సింహాచలం అప్పన్న నిజరూప దర్శనం కోసం క్యూలో నిలుచున్న సమయంలో గోడ కూలి ఏడుగురు మరణించిన విషాద ఘటన సందర్భంగా తక్షణం స్పందించి బాధితులకు అండగా నిలవడమే కాకుండా వారిలో మనోధైర్యాన్ని నింపి, ప్రభుత్వం అండగా ఉంటుందన్న భరోసా కల్పించిన హోంమంత్రి వంగలపూడి అనితపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. మంగళవారం (ఏప్రిల్ 29) అర్ధరాత్రి తరువాత కురిసిన బారీ వర్షానికి బుధవారం (ఏప్రిల్ 30) తెల్లవారు జామున గోడ కూలి ఏడుగురు భక్తులు మరణించారు. మరి కొందరు గాయపడ్డారు. ఈ విషయం తెలిసిందే. ఈ విషాదఘటన విషయం తెలియగానే రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత క్షణం ఆలస్యం కాకుండా స్పందించారు. సంఘటన జరిగిన కొద్ది వ్యవధిలోనే ఆమె ఆ ప్రదేశానికి చేరుకున్నారు. ఎలాంటి జాప్యం లేకుండా ఒకే సమయంలో బాధితులకు అండగా నిలిచారు. ఇటు వారికి భరోసా కల్పిస్తూ, ప్రభుత్వం అండగా ఉంటుందన్న హామీ ఇస్తూనే అటు పరిస్థితిని సమీక్షించి సహాయ కార్యక్రమాలు యుద్ధ ప్రాతిపదికన చేపట్టేలా చర్యలు తీసుకున్నారు. ఒక్క క్షణం కూడా విశ్రాంతి తీసుకోకుండా.. పరిస్థితిని కంట్రోల్ లోకి తీసుకున్నారు.
సంఘటన జరిగిన వెంటనే వంగళపూడి అనిత పోలీసులు, ఎస్ఆర్డీఎఫ్ అధికారులను అప్రమత్తం చేసి సహాయ కార్యక్రమాలను యుద్ధ ప్రాతిపదికన మొదలయ్యాలా చూశారు. అదే రోజు సాయంత్రం అంటే బుధవారం (ఏప్రిల్ 30) డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సింహాచలం దుర్ఘటన సందర్శంగా హోంమంత్రి అనిత చేసిన సేవలను, బాధితులను ఓదార్చడంలో, వారిలో ధైర్యం నింపడంలో, ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందన్న నమ్మకం ప్రోది చేయడంలో ఆమె చూపిన చొరవకు, పడిన కష్టానికీ, విరామమెరుగకుండా అందించిన సేవలకు హ్యాట్సాఫ్ చెప్పారు. ఈ మేరకు బుధవారం సాయంత్రం విడుదల చేసిన ఒక ప్రకటనలో వంగళపూడి అనిత నిబద్ధత, బాధితులకు అండగా నిలిచి, వారికి భరోసా కల్పించడంలో చూపిన చోరవ.. ప్రజలలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వ ప్రతిష్ఠను ఇనుమడింప చేసేదిగా ఉందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన చంద్రమౌళి కుటుంబానికి ఆమె ఇచ్చిన మద్దతును ఈ సందర్భంగా గుర్తు చేశారు.
కొన్ని నెలల కిందట ఇదే పవన్ కల్యాణ్ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి, ముఖ్యంగా మహిళలపై పెరుగుతున్న నేరాల విషయంలో హోంమంత్రి వంగలపూడి అనితపై విమర్శలు కురిపించిన సంగతి తెలిసిందే. అలాగే తిరుపతిలో వైకుంఠఏకాదశి సందర్భంగా ఉత్తరద్వార ప్రవేశాల టికెట్ల కోసం తిరుపతిలో ఎదురు చూస్తున్న భక్తలు తొక్కిసలాటలో భక్తులు మరణించిన ఘటన సందర్భంలో కూడా ఆయన హోంమంత్రిత్వ శాఖ పని తీరును తప్పపట్టడమే కాకుండా అవసరమైతే హోంమంత్రిత్వ శాఖను తానే తీసుకుంటానని కూడా హెచ్చరించారు. అదే పవన్ కల్యాణ్ ఇప్పుడు ోంమంత్రి వంగలపూడి అనితపై ప్రశంసలు గుప్పించడం ద్వారా కూటమి పార్టీల మధ్య ఎటువంటి పొరపచ్చాలూ లేవనీ, కూటమి ఐక్యంగానే ఉందనీ చాటడమే కాకుండా తన ప్రశంసల ద్వారా వంగళపూడి అనితలో కొత్త ఉత్సాహాన్నీ, స్ఫూర్తినీ నింపారు. పవన్ ప్రశంసలపై స్పందించిన అనిత కూడా ఇదే విషయాన్ని తెలిపారు. హోంమంత్రి పవన్ కల్యాణ్ ప్రశంసలు తనకు మరింత చురుకుగా, చొరవగా పని చేయడానికి స్ఫూర్తిని ఇచ్చాయన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/pawan-praises-vangalapui-anitha-39-197282.html
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.
ధనుష్ తన కొత్త రాజకీయ పార్టీ కోసం తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని.
అయితే ఆయన తాజాగా నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు, వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో కలకలం రేపింది.
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు. ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం.