చిన్నారి జ్ణానేశ్వరి అదృశ్యంపై పవన్ సమీక్ష

Publish Date:Jun 13, 2026

Advertisement

కాకినాడ జిల్లా తుని మండ లం సీహెచ్ అగ్రహారంలో గత వారం రోజులుగా అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం చేపడుతున్న గాలింపు చర్యలపై  రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోసారి సమీక్షించారు.   కాకినాడ జిల్లా ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడి దర్యాప్తు పురోగతిపై ఆరా తీశారు. చిన్నారి ఆచూకీని త్వరిత గతిన కనుగొనేందుకు ప్రస్తుతం పనిచేస్తున్న పోలీసు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు ఎన్డీ ఆర్ఎఫ్ సేవలను కూడా వినియోగించుకోవాలని ఉప ముఖ్యమంత్రి సూచించారు.

 అలాగే దట్టమైన అటవీ ప్రాంతాల్లో గాలింపు కోసం అటవీశాఖ నైట్ వాచర్స్, బేస్ క్యాంప్ వాచర్స్, ఇతర నిపుణుల సహకారం తీసుకుని పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా జల్లెడ పట్టాలని ఆదేశించారు.ఇప్పటికే ఈ ఘటనపై పలుమార్లు పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడిన పవన్ కళ్యాణ్..  వారం రోజులుగా బాలిక ఆచూకీ లభించకపోవడంతో దర్యాప్తును మరింత వేగవంతం చేయాలని స్పష్టం చేశారు.

కాకినాడ జిల్లా ఎస్పీ వివరాల ప్రకారం, చిన్నారి కోసం ప్రస్తుతం 400 మంది కిపైగా సిబ్బంది గాలింపు చర్యల్లో పాల్గొంటున్నారు. అత్యాధునిక డ్రోన్ల సహా యంతో విస్తృతంగా శోధనలు కొనసాగుతున్నాయి. అలాగే బాలిక ఇంటి పరిసరాల్లోని 38 సీసీ కెమెరాల ఫుటేజీని పోలీ సులు ఇప్పటికే పరిశీలిం చారు.  

By
en-us Political News

  
హైదరాబాద్‌లో వేల కోట్ల భూకబ్జా యత్నం.. ఎంపీ కేశినేని చిన్నిపై కేసుకు నాని ఆరోపణలు..
రేవంత్ రెడ్డికి తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేదు.. అందుకే ఆ మౌనం...
హైదరాబాద్ ఐటీ కారిడార్‌లోని ప్రముఖ రెస్టారెంట్లపై సైబరాబాద్ సీఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు
హైదరాబాద్‌లో అర్ధరాత్రి వేళ తీవ్ర కలకలం రేగింది.
ప్రేమ అనేది ఒక మధురమైన అనుభూతి, కానీ నేటి సమాజంలో కొందరు వ్యక్తులు దానిని ఒక మూర్ఖపు పంతంగా మార్చుకుంటున్నారు.
పూజలు, వ్యాపారాల పేరుతో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు భారీ టోకరా...
ఏపీలో స్మార్ట్ కిచెన్లపై అసత్య ప్రచారాలు నమ్మొద్దు..జగన్ వ్యాఖ్యలపై ఆగ్రహం..
ఒకే కుటుంబంలో ఎనిమిది మందికి రక్తగాయాలు.. అసలేం జరిగింది..?
రాజధాని అమరావతి ప్రాంతంలో పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పెరిగిపోయింది.
మేడ్చల్ జిల్లా బోడుప్పల్ పరిధిలోని దేవేందర్ నగర్‌లో ఆనందంగా సాగాల్సిన గృహప్రవేశ వేడుక ఒక్కసారిగా భయానకంగా మారింది.
దేశంలో వరుస ప్రశ్నపత్రాల లీకేజీల పరంపర నిరుద్యోగులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.
ప్రతి చిన్నారి ఆరోగ్యమే లక్ష్యం..రాష్ట్రవ్యాప్తంగా పల్స్ పోలియో డ్రైవ్.
స్నాప్‌చాట్ పరిచయం.. హోటల్‌లో ఉచ్చు..యువకుడు అరెస్ట్
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.