చంద్రబాబుతో పవన్ కల్యాణ్ భేటీ.. పొత్తుపై క్లారిటీ వచ్చేసినట్లేనా?

Publish Date:Jan 8, 2023

Advertisement

జగన్  పాలనను జన క్షేత్రంలో ఎండగట్టడమే లక్ష్యంగా ఇంత కాలం తెలుగుదేశం, జనసేనలు వేర్వేరుగా ప్రణాళికలు, వ్యూహాలతో ముందుకు వెళ్లాయి. ఇప్పుడు ఇక జగన్ ప్రభుత్వ రాజ్యహింస, అణచివేత పతాక స్థాయికి చేరుకోవడంతో ఉమ్మడి ప్రణాళికలు, వ్యూహాలతో ముందుకు కదలాలని నిర్ణయానికి వచ్చాయా? ఏపీలో వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం, జనసేన పార్టీలు కలిసి పోటీ చేయడం ఖాయమైపోయిందా?

బీజేపీ కలిసినా కలవకపోయినా తెలుగుదేశం జనసేనల మధ్య పొత్తు ఖరారైపోయిందా?  అంటే ఈ రెండు పార్టీల శ్రేణుల నుంచీ కూడా ఔననే సమాధానం వస్తోంది. ఎన్నికలు ఇంకా బోలెడు సమయం ఉన్నా.. రాష్ట్రంలో ఇప్పటికే ఎన్నికల హీట్ పీక్స్ కి చేరింది. దానికి తోడు ముందస్తు ఊహాగానాల నేపథ్యంలో తెలుగుదేశం, జనసేన పార్టీలు పొత్తు, సీట్ల సర్దుబాటు వంటి అంశాల విషయంలో ఇప్పటికే ఒక అవగాహనకు వచ్చేశాయని చెబుతున్నారు. ఏవో రెండు మూడు జిల్లాలు వినా దాదాపుగా అన్ని జిల్లాలలోనూ పొత్తులో భాగంగా జనసేన పోటీ చేసే స్థానాలు కూడా ఖరారైపోయాయని చెబుతున్నారు. ఈ ప్రచారానికీ, ఊహాగానాలకూ బలం చేకూర్చేలా జనసేనాని పవన్ కల్యాణ్ ఆదివారం (జనవరి 8)న హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు.

ఈ భేటీలో ఇరు పార్టీల మధ్యా పొత్తు విషయంలో క్లారిటీ వస్తుందని అందరూ భావిస్తున్నారు.  ఇటీవల చంద్రబాబు ఆయన సొంత నియోజకవర్గం కుప్పం పర్యటన సందర్భంగా జగన్ సర్కార్ అడుగడుగునా అడ్డుకున్న తీరును ఖండిస్తూ, ఆయనకు సంఘీభావం తెలిపేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ చంద్రబాబుతో భేటీ అయ్యారని చెబుతున్నా.. ఈ భేటీకి అంతకు మించి రాజకీయ ప్రాధాన్యత ఉందనడంలో సందేహం లేదు. హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసంలో జరిగిన ఈ భేటీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలపై ఒక క్లారిటీ ఇస్తుందనడంలో సందేహం లేదు. గతంలో పవన్ కల్యాణ్ ను ఆయన విశాఖ పర్యటన సందర్భంగా ప్రభుత్వం అడ్డుకున్నప్పుడు చంద్రబాబు పవన్ కల్యాణ్ కు సంఘీ భావం తెలిపిన సంగతి విదితమే.

ఇరు పార్టీలూ కూడా జగన్ దుర్మార్గ పాలన అంతం కావాలన్న లక్ష్యంతోనే ముందుకు సాగుతున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఎట్టి పరిస్థితుల్లోనూ చీల నివ్వను అంటూ  పవన్ కల్యాణ్ చాలా కాలం కిందటే రాష్ట్రంలో పొత్తుల చర్చకు శ్రీకారం చుట్టారు. అప్పటి నుంచీ ఏపీలో రాజకీయ సమీకరణాలపై చర్చోపచర్చలు సాగుతూనే ఉన్నాయి. ఒక దశలో బీజేపీతో కలిసి తెలుగుదేశం పార్టీని కలుపుకుని ముందుకు సాగాలన్న ఉద్దేశాన్ని చాటిన పవన్ కల్యాణ్.. ఇటీవలి కాలంలో బీజేపీ కలిసి వచ్చినా లేకున్నా తెలుగుదేశంతో కలిసి సాగాలన్న ఉద్దేశాన్ని చాటుతున్నారు.   

జగన్ పాలనకు చరమగీతం అన్న ఏకైక అజెడాతో తెలుగుదేశం, జనసేన పార్టీలు ఇప్పటి దాకా వేటికవే వేర్వేరుగా ప్రజాక్షేత్రంలోకి వెళుతూ వచ్చాయి. అయితే జీవో నంబర్ 1 రాష్ట్రంలో రాజకీయ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేసింది. విపక్షాలు రాష్ట్రంలో సభలూ, సమావేశాలూ నిర్వహించడానికే వీల్లేకుండా చేస్తూ జారీ చేసిన జీవోతో ఇక కలిసి అడుగులు వేయాలన్న నిర్ణయానికి జనసేన, తెలుగుదేశం పార్టీలు వచ్చేసినట్లు పవన్ కల్యాణ్ చంద్రబాబుకు సంఘీభావం తెలపడానికి ఆయన నివాసానికి వెళ్లడం తేటతెల్లం చేసింది.

 ఇక ప్రస్తుతానికి వస్తే చంద్రబాబుతో జనసేనాని పవన్ కల్యాణ్ భేటీలో రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, ముఖ్యంగా జగన్ సర్కార్ దుర్మార్గ విధానాలు, విపక్షాలపై అణచివేత ధోరణిపై చర్చ జరిగిందని చెబుతున్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడం కోసం ఒక ఐక్య కార్యచరణతో ముందుకుసాగాలన్న అభిప్రాయం వీరి భేటీలో వ్యక్తమైందని అంటున్నారు.  ఇప్పటికే తెలుగుదేశం, జనసేనలు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై వేర్వేరుగా చేస్తున్న పోరాటాన్ని ఇక ఐక్యంగా కొనసాగించాలన్న నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. ఇక ఈ భేటీలో జగన్ సర్కార్ తీసుకొచ్చిన జీవో నంబర్‌1పైనా చర్చ జరిగిందని చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తెదేపా-జనసేన మధ్య పొత్తు ఉంటుందన్న ప్రచారం నేపథ్యంలో వీరిరువురి భేటీకి ఎనలేని రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది. 

By
en-us Political News

  
రెక్కల కష్టంతో బతుకులు.. రోడ్డు ప్రమాదంతో ఆవిరైన ప్రాణాలు.!
హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది.
పండుగ వేళ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉత్సాహపూరిత వాతావరణం నెలకొంది.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.