్షేమాన్ని ఆశించాలి గాని ప్రజల నుంచే తీవ్ర వ్యతిరేకత వస్తున్నపుడు మంచి పాలనను అందిస్తున్నామని ప్రభుత్వాలు ప్రచారం చేయించుకోవడం నవ్వులపాలే అవుతుంది. కేంద్రంలో బిజెపి ప్రభుత్వ గ్రాఫ్ ఇప్పటికే ప్రజల దృష్టిలో పడిపోతోంది. అయినా అగ్నిపథ్ వంటి దుర్మార్గపు ఆలోచనలతో యువ తను దెబ్బతీయడం కేవలం మూర్ఖపు పాలనే అవుతుంది. అసలు బిజెపీ పాలిత రాష్ట్రాల్లో ఇలానే ప్రజావ్యతిరేకత వెల్లువెత్తే పరిస్థి తులే వున్నాయి.
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అలియాస్ పీకే కొత్త పార్టీ వెనుక కూడా ఎన్నికల వ్యూహమే ఉందా? ఆ వ్యూహం తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుదా? అన్న సందేహాలు రాజకీయ వర్గాలలో వ్యక్తమౌతున్నాయి.
ఉరుము లేని పిడుగులా ప్రశాంత్ కిశోర్ తాను కొత్త పార్టీ స్థాపించబోతున్నట్లు ప్రకటించడంతో ఈ ఊహాగానాలు జోరందుకున్నాయి. అయితే వీటిని కేవలం ఊహాగాన సభలుగా కొట్టి పారేయడానికి వీల్లేదని పరిశీలకులు అంటున్నారు.
ప్రశాంత్ కిశోర్ పార్టీ ప్రకటనకు ముందు తెలంగాణ ముఖ్యమంత్రి కేసఆర్ తో సుదీర్ఘ మంతనాలు జరపడం ఇందు కోసం ఆయన ప్రగతి భవన్ లో రెండు రోజుల బస చేయడాన్ని తార్కానంగా చూపిస్తున్నారు.
Publish Date:Apr 27, 2022
ఓ యువకుడి ఆత్మహత్యకు కారకురాలైందని ఆ యువకుడి కుటుంబ సభ్యులు ఓ యువతిపై అత్యంత క్రూరంగా రివెంజ్ తీర్చుకున్నారు. ఆమెను కిడ్నాప్ చేసి, సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆపై జుట్టు కత్తిరించి, ముఖానికి నలుపు రంగు పూసి ఊరేగించారు. ఢిల్లీలోని కస్తూర్బా నగర్‌లో ఈ ఏడాది జనవరి నెలలో జరిగిన ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేసి ఛార్జీషీటును మంగళవారం కోర్టుకు సమర్పించారు. 21 మందిపై దాఖలైన చార్జిషీట్లో 12 మంది మహిళలు, నలుగురు పురుషులు, ఐదుగురు చిన్నారులు ఉన్నారు.
Publish Date:Apr 27, 2022
భక్తికి ఎల్లలు ఉండవంటారు. భగవంతునిపై తన భక్తిని ప్రదర్శించేందుకు ఏకంగా కన్నులు పెకలించుకున్నాడు కన్నప్ప. ప్రాణాలనే తృణ ప్రాయంగా అర్పించేశాడు మార్కండేయులు. భగవంతుని పై తనకున్న భక్తిప్రపత్తులను బియ్యపు పై గింజ అక్షరాలుగా మలిచి ఆ దేవుడికే తలంబ్రాలుగా అర్పించాడు ఈ భక్తుడు. నిజామాబాద్ ఇందూరు ఆర్టీసీ కాలనీకి చెందిన బిల్ల బాబు, పదవి విరమణ అనంతరం ఆధ్యాత్మిక చింతనతో శ్రీరాముడి పై తనకున్న భక్తి భావాన్ని చాటుకుంటున్నాడు. ఇప్పటి వరకు ఎనిమిది లక్షల యాభై ఒక్క వెల బియ్యపు గింజల పై శ్రీరామ నామాన్ని రాశారు. ఇందు కోసం ప్రతి రోజు ఉదయాన్నే నిద్రలేచి, స్నానాంతరం భగవంతునికి పూజ చేసి జెల్ పెన్‌తో రామ నామాన్ని తెలుగు, హిందీ భాషలలో లిఖిస్తున్నారు. ఈ విధంగా ఇప్పటి వరకు లిఖించిన బియ్యపు గింజలను ఇందూరు ఖిల్లా రామాలయంలో శ్రీసీతారాముల వారి కళ్యాణానికి రెండు మార్లు, ఇందూరు సుభాష్ నగర్ రామాలయంలో ఒక సారి, భద్రాచలం శ్రీసీతారాముల కల్యాణంలో తలంబ్రాలలో కలపటం జరిగింది.
Publish Date:Apr 23, 2022
దేశవ్యాప్తంగా సుమారు డజను రాష్ట్రాల్లో చీకట్లు కమ్ముకొంటున్నాయి. బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్ తో పాటు పంజాబ్, ఏపీలో ఇప్పటికే రోజూ 8 గంటల పైగా విద్యుత్తు కోతలు అమలవుతున్నాయి. హర్యానా, రాజస్థాన్, తమిళనాడు, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, జార్ఖండ్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలు తీవ్ర విద్యుత్తు కొరతను ఎదుర్కొంటున్నాయి. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే శ్రీలంక, పాకిస్తాన్ లకు పట్టిన దుస్థితే భారతదేశంలోనూ తలెత్తవచ్చని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Publish Date:Apr 22, 2022
ఎన్నికల వ్యుహకర్త ప్రశాంత్ కిశోర్’ వయసు ఉంటే ఓ 40 ఏళ్ళు ఉండవచ్చును. 2014 సార్వత్రిక ఎన్నికలకు ఒకటి రెండు సంవత్సరాల ముందు, 2012 ఆ ప్రాంతంలో ఆయన ఎన్నికల వ్యూహకర్తగా దేశానికి పరిచయం అయ్యారు. అంటే, ఓ దశాబ్ద కాలంగా మాత్రమే దేశ రాజకీయాలలో ఆయన పేరు వినిపిస్తోంది.నిజానికి గత సంవత్సరం జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తర్వాతనే ఆయన బ్రాండ్ ఇమేజ్ బాగా పెరిగి పోయింది. ఇంతలోనే పీకే, ఇంతింతై ..అన్నట్లుగా ఎదిగిపోయారు. ఎంతగా అంటే, కురువృద్ధ కాంగ్రెస్ పార్టీ మొదలు, వైసీపీ, తృణమూల్. ఎన్సీపీ వంటి పిల్ల కాంగ్రెస్ పార్టీలు అలాగే, తెరాస, డీఎంకే వంటి ప్రాంతీయ, కుటుంబ పార్టీలు... ఒక్క మాటలో చెప్పాలంటే బీజేపీని ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్న లౌకికవాద పార్టీలన్నీ క్యూకట్టి మరీ పీకేని శరణు వేడుతున్నాయి.