ప్రశ్న రావణ్ ను వెనకేసుకొస్తారా?.. వైసీపీపై చంద్రబాబు ఫైర్.!

Publish Date:Jul 10, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్‌లో యూట్యూబర్  ప్రశ్న రావణ్ అరెస్ట్ వ్యవహారం రాజకీయంగా  సంచలనం సృష్టిస్తోంది. ఈ నెల 1న ఏపీ పోలీసులు అతడిని అరెస్ట్ చేసినప్పటి నుండి, రాష్ట్రంలో రాజకీయ,  సినీ, సామాజిక ప్రముఖులు అరెస్టును ఖండిస్తూనో, సమర్ధిస్తూనే స్పందిస్తూనే ఉన్నారు. ప్రశ్నించే గొంతుకలను కూటమి ప్రభుత్వం అణచివేస్తోందంటూ పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇటీవల ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ సైతం ఈ అరెస్ట్ అక్రమమంటూ ట్విట్టర్ వేదికగా ధ్వజమెత్తడంతో ఈ  చర్చనీయాంశంగా మారింది. ప్రశ్న రావణ్ అరెస్టుపై  వస్తున్న విమర్శలు, ఆరోపణల నేపథ్యంలో  ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తీవ్రంగా స్పందించారు.  

నంద్యాల జిల్లా బనగానపల్లెలో  మీ భూమి - మీ హక్కు బహిరంగ సభలో సీఎం చంద్రబాబు నాయుడు రావణ్ అరెస్టుపై వైసీపీ, ఇతరులు చేస్తున్న వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.  సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే నేరస్థులకు వైసీపీ ఇలా  బాహాటంగా మద్దతు ఇవ్వడం దారుణమన్నారు.   ప్రశ్న రావణ్ అనే వ్యక్తి ఎలాంటి వ్యాఖ్యలు చేశాడో, సమాజానికి ఎంతటి ముప్పుగా పరిణమించాడో ప్రజలంతా గమనించాలని కోరారు. పవిత్రమైన పురాణాలను, హిందూ సమాజ సెంటిమెంట్లను అత్యంత దారుణంగా దూషించడమే కాకుండా.. దేశ భద్రతకు ముప్పుగా పరిణమించిన తీవ్రవాదులు, ఉగ్రవాదులు,  శత్రుదేశమైన పాకిస్తాన్‌కు అనుకూలంగా ఆ వ్యక్తి బహిరంగంగా మద్దతు తెలిపాడని చంద్రబాబు ఆరోపించారు. 

ఇలాంటి దేశద్రోహ, మత విద్వేషపూరిత ఆలోచనలు ఉన్న వ్యక్తిని వెనకేసుకొస్తూ, అతడికి ప్రజాస్వామ్యవాదిగా రంగు పూసి రాష్ట్రంలో మళ్లీ మత కలహాలు రేపాలని వైసీపీ  కుట్ర పన్నుతున్నదని విమర్శించారు. గతంలో వైఎస్ వివేకానంద రెడ్డిని అత్యంత కిరాతకంగా హత్య చేసి, ఆ నిందను తమపై వేస్తూ  నారాసుర రక్తచరిత్ర అంటూ  ఎలాగైతే విష ప్రచారం చేశారో.. ఇప్పుడు కూడా సరిగ్గా అదే  ఫార్ములాను వాడుతున్నారన్నారు. ఇప్పుడు ప్రశ్న రావణ్‌ను అడ్డం పెట్టుకుని కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తే ప్రభుత్వం సహించబోదని విస్పష్ట హెచ్చరిక చేశారు.   

 ఐదేళ్ల వైసీపీ  పాలనలో ఆంధ్రప్రదేశ్   గంజాయి, డ్రగ్స్,  రౌడీయిజానికి కేరాఫ్ అడ్రస్‌గా మారిందన్న చంద్రబాబు వైసీపీ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా వందలాది ఆలయాలపై దాడులు జరిగాయని,  రథాలను తగలబెట్టారని, అయినప్పటికీ నాటి జగన్ ప్రభుత్వం ఒక్కరిపై కూడా కఠిన చర్యలు తీసుకోలేకపోయిందని విమర్శించారు. రాయలసీమ ప్రాంతాన్ని తాము  రతనాల సీమగా మార్చి అభివృద్ధి వైపు నడిపిస్తుంటే, వైసీపీ మాత్రం ఫ్యాక్షన్ రాజకీయాలతో  రక్త చరిత్ర రాసేందుకు ప్రయత్నిస్తోందని చంద్రబాబు ఆరోపించారు. 

Prashna Ravan Arrest, Banaganapalle AP Meeting, YSRCP Vs TDP Politics, Prakash Raj Tweets AP, Andhra Pradesh Latest News

By
en-us Political News

  
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఇండియా కూటమి నేతల విజ్ణప్తికి నో చెప్పారు. తనను కలవాలంటూ ఇండియా కూటమి నేతలు చేసిన అభ్యర్థనను ఆయన తిరస్కరించారు. రాజకీయ పార్టీల నేతలతో సమావేశం కావడం కుదరదని విస్పష్టంగా తేల్చేశారు.
ఏకంగా 21 పెళ్లిళ్లు చేసుకున్న బెగ్గర్.!
భారతీయ రాజకీయాల్లో ప్రస్తుతం ప్రధాన ఎన్నికల సంఘం (సీఈసీ) జ్నేಶ್ కుమార్ రాజీనామా డిమాండ్ కలకలం రేపుతోంది.
ఢిల్లీ నుంచి చెన్నై వెళ్తున్న ఇండిగో విమానంలో పవర్ బ్యాంక్‌లో మంటలు చెలరేగడం కలకలం రేపింది.
గోవా కేంద్రంగా సాగుతున్న డ్రగ్స్‌ దందా హైదరాబాద్‌ వరకు విస్తరించినట్లు పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
చంద్రబాబు అరెస్ట్ సమయంలో రోడ్డెక్కింది మేమే.. డిప్యూటీ సీఎం.!
పాత కరెన్సీ నోట్లకు భారీ మొత్తంలో డబ్బులు చెల్లిస్తామంటూ సోషల్ మీడియాలో ప్రకటనలు ఇచ్చి అమాయకులను మోసం చేస్తున్న సైబర్ నేరగాళ్ల
దేశ రాజధానిలో నిరసనల నేపథ్యంలో విధించిన కఠిన నిబంధనలపై సర్వోన్నత న్యాయస్థానం స్పందించింది.
తెలంగాణలోని సిద్దిపేట జిల్లా గజ్వేల్ తహసీల్దార్ కార్యాలయంలో చోటుచేసుకున్న ఒక దిగ్భ్రాంతికరమైన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్ల ఖరారు వంటి   కీలకమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకునే నిమిత్తం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశానికి  జనసేన అధినేత, ఉప ముఖ్య మంత్రి  పవన్ కల్యాణ్‌తో పాటు జనసేన మంత్రుల గైర్హాజర్ పొలిటికల్ చర్చలకు వేదికగా మారింది.
ఆడుతూ పాడుతూ గడపాల్సిన వయసులోనే ఐదేళ్ల చిన్నారి అరేలియా జీవితం విషాదాంతమైంది.
భర్త మంచానికే పరిమితమయ్యాడు.. కుటుంబ బాధ్యతలు ఓవైపు.. జీవితంలో ఎదురైన కష్టాలు మరోవైపు
2015లో ప్రారంభమైన ఈ పథకం కృష్ణా డెల్టా రైతులకు సాగునీటి భరోసా కల్పించడంలో కీలకంగా నిలిచింది.   కృష్ణా డెల్టాలో సాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు నీటి లభ్యతను స్థిరీకరించాలనే ఉద్దేశంతో నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టు నూటికి నూరు శాతం ఫలితాలను సాధించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.