పవన్ కళ్యాణ్ చేస్తున్న ‘వారాహి దీక్ష’ అంటే ఏమిటి?

Publish Date:Jun 25, 2024

Advertisement

పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి దీక్షకు తంత్ర సాధనలో చాలా ప్రాధాన్యం వుంది. తన ఎన్నికల ప్రచార వాహనానికి వారాహి అని పేరు పెట్టుకున్న పవన్ కళ్యాణ్, ఇప్పుడు తన ఇష్టదేవత వారాహి అమ్మవారి దీక్షని కూడా 11 రోజులపాటు చేపట్టారు. అసలీ వారాహి దీక్ష అంటే ఏమిటి? 

వారాహి అంటే పంది శిరస్సుతో వుండే అమ్మవారు. వారాహి అంటే లలితాదేవి అమ్మవారి సాయుధ దళాలకు చీఫ్ కమాండర్ అని చెప్పుకోవచ్చు. లలితాదేవి అమ్మవారి ఆజ్ఞాచక్రం దగ్గర నివసిస్తూ, ఆమె ఆదేశాలు (ఆజ్ఞలు) పాటిస్తూ, తన దగ్గర వున్న విస్తారమైన సైన్యంతో ఎంతటి బలవంతుడైన శత్రువునైనా ఓడించగలదు. వారాహి శక్తులను సానుకూల ధోరణిలో ఉపయోగించడం వల్ల కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే అరిషడ్వర్గాలను అధిగమించవచ్చు. అంతర్గంగా వున్న వ్యాధులకు చికిత్స చేసుకోవచ్చు. జీవితంలో నాణ్యతను పెంచుకోవచ్చు. ఒకరి తరఫున  వేరే ఎవరైనా వారాహి మంత్ర సాధన చేసి, ఆ తర్వాత జల ప్రోక్షణ చేయడం వల్ల ఎవరి కోసమైతే మంత్ర సాధన చేశారో ఆ వ్యక్తికి మేలు జరుగుతుంది. ప్రాణాంతక వ్యాధులను తగ్గించడంలో వారాహి మాత సాధన ఉపయోగపడుతుంది.

వరాహ రూపంలో వున్న మూర్తిని ఒక శక్తిగా ఆరాధించడం అనేది కేవలం హిందూ పురాణాలలో మాత్రమే కాదు.. సెల్టిక్, జపనీస్, చైనీస్, గ్రీక్, అమెరికన్, ఈజిప్టియన్ సంస్కృతులలో భాగంగా కూడా వుంది. వారాహి దేవత ధైర్యం, నిర్భయం, స్వయం నియంత్రణ శక్తులకు ప్రతిరూపం. శత్రువుతో పోరాడటానికి అవసరమైన ధైర్యాన్ని వారాహి ఇస్తుంది. ఒక్కోసారి విజయం మనల్ని అహంకారంలోకి నెట్టేస్తుంది. వారాహి దీక్ష చేయడం, వారాహిని ఆరాధించడం వల్ల మనసులో చేరిన అహంకారం తొలగిపోతుంది. వారాహి దీక్షను రెండు స్థాయిల్లో చేపడతారు. ఒకటో స్థాయిలో రక్షణ కోసం చేసే వారాహి అస్త్ర బీజ మంత్ర సాధన వుంటుంది. రెండో స్థాయిలో మంచి ఆరోగ్యం కోసం వారాహి అస్త్ర బీజమంత్ర సాధన వుంటుంది.

వారాహి దీక్ష, వారాహి మంత్ర సాధన చేయడం వల్ల చేకూరే ఇతర ప్రయోజనాలు... నరదిష్టి తొలగుతుంది. రాహు - కేతు దోషాలు పోతాయి. ప్రాణాంతక వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. తమ మీద జరిగిన తంత్ర, మంత్ర ప్రయోగాలను అరికడుతుంది. ప్రమాదాల నుంచి రక్షణ లభిస్తుంది. శక్తి, కీర్తి, పాజిటివ్ దృక్పథం పెరుగుతుంది. సంపదను అందిస్తుంది. సమాజంలో ఉన్నత స్థాయి లభిస్తుంది. శత్రువులు, పురోగతికి అడ్డుగా నిలిచేవారి నుంచి రక్షణ లభిస్తుంది. ఏంటీ ఆలోచిస్తున్నారు.. మీకూ వారాహి దీక్ష చేయాలని అనిపిస్తోందా? శుభం!

By
en-us Political News

  
పార్లమెంట్‌లో కీలక బిల్లులను ప్రవేశపెట్టనున్న వేళ ఢిల్లీ రాజకీయాలు వేడెక్కాయి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన సీనియర్ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు (83) కన్నుమూశారు.
హైదరాబాద్‌లో జీహెచ్ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్, బోరబండ మాజీ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్‌ను హత్య చేసేందుకు జరిగిన భారీ కుట్రను బోరబండ పోలీసులు భగ్నం చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీ ఎన్నికల రెండో దశ పోలింగ్ ఉత్సాహంగా కొనసాగుతోంది.
తెలంగాణ ప్రయోజనాలే తమకు పరమావధన్న ఆయన పార్లమెంటులో ఈ ప్రతిపాదనపై చర్చ,  ఓటింగ్ జరిగినప్పుడు తమ పార్టీకి చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు అనుకూలంగా ఓటు వేస్తారని వెల్లడించారు.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులు ఆమోదం పొందితే దేశ రాజకీయాలలో కాంగ్రెస్ ప్రతిష్ఠ బాగా మసకబారుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నాయి. ఇది 2029 సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ గెలుపు అవకాశాలపై నిస్సందేహంగా ప్రతికూల ప్రభావం చూపుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
తొలి విడత పంచాయతీ ఎన్నికలలో  వైసీపీ మద్దతుదారులు కనీసం పాతిక శాతం  స్థానాలను కూడా గెలుచుకోలేకపోయారు. అదే సమయంలో తెలుగదేశం కూటమి మద్దతు ఉన్నఅభ్యర్థులు తిరుగులేని విజయాలతో ప్రభంజనం సృష్టించారు. 
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ బిల్లు ఉద్దేశాలను, ప్రక్రియను  తప్పుబడుతుండగా, ఇండియా కూటమిలోని పలు ప్రాంతీయ పార్టీలో,  సీట్ల వాటా రక్షణ, సవరణల ఆధారంగా తమ వైఖరిని మార్చుకుంటున్న సంకేతాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి.
డీలిమిటేషన్ తో పాటు, మహిళా రిజర్వేషన్ల అమలును తీసుకురావడమే ఈ సమావేశాల నిర్వహన ప్రధాన లక్ష్యంగా కేంద్రంలోని మోడీ సర్కార్ చెబుతున్నప్పటికీ, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఈ హడావుడి సమావేశాల వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం బీజేపీకి రాజకీయ లబ్ధి చూకూర్చడమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
కేంద్రం తాజాగా తీసుకున్న నిర్ణయం మేరకు ఏ   రాష్ట్రంలోనూ  సీట్ల వాటా తగ్గదు, ప్రస్తుత నిష్పత్తిని కాపాడుతూనే అన్ని రాష్ట్రాల్లోనూ సమానంగా స్థానాలు పెరుగుతాయి.  అంతేకాకుండా, 2051 సీట్ల విషయంలో మార్పులు లేకుండా స్తంభనను అమలు చేయడం ద్వారా భవిష్యత్ జనాభా గణాంకాల ఆధారంగా రాష్ట్రాల మధ్య సీట్ల నిష్పత్తి మారకుండా నియంత్రించామని కేంద్రం చెబుతోంది. 
లోక్‌సభ నియోజకవర్గాల సంఖ్యను 50 శాతం పెంచడం వల్ల ఏ రాష్ట్రానికీ నష్టం జరగదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
మాదకద్రవ్యాల మహమ్మారి నుంచి యువతను కాపాడేందుకు చేపట్టిన నషా ముక్త్ భారత్ యాత్రకు ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
తమిళనాడులో సంచలనం సృష్టించిన మహిళా ఐఏఎస్ అధికారిణి వేధింపుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.