మన్యంలో నేలలో అపార ఖనిజ సంపద.. గిరిజనుల బతుకులు మారేదెప్పుడు..!

Publish Date:Aug 10, 2026

Advertisement

 

మన్యం నేలలో నిధులు.. మారని మన్యం బిడ్డల రాత..!

కొండల్లో కోటానుకోట్ల విలువైన ఖనిజ సంపద... కాళ్ళ కిందే అపరిమితమైన బంగారు గని లాంటి బాక్సైట్ నిల్వలు..! కానీ, ఆ మట్టిపై తాతల ముత్తాతల నుంచి బతుకుతున్న గిరిజనుడి జీవితంలో మాత్రం ఎలాంటి మార్పూ రాలేదు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా, ఇంకా అడవి తల్లి ఒడిలోనే పేదరికంతో, రోగాలతో, సరైన ఉపాధి లేక అలమటిస్తున్న మన్యం బిడ్డల కన్నీటి గాథ ఇది. అపరిమిత సంపద ఉన్న ప్రాంతంలో పుట్టి కూడా, దిక్కులేని బతుకులు ఈడుస్తున్న వారి స్థితిగతులు నేటికీ సమాజాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నాయి. ఇలాంటి మరిన్ని పలు అంశాలపై తెలుగు వన్‌ ఎండీ కంఠమనేని రవిశంకర్, ఏపీ మాజీ గనుల డైరెక్టర్ డాక్టర్ వి.డీ రాజగోపాల్ మధ్య ఆసక్తికర విశ్లేషణ జరిగింది


దళారుల దోపిడీ నుంచి కట్టెల మోపుల వరకు... ఆరని ఆవేదనతరతరాలుగా కొండల్లో లభించే అటవీ ఉత్పత్తులను మోసుకొచ్చి వారపు సంతల్లో అమ్ముకోవడమే మన్యం ప్రజల ప్రధాన బతుకు దెరువు. గతంలో దళారులు ఆ అమాయక గిరిజనులను ఏ స్థాయిలో దోచుకున్నారో అందరికీ తెలిసిందే. పది రూపాయల విలువైన వస్తువును కేవలం పది పైసలకే కొట్టేసి, వారి రెక్కల కష్టాన్ని నట్టేట ముంచేవారు. ఆ తర్వాత గిరిజన సహకార సంస్థ (GCC) వంటివి అందుబాటులోకి వచ్చి కొంతవరకు మద్దతు ధర అందించినప్పటికీ, గిరిజనుల జీవితాల్లో రావాల్సిన పూర్తిస్థాయి ఆర్థిక విప్లవం ఇంకా రాలేదు. 

నేటికీ 70 ఏళ్ల వయసొచ్చిన పసితనం చావని తాతలు, అవ్వలు కొండల్లో కట్టెల మోపులు తలపై పెట్టుకుని కిలోమీటర్ల కొద్దీ నడుస్తూ బతుకీడుస్తున్న దృశ్యాలు మన్యంలో గుండెలను పిండేస్తుంటాయి. మైనింగ్ భయాలు vs ప్రగతి అవకాశాలు ఏజెన్సీ ప్రాంతాల్లోని బాక్సైట్ నిల్వలను సమర్థవంతంగా, పర్యావరణానికి భంగం వాటిల్లకుండా వినియోగిస్తే అక్కడ అద్భుతమైన మార్పులు సాధ్యమవుతాయి. మైనింగ్ అనగానే కేవలం పర్యావరణ విధ్వంసమనో, గిరిజనులను వెళ్లగొడతారనో భయపెట్టే రాజకీయాలే తప్ప... పర్యావరణ పరిరక్షణతో పాటు వారి బతుకుల్లో వెలుగులు నింపేలా ఆలోచించే నాయకత్వం కరువైంది.

బాక్సైట్ వంటి రా మెటీరియల్ ఆధారంగా స్థానికంగానే అల్యూమినియం కేబుళ్లు, విండో ప్యానెళ్లు, ఫాయిల్స్ తయారు చేసే సమగ్ర పరిశ్రమలను నెలకొల్పితే, మన గిరిజన యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి అక్కడే ఉపాధి కల్పించవచ్చు. అంతేకాకుండా, మైనింగ్ నిర్వహించే కార్పొరేట్ కంపెనీల సామాజిక బాధ్యత (CSR) నిధులతో గిరిజన గూడేలలో నాణ్యమైన ఇంగ్లీష్ మీడియం స్కూళ్లు, అధునాతన వైద్య సదుపాయాలు ఉన్న ఆసుపత్రులు నిర్మించవచ్చు. శారీరక కష్టం చేయలేని వయోవృద్ధులకు ప్రతి నెలా గౌరవప్రదమైన పెన్షన్లు అందించే వెసులుబాటు కలుగుతుంది. పర్యావరణ పరిరక్షణ  జల వనరులుమైనింగ్ పూర్తయిన తర్వాత రీఫారెస్టేషన్ (అడవుల పెంపకం) చేయడం  ఏర్పడే పెద్ద గుంతలను నీటి నిల్వ జలాశయాలుగా మార్చడం ద్వారా భూగర్భ జలాలను పునరుద్ధరించవచ్చు. 

గతంలో విజయనగరం ప్రాంతంలో అబాండన్డ్ మ్యాంగనీస్ గనుల్లో పడిఉన్న నీటిని పంపింగ్ చేసి పంట పొలాలకు అందించినట్లే, సరైన ప్రణాళిక ఉంటే మైనింగ్ తర్వాత ఏర్పడే జల వనరులను చుట్టుపక్కల వ్యవసాయానికి, తాగునీటికి వినియోగించుకోవచ్చు. మన్యం బిడ్డలు కేవలం ఎన్నికలప్పుడు వాడుకునే ఓటు బ్యాంకుగా మిగిలిపోకూడదు. అమాయక గిరిజనులకు నిజమైన అభివృద్ధి అంటే ఏమిటో వివరించి, పర్యావరణ నిబంధనలను కఠినంగా అమలు చేస్తూనే వారిని ప్రగతి బాట పట్టించాల్సిన బాధ్యత మన పాలకులు, సమాజంపై ఉంది. ఆ పచ్చటి కొండల వెనుక దాగివున్న సంపద ఫలితాలు మన్యం గూడేలలోని ప్రతీ ఇంట చిరునవ్వులు పూయించినప్పుడే అసలైన అభివృద్ధి సాధ్యమవుతుంది. పూర్తి చర్చను టోన్ న్యూస్ యూట్యూబ్ ఛానల్‌లో తప్పక వీక్షించండి.

 

 

AP Bauxite Mining, AP Tribal Development,  Agency Area Bauxite Wealth, AP Mineral Resources,
Tribal Livelihood AP, Tone News Intellectual Talks, Tribal CSR Funds, Visakhapatnam Agency Bauxite

By
en-us Political News

  
అమెరికాలో వైద్యులను సంప్రదించకుండా చాట్‌జీపీటీ సలహా మేరకు మూర్ఛ మందుల మోతాదును తగ్గించిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ బోవెన్ వాన్ ఆకస్మిక మృతి చెందింది. ఈ ఘటనపై ఆమె తల్లిదండ్రులు OpenAIపై వేసిన సంచలన దావా వివరాలు.
హైదరాబాద్‌ పర్యటనకు వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను వారిరువురూ బేగంపేటలో  ఐటీసీ కాకతీయ హోటల్‌లో సోమవారం (నవంబర్ 2)న కలిశారు.  ఈ సందర్భంగా వారు సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న  సైబర్ సవాళ్ల ను వివరించారు. ప్రధానంగా ఏఐ టెక్నాలజీ దుర్వినియోగం, డీప్ ఫేక్, మార్ఫింగ్ ద్వారా సినీ ప్రముఖుల ఫొటోలు, వీడియోలను అసభ్యకరంగా, అనుచిత రీతిలో అభ్యంతరకరంగా సామాజిక మాధ్యమంలో ప్రచారం చేస్తున్నారని ఈ సందర్భంగా చిరంజీవి అమిత్ షాకు తెలిపారు.
భారతదేశానికి జంబుద్వీపం అనే పేరు ఎలా వచ్చింది? పూజల సంకల్పంలో జంబుద్వీపం అని ఎందుకు అంటారు? పురాణాలు మరియు చరిత్ర తెలిపే ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోండి.
Before choosing a group health insurance plan, you should consider the eligibility criteria and check whether the insurer has a smooth claim processing. Let us explore what are the group health insurance benefits in more detail.
ప్రాథమిక సమాచారం ప్రకారం, ఆసుపత్రి నిర్వహణకు సంబంధించిన ఆర్థిక వనరులు, లావాదేవీలపై ఐటీ   ప్రత్యేక దృష్టి పెట్టింది. గత కొంతకాలంగా పెద్ద మొత్తంలో జరిగిన నగదు లావాదేవీలకు సరైన లెక్కలు లేకపోవడం, పన్ను చెల్లింపుల్లో వ్యత్యాసాలు ఉండటమే ఈ దాడులకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.
అలాంటి అరుదైన, విలక్షణమైన వన్యప్రాణుల జాబితాలో ఇండోనేషియాలోని సులవేసి ద్వీపానికి చెందిన  మ్యాక్రోసెఫాలోన్ మెలియో పక్షి  జాతి ఒకటి. సాధారణ పక్షుల వలె చెట్లపై గూళ్లు కట్టుకుని, గుడ్లను పొదిగే సంప్రదాయ పద్ధతికి ఇది పూర్తి భిన్నం. ఈ పక్షి జీవన శైలి  అడవి కోడిని పోలి ఉంటుంది.
ఈ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, వాతావరణ రాడార్లు అందుబాటులోకి రాకముందే..   పూర్వీకులు చెట్లను, జంతువులను, కీటకాలను గమనించి రానున్న విపత్తులను అంచనా వేశారు. ఆ అంచనాలు దాదాపు కచ్చితంగా ఉండేవి. పర్యావరణంలో వచ్చే చిన్న చిన్న మార్పులను,  భూగర్భంలో జరిగే అలజడిని మనుషుల కంటే ముందుగా వృక్షజాలం పశుపక్ష్యాదులు పసిగడతాయని శాస్త్రీయ అధ్యయనాలుచెబుతున్నాయి.
ఈనాడు సంస్థల వ్యవస్థాపకుడు చెరుకూరి రామోజీరావు జీవిత విశేషాలు, ఆయన అవలంబించిన వ్యాపార విధానాలు మరియు ఎదుర్కొన్న రాజకీయ సవాళ్లపై ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డి.ఎన్. ప్రసాద్  తెలుగువన్ ది జర్నలిస్ట్ మూడో  ఎపిసోడ్‌లో  తెలుగువన్ ఎండీ  రవిశంకర్ తో పంచుకున్నారు.  
ఉపాధి కోసం వలస వెళ్లిన కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బట్టలు ఉతికేందుకు కుంటకు వెళ్లిన ముగ్గురు నీటిలో మునిగి దుర్మరణం చెందారు. ఈ హృదయవిదారక ఘటన వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
న్యూయార్క్ సమీపంలోని ఆల్బనీ ప్రాంతంలో  నివాసముంటున్న ఆమె అమెరికా కాల మానం ప్రకారం గురువారం రాత్రి ఏడు గంటల సమయంలో ఖమ్మంలో ఉన్న తన తండ్రి నల్లమల్ల ఆనంద్ కుమార్ తో ఫోన్ లో మాట్లాడుతున్నారు. అలా మాట్లాడుతుండగానే  గుండె నొప్పితో కుప్పకూలిపోయారు.
జామో పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆలంపూర్ గ్రామంలో ఉన్న ఒక బాణసంచా తయారీ యూనిట్లో  భారీ పేలుడు సంభవించింది.   శుక్రవారం సాయంత్రం చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు  
తెలంగాణలో కూడా వచ్చేమూడు రోజులూ పలు చోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. వర్షాలు కురిసే సమయాల్లో పిడుగుపాటుకు అవకాశాలున్నందున విద్యుత్ స్తంభాలు, చెట్లకింద నిలబడవద్దని హెచ్చరించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.