లిక్కర్ ఒకే.. సినిమాకే పారదర్శకతా! తన సినిమాను ఫ్రిగా చూపిస్తానన్న పవన్..
Publish Date:Dec 12, 2021
Advertisement
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్. సినిమా టికెట్ల రేట్లు తగ్గించడం, బెనిఫిట్ షోలను రద్దు చేయడంపై స్పందించిన పవన్ కల్యాణ్.. జగన్ సర్కార్ కు చురకలు అంటించారు. తనను ఆర్థికంగా దెబ్బతీసేందుకు తన సినిమాలు ఆపేస్తే, ఏపీలో ఉచితంగా సినిమా షోలు వేస్తానని చెప్పారు. అంతేతప్ప బెదిరింపులకు భయపడేవాడ్ని కాదని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు తమ సినిమాలు ఆపేస్తే నా ఆర్థికమూలాలు దెబ్బతింటాయని వారు భావిస్తున్నారు.. వాళ్లు అంత పంతానికి వస్తే నేను ఆంధ్రప్రదేశ్ లో ఉచితంగా సినిమా వేసి చూపిస్తా అని జనసేన చీఫ్ అన్నారు. సినిమా టికెట్ల అంశంలో పారదర్శకత లేదని చెబుతున్నారు... మీకుందా పారదర్శకత? అని ప్రశ్నించారు. మీకంత పారదర్శకత ఉంటే ఎందుకు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు? అంటూ పరోక్షంగా సీఎం జగన్ ను టార్గెట్ చేశారు. ప్రశ్నిస్తే చాలు వైసీపీ నేతలు బూతులు తిట్టేస్తారని చెప్పారు. "సినిమా థియేటర్ల నుంచి పన్నులు రావడంలేదు, టికెట్ల వ్యవహారంలో పారదర్శకత లేదు... అంతవరకు ఓకే... కానీ మీరు అమ్మే మందుకు పారదర్శకత ఉందా? మద్యం మీద ఏడాదికి రూ.40 వేల కోట్లు వస్తోందట... మద్యం వ్యాపారంలో వచ్చిన డబ్బును లారీల్లో గట్టి బందోబస్తు మధ్య తీసుకెళుతున్నారంట... నిజమేనా?" అంటూ పవన్ కల్యాణ్ సంచలన కామెంట్లు చేశారు. స్టీల్ ప్లాంట్ కార్మికులకు మద్దతుగా జనసేనాని పవన్ కల్యాణ్ మంగళగిరిలో ఒక్క రోజు దీక్ష చేపట్టారు. నిమ్మరసం స్వీకరించిన అనంతరం దీక్ష ముగించారు. ఈ క్రమంలో సభకు వచ్చిన వారిని ఉద్దేశించి ప్రసంగిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.
http://www.teluguone.com/news/content/pawan-kalyan-strong-warning-to-jagan-govt-over-cinema-ticket-rates-39-128231.html





