జనసైనికులపై పవన్ కల్యాణ్ ఫైర్.. ఎందుకంటే?

Publish Date:Jul 10, 2026

Advertisement

జనసేన నాయకులు, క్యాడర్ పొలిటికల్ గా యాక్టివ్ గా ఉండటం లేదా. ప్రభుత్వంలో భాగస్వామి పార్టీ అయినప్పటికీ,  అన్ని విషయాలలోనూ అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారా? అంటే తాజాగా జనసేనాని పవన్ కల్యాణ్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఇచ్చిన సూచనలు, వ్యక్తంచేసిన ఆగ్రహం చూస్తే ఔనన్న సమాధానమే వస్తున్నది. 

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మిత్రపక్షాలు, అధికారంలో  భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన పార్టీల   శైలిపై  ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ముఖ్యంగా ప్రతిపక్షాల నుంచి వచ్చే విమర్శలను తిప్పికొట్టే విషయంలో జనసేన ఏమంత యాక్టివ్ గా లేదన్నది వాస్తవమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక ఈ విషయంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా పార్టీ లీడర్లు, క్యాడర్ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఆయన పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఆఖరికి ప్రభుత్వంలో తమ పార్టీ తరఫున మంత్రులుగా ఉన్నవారికీ ఓ రేంజ్ లో క్లాస్ పీకారు.  

ప్రత్యర్థులు చేసే ఆరోపణలను  దీటుగా తిప్పికొట్టాలని, సోషల్ మీడియాలో జరిగే దుష్ప్రచారాన్ని గట్టిగా ఖండించాలనీ చాలా సీరియస్ గా పార్టీ లీడర్, క్యాడర్ కు ఆదేశాలు ఇచ్చారు.  గత రెండు మూడు నెలలుగా పవన్ కల్యాణ్ పలు సందర్భాలలో ఇదే విషయాన్ని పార్టీ నాయకులకు, కార్యకర్తలకు చెప్పారు. అయినా పార్టీ  నేతల నుంచి, శ్రేణుల నుంచీ పెద్దగా స్పందన లేకపోవడంతో ఈ సారి మరింత సీరియస్ గా ఇక యాక్టివ్ గా ఉండి తీరాలని ఒక విధంగా విస్పష్ట ఆదేశాలు జారీ చేశారు.  

పార్టీలో ఎవరో ఒకరిద్దు మాత్రమే..అది కూడా అడపాదడపా మాత్రమే స్పందిస్తున్నారని పవన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.    ఇటీవల  రాష్ట్ర రాజకీయాల్లో  ప్రశ్న రావణ్  అరెస్టు, అతడిపై,   ఉపా చట్టం కింద కేసుఅంశాలు పెను సంచలనంగా మారాయి. ఈ విషయంలో  వైసీపీ సామాజిక మాధ్యమ విభాగాలు పవన్ కల్యాణ్ ను లక్ష్యంగా చేసుకుని విమర్శల దాడి చేస్తున్నాయి.   అయినా జనసేన నుంచి పెద్దగా స్పందన కనిపించడం లేదు. వైసీపీ దుష్ప్రచారాన్నీ, విమర్శల దాడిని తిప్పికొట్టే ప్రయత్నాలేవీ జనసేన నుంచి జరగడం లేదు. దీంతో ఏకపక్షంగా వైసీపీ చేస్తున్న ప్రచారం జనంలోకి బలంగా వెళ్లి, అదే వాస్తవమన్న భ్రమలో ప్రజలు పడే ప్రమాదం ఉంది. దీంతో జనసేనాని తీవ్ర అసహనానికి లోనై పార్టీ లీడర్లకు గట్టిగా క్లాస్ పీకారంటున్నారు.  

ఈ విషయంలో జనసేనాని.. పార్టీ లీడర్లు క్యాడర్లకు..  తెలుగుదేశం పార్టీని చూసైనా నేర్చుకోండంటూ ఒకింత ఘాటుగానే మందలించారని పార్టీ శ్రేణుల ద్వారా తెలుస్తోంది.  తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై ప్రత్యర్థులు చిన్న విమర్శ చేసినా..రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచీ తెలుగుతమ్ముళ్లంతా ఏకతాటిపైకి వచ్చి కౌంటర్లు ఇవ్వడాన్ని జనసేనాని తన పార్టీ వారికి ఉదహరించినట్లు చెబుతున్నారు. ఇక నుంచి యాక్టివ్ అయి తీరాలని జనసేనాని ఈ సందర్భంగా పార్టీ నేతలకు స్పష్టమైన ఆదేశం ఇచ్చినట్లు చెబుతున్నారు. 

Pawan Kalyan, Janasena leaders, TDP leaders, Chandrababu Naidu, AP Politics

By
en-us Political News

  
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఇండియా కూటమి నేతల విజ్ణప్తికి నో చెప్పారు. తనను కలవాలంటూ ఇండియా కూటమి నేతలు చేసిన అభ్యర్థనను ఆయన తిరస్కరించారు. రాజకీయ పార్టీల నేతలతో సమావేశం కావడం కుదరదని విస్పష్టంగా తేల్చేశారు.
ఏకంగా 21 పెళ్లిళ్లు చేసుకున్న బెగ్గర్.!
భారతీయ రాజకీయాల్లో ప్రస్తుతం ప్రధాన ఎన్నికల సంఘం (సీఈసీ) జ్నేಶ್ కుమార్ రాజీనామా డిమాండ్ కలకలం రేపుతోంది.
ఢిల్లీ నుంచి చెన్నై వెళ్తున్న ఇండిగో విమానంలో పవర్ బ్యాంక్‌లో మంటలు చెలరేగడం కలకలం రేపింది.
గోవా కేంద్రంగా సాగుతున్న డ్రగ్స్‌ దందా హైదరాబాద్‌ వరకు విస్తరించినట్లు పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
చంద్రబాబు అరెస్ట్ సమయంలో రోడ్డెక్కింది మేమే.. డిప్యూటీ సీఎం.!
పాత కరెన్సీ నోట్లకు భారీ మొత్తంలో డబ్బులు చెల్లిస్తామంటూ సోషల్ మీడియాలో ప్రకటనలు ఇచ్చి అమాయకులను మోసం చేస్తున్న సైబర్ నేరగాళ్ల
దేశ రాజధానిలో నిరసనల నేపథ్యంలో విధించిన కఠిన నిబంధనలపై సర్వోన్నత న్యాయస్థానం స్పందించింది.
తెలంగాణలోని సిద్దిపేట జిల్లా గజ్వేల్ తహసీల్దార్ కార్యాలయంలో చోటుచేసుకున్న ఒక దిగ్భ్రాంతికరమైన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్ల ఖరారు వంటి   కీలకమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకునే నిమిత్తం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశానికి  జనసేన అధినేత, ఉప ముఖ్య మంత్రి  పవన్ కల్యాణ్‌తో పాటు జనసేన మంత్రుల గైర్హాజర్ పొలిటికల్ చర్చలకు వేదికగా మారింది.
ఆడుతూ పాడుతూ గడపాల్సిన వయసులోనే ఐదేళ్ల చిన్నారి అరేలియా జీవితం విషాదాంతమైంది.
భర్త మంచానికే పరిమితమయ్యాడు.. కుటుంబ బాధ్యతలు ఓవైపు.. జీవితంలో ఎదురైన కష్టాలు మరోవైపు
2015లో ప్రారంభమైన ఈ పథకం కృష్ణా డెల్టా రైతులకు సాగునీటి భరోసా కల్పించడంలో కీలకంగా నిలిచింది.   కృష్ణా డెల్టాలో సాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు నీటి లభ్యతను స్థిరీకరించాలనే ఉద్దేశంతో నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టు నూటికి నూరు శాతం ఫలితాలను సాధించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.