మేం పెద్ద కాప్ లు అంటారు కానీ..
Publish Date:May 28, 2026
Advertisement
మాజీ జేడీ లక్ష్మీనారాయణ, ఐఏఎస్ తోట చంద్రశేఖర్, ఐఆర్ఎస్ రావెల కిషోర్ బాబు, ఐఆర్ఏఎస్ చింతల పార్ధసారథి, ఐఆర్ఎస్, మారిశెట్టి రాఘవయ్యా, అద్దేపల్లి శ్రీధర్, డేవిడ్ రాజు, పసుపులేటి సుధాకర్, యడ్లవల్లి గంగాధరం, బోలిశెట్టి సత్యనారాయణ.. ఎగ్సెట్రా ఎగ్సెట్రా.. వీళ్లంతా కూడా దాదాపు 80 శాతం మేర కాపు సామాజికవర్గ నాయకులే. 2019 డిజాస్టర్ ఓటమి తర్వాత, జనసేనను వదిలి పెట్టి వెళ్లిన వాళ్లే. అందుకే ఇటీవలి ఒక సమావేశంలో పవన్ , ఇవాళ వారుండి ఉంటే, డెపినెట్ గా ఏ రాజ్యసభకో పంపించి ఉండేవాళ్లమని అన్నారు. ఇక 2014 నుంచి పవన్ తో ట్రావెల్ చేస్తున్న వాళ్ళు ఎవరని చూస్తే.. నాదెళ్లమనోహర్, లింగమనేని రమేష్, తాళ్లూరిరామ్.. వీరంతా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు. చివరి ఇద్దరూ కూడా పవన్ కి, ఆయన పార్టీ జనసేనకు ఆర్థికంగా అండగా నిలబడిన వాళ్లే. పార్టీ ఆఫీస్ కూడా వీరిలో ఒకరిచ్చిన స్థలంలో కట్టిందే. ఇప్పుడు పవన్ సూచించిన సోకాల్డ్ పెద్ద మనుషులపై జనసైనికుల కామెంట్ ఏంటంటే.. పార్టీ కి పైసా పెట్టరు. పైసా బయటకు తియ్యరు. ఎట్ లీస్ట్ పైసా పెట్టేవాడిని పార్టీలోకి తీసుకు రారు. పైగా పార్టీ నుంచి వెళ్ళేప్పుడు ఏదో ఒక వంకర మాట అని వెళ్ళినవాళ్లే. మళ్లీ వీళ్లంతా కాపులు సీఎం అయ్యేది ఎప్పుడు? అంటూ ప్రశ్నిస్తుంటారు. అంతేనా పార్టీలో తమ సామాజికవర్గం వారికే పదవులు ఇవ్వాలని పట్టుబడుతుంటారు. వేరే వారికి ఎందుకిస్తారని నిరసన వ్యక్తం చేస్తుంటారు. కూటమి ధర్మం పాటించడం లేదని వాపోతుంటారు. కానీ చేయాల్సింది చేయరు. అందుకే జనసేన ఒక సామాజిక వర్గం కోసం పెట్టిన పార్టీ కాదని జనసేనాని పవన్ కల్యాణ్ విస్ఫష్టంగా చెబుతారు. నిజంగా సామాజిక వర్గంపై అంత అభిమానం ఉంటే.. వారే ఒక కేండెట్ ని అనౌన్స్ చేసి.. ప్రచారం చేసి.. ఓట్లెందుకు వేయించుకోరు? అంటూ ప్రశ్నించారు పవన్ కల్యాణ్. కాబట్టి మేం పెద్ద కాప్ లం అని విర్రవీగుతున్న వీరు.. ఇకనైనా గ్రౌండ్ రియాల్టీ తెలుసుకుని.. ఆపై కామెంట్లు చేస్తే బాగుంటుందన్న సలహా ఇస్తున్నారు పవన్ కల్యాణ్
http://www.teluguone.com/news/content/pawan-kalyan-clarifies-janasena-belongs-all-36-221127.html





