అహంకారానికి పరాకాష్ట కుప్పం దుర్మార్గం

Publish Date:Jan 8, 2023

Advertisement

రాజకీయాల్లో బండ్లు ఓడలు,ఓడలు బండ్లు కావడం పెద్ద విషయం కాదు. అందుకు కళ్ళ ముందే కావలసినన్ని ఉదాహరణలున్నాయి. అధికారం అండ చూసుకుని తప్పులు చేసుకుంటూ పోయే పాలకులు ఏదో ఒక రోజున అందుకు మూల్యం చెల్లించక తప్పుదు. తనకు పుత్రభిక్ష పెట్టమని వేడుకున్న సోదరి సాత్వతికి ఇచ్చిన మాటకు కట్టుబడి శ్రీ కృష్ణ పరమాత్మ, శిశుపాలుని వంద తప్పుల వరకు క్షమించాడు. అయితే, అహంకారంతో విర్రవీగిన శిశుపాలుడు తనకు తిరుగులేదని తప్పు మీద తప్పు చేసుకుంటూ పోయాడు. భోజ రాజుల్ని చంపి, వసుదేవుడు యజ్ఞాన్ని అడ్డుకుని అశ్వాన్ని దొంగలించడమే కాదు, దాన్ని కూడా సంహరించాడు. కృష్ణుడు లేని సమయంలో ద్వారకకు నిప్పంటించడమే కాదు, రుక్మిణిని వివాహం చేసుకోవాలని చూశాడు. బభ్రువు  భార్యని అపహరించి తనదాన్ని చేసుకున్నాడు. ఇన్ని ఘోరాలు జరిగినా కృష్ణుడు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నాడు.
కానీ చివరకు ఏమి జరిగింది .. ధర్మరాజు ఆహ్వనం మేరకు ఆయన తలపెట్టిన రాజసూయ యాగానికి వచ్చిన శిశుపాలుడు చేయరాని చివరి తప్పు చేశాడు.తొలి అర్ఘ్యానికి శ్రీకృష్ణుడే అర్హుడని భీష్ముడు చేసిన నిర్ణయాన్ని అహంకారంతో తూల నాడాడు .. గొల్లవాడు పూజ్యుడెలా అవుతాడని నోటికి వచ్చినట్లు క్రిష్ణుడిని మాట్లాడి అవమానించాడు. భీష్మ పితామహుని తప్పుబట్టి ధర్మరాజుని దుయ్యబట్టాడు. దీంతో భీముడు, సహదేవుడు ఆవేశ పడితే భీష్ముడు వారిని వారించాడు. దీంతో  శ్రీకృష్ణుడు సభ నుద్దేశించి శిశుపాలుడి తల్లికిచ్చిన మాట ప్రకారం ఇంతవరకు అతడి అపరాధాలను మన్నించాను. నేటితో నూరు తప్పులు పూర్తయ్యాయి, కాబట్టి సహనం వహించిన నేను ఈ మూర్ఖుడిని ఇప్పుడే శిరచ్చేధం ద్వారా సంహరిస్తా నని సుదర్శన చక్రం ప్రయోగించి శిశుపాలుని శిరస్సు ఖండించాడు. అది ద్వాపర యుగం నాటి  కథ. 

ఇది కలియుగం. యుగం ఏదైనా కాలం ఏదైనా అహంకారంతో విర్రవీగే వారు ఎవరైనా చివరకు సిక్ష అనుభవించక తప్పదు. ముఖ్యంగా అధికారం శాశ్వతం అనుకుని విర్రవీగే పాలకుల తప్పులను  ప్రజలు ఎప్పటికప్పడు లెక్కిస్తూనే ఉంటారు. ఐదేళ్ళు వరకు పాలకుల తప్పులను భరిస్తారు .. మన్నిస్తారు.ఆ గీత దాటిన తర్వాత వేటు వేస్తారు. ఆంధ్ర ప్రదేశ్  లో ఇప్పుడుదే జరుగుతోంది. ప్రజలు ఇచ్చిన తీర్పును తప్పుగా అర్థం చేసుకున్న వైసీపీ ప్రభుత్వ వరసగా తప్పులు చేసుకుంటూ పోతోంది. నిజానికి వైసీపీ ప్రభుత్వం తప్పులు ఎప్పుడోనే గీతను దాటాయి .. ఇప్పుడు  ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటన సందర్భంగా చోటు  చేసుకున్న పరిణామాలు ప్రమాద స్థాయినీ దాటి పోయాయి. ప్రజాస్వామ్య మనుగడకు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి.  

మూడున్నరేళ్ళలో టన్నుల కొద్దీ తప్పులు చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, ఇప్పడు, ప్రజలు, ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు జీఓ1, తెచ్చింది. ప్రతిపక్ష గళం వినిపించకుండా చేసేందుకు సభలు, సమావేశాలు, రోడ్ షో ల పై నిషేధం విధించి. ఇందులో భాగంగానే  కుప్పంలో మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు సభలను అడ్డుకోవడమే కాకుండా, అవమానించింది.

 పోలీసులు  చిత్రంగా చరిత్రలో ఎప్పుడూ ఎక్కడా వినని విధంగా మహిళలు తమపై హత్యాయత్నం చేశారని కేసులు పెట్టారు. నిజానికి, ఇది శిశుపాలుడు చేసిన చివరి తప్పును మించిన దుర్మార్గం. బ్రిటిష్ కాలంలో కూడా పోలీసులు ఇంత దుర్మార్గానికి ఒడి కట్టలేదు. అందుకే, ఇప్పుడు ప్రజలు సుదర్శన చక్రం, ప్రజాస్వామ్య వజ్రాయుధం సిద్దం చేసుకుంటున్నారు .. ఎన్నికల  సుముహుర్తం కోసం ఎదురు చూస్తున్నారు.

By
en-us Political News

  
ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఏడాది దీపావళి వేడుకలను అత్యంత ప్రత్యేమైన ప్రాంతంలో జరుపుకున్నారు.
రెక్కల కష్టంతో బతుకులు.. రోడ్డు ప్రమాదంతో ఆవిరైన ప్రాణాలు.!
హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది.
పండుగ వేళ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉత్సాహపూరిత వాతావరణం నెలకొంది.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.