జగన్ గాలి తీసేసిన పవన్.. స్టాలిన్‌ను చూసి నేర్చుకో సీఎం!
Publish Date:Sep 1, 2021
Advertisement
జనసేన అధినేత పవన్‌కల్యాణ్. పార్ట్ టైమ్ పాలిటిక్స్‌తో ఫుల్ బిజీగా ఉంటున్న హీరో. ఈ మధ్య మరీ అవసరమైనప్పుడు మాత్రమే రాజకీయాలు మాట్లాడుతున్నారు. లేదంటే, తన సినిమాలేవో తాను చేసుకుంటున్నారు. వకీల్‌సాబ్ మాంచి హిట్ కొట్టడంతో.. మరింత జోరు, హుషారు పెంచేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి మాగ్జిమమ్ సినిమాలన్నీ తీసేసి.. ఆ డబ్బును పార్టీ పటిష్టత కోసం ఖర్చు చేయాలనేది ఆయన ప్రణాళిక. అయితే, అన్నాళ్లూ పొలిటికల్‌గా సైలెంట్‌గా ఉంటే ఎట్టా? ప్రజలు ఆయన్ను మర్చిపోరూ? అందుకే, తాను రాజకీయాల్లో ఇంకా యాక్టివ్గానే ఉన్నానని చాటేలా.. అడపాదడపా స్టేట్మెంట్లు ఇస్తుంటారు. తిరుపతి ఎంపీ ఉప ఎన్నికల ప్రచారంలో మెరుపు తీగలా ఇలా వచ్చి అలా మాయమైపోయారు. అంతే. మళ్లీ అప్పటినుంచీ పత్తా లేకుండా పోయారు. బహుషా కరోనా కేసుల మూలంగా ఇంటికే పరిమితమయ్యారో.. లేక, సినిమాలతో బిజీగా ఉన్నారో.. ఏమో గానీ.. తాజాగా, ఏపీలో రోడ్ల దుస్థితిపై జనసేన చేపట్టిన నిరసన కార్యక్రమంతో మళ్లీ యాక్టివ్ అయ్యారు. అడుగుకో గుంత.. గజానికో గొయ్యి.. జగనన్న స్కీమ్ సూపర్ అంటూ సినిమాటిక్ డైలాగ్స్‌తో సెటైర్లు వేశారు. ఎలాగూ యాక్టివ్ అయ్యాం కదా.. పనిలో పనిగా దేశంలో కూడా ఏం జరుగుతోందోనని ఓ లుక్కేసినట్టున్నారు. ఆ పొలిటికల్ సర్ఫింగ్‌లో జనసేనాని కంటిని తమిళనాడు సీఎం స్టాలిన్ తెగ అట్రాక్ట్ చేసినట్టున్నారు. ముఖ్యమంత్రిగా స్టాలిన్ పాలనా విధానాలకు ఫుల్ ఫిదా అయిపోయారు పవన్‌కల్యాన్. ఏపీలో చంద్రబాబు ముద్ర ఉండకూడదనేలా అమరావతిని నాశనం చేసే తరహాలో కాకుండా.. తమిళనాడు ఏలిన గత అన్నాడీఎంకే ప్రభుత్వ పథకాలను, జయలలిత బొమ్మలతో కూడిన వాటర్ అమ్మ క్యాంటిన్, అమ్మ వాటర్ బాటిల్స్, అమ్మ ఫోటోలు ఉన్న స్కూల్‌బ్యాగ్స్ పంపకాన్ని.. యధాతథంగా కొనసాగించడం.. చూసి పవన్‌కల్యాణ్ బాగా ఇంప్రెస్ అయినట్టున్నారు. ఏపీలో మాదిరి ప్రతిపక్షాలపై కేసులు, అరెస్టులతో రివేంజ్ పాలిటిక్స్ చేయకుండా, విపక్ష నేతలను పిలిచి మాట్లాడటం, వారికి ప్రభుత్వ కమిటీల్లో ప్రాధాన్యం ఇవ్వడం.. తెలుసుకొని జనసేనాని అబ్బురపడ్డారట. అందుకే, ఆ మాత్రం లేట్ చేయకుండా.. తమిళనాడు సీఎం స్టాలిన్‌కు శుభాకాంక్షలు చెబుతూ.. తెలుగు, తమిళభాషల్లో ఓ చక్కటి ట్వీట్ చేశారు పవన్‌కల్యాణ్. ‘‘ఏ పార్టీ అయినా ప్రభుత్వంలోకి రావడానికి రాజకీయం చేయాలి.. కానీ అధికారంలోకి వచ్చాక రాజకీయం చేయకూడదు. దీన్ని మీరు మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపిస్తున్నారు. మీ పరిపాలన, ప్రభుత్వ పనితీరు మీ ఒక్క రాష్ట్రానికే కాకుండా దేశంలోని రాష్ట్రాలకు, అన్ని పార్టీలకు మార్గదర్శకం.. స్ఫూర్తిదాయకం. మీకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను’’ అంటూ ట్వీట్ చేశారు జనసేనాని. ఈ ట్వీట్ చూసి నెటిజన్లు ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేస్తున్నారు. ఇందులో ఏ ఒక్క లక్షణమైనా ఏపీ సీఎం జగన్‌రెడ్డికి ఉందా? అని ప్రశ్నిస్తున్నారు. తండ్రి డెడ్‌బాడీ సాక్షిగా రాజకీయం చేసిన జగన్మోహన్రెడ్డి.. ఒక్క ఛాన్స్ అంటూ పెద్ద రాజకీయమే చేశారంటున్నారు. అందలమెక్కాక కూడా అడ్డగోలు రాజకీయం మానుకోలేదని మండిపడుతున్నారు. కేవలం చంద్రబాబు బొమ్మ ఉందనే కారణంగానే.. అన్న క్యాంటీన్లకు అర్థాంతరంగా తాళాలు వేసేసి.. పేదల నోటి కాడి కూడును ఎత్తకొట్టారని.. అదే తమిళనాడులో అమ్మ క్యాంటిన్లను యధావిధిగా కొనసాగిస్తూ సీఎం స్టాలిన్ ప్రజల అభిమానం చూరగొంటున్నారని.. వారిద్దరినీ పోల్చి చూస్తున్నారు. అలాంటి చర్యల వల్లే.. ఇండియా టుడే నిర్వహించిన మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో సీఎం స్టాలిన్ నెంబర్ వన్ ర్యాంక్ సొంతం చేసుకుంటే.. అదే సర్వేలో అడ్డగోలు నిర్ణయాలతో అరాచకంగా పాలిస్తున్న ఏపీ సీఎం జగన్ 11వ స్థానానికి పతనమై.. కేవలం 6శాతం ప్రజల అభిమానం మాత్రమే చూరగొన్నారని గుర్తు చేస్తున్నారు. పవన్ కల్యాణ్ ట్వీట్లో సీఎం స్టాలిన్‌ను ఉద్దేశించి చేసిన ప్రతీ ఒక్క కామెంట్.. పరోక్షంగా సీఎం జగన్‌ను తప్పుబట్టేలా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్స్. అదే సమయంలో మరో ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ కూడా రైజ్ చేస్తున్నారు.. తమిళనాట అంత మంచి పాలన అందిస్తున్న డీఎంకే సర్కారుకు వ్యతిరేఖంగా పని చేస్తున్న బీజేపీకి జనసేన ఎలా మద్దతిస్తోందని ప్రశ్నించడం ఆసక్తికరం.
http://www.teluguone.com/news/content/pawan-kalyan-tweet-on-cm-stalin-39-122344.html





