పవన్ సోలో!.. 'అన్నయ్య' జగన్నాటకానికి 'తమ్ముడు' బలి!!
Publish Date:Feb 12, 2022
Advertisement
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవినే కావొచ్చు.. సూపర్‌స్టార్ మహేశ్‌బాబు.. రెబెల్ స్టార్ ప్రభాస్‌లే కావొచ్చు కానీ.. వీరందరినీ మించిన స్టార్, పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఒకరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా.. తమ్ముడు తమ్ముడే.. అన్నయ్య అన్నయ్యే. చిరంజీవి, మహేశ్, ప్రభాస్‌లు కనిపిస్తే చేతులు ఊపుతారేమో కానీ పవన్ వస్తే మాత్రం ఫ్యాన్స్‌కు పూనకాలే. అదీ తమ్ముడి రేంజ్. అలాంటిది.. సీఎం జగన్‌రెడ్డితో టాలీవుడ్ ప్రముఖుల మీటింగ్ సందర్భంగా పవన్ కల్యాణ్ ఊసే లేదు. భేటీ ముందురోజు జూనియర్ ఎన్టీఆర్ పేరైతే వినిపించింది కాదు ఆ సీన్‌లో ఆయన లేరు. చిరంజీవి ఇంతకుముందే జగన్‌తో రెండుసార్లు పర్సనల్‌గా సమావేశమయ్యారు. నాగార్జున సైతం వన్ టూ వన్ భేటీ జరిపారు. లేటెస్ట్ మీటింగ్‌లో చివరికి అలీ, పోసానిలనూ పిలిచారు కానీ.. పవన్ ప్రస్తావనే రాలేదు. జనసేన, వైసీపీల మధ్య రాజకీయ వైరం ఉంది కాబట్టి పీకేకు తాడేపల్లి ప్యాలెస్‌లోకి ఎంట్రీ లేదనుకుందాం. కనీసం.. ఈ టికెట్ ధరల ఎపిసోడ్‌లో కొన్నినెలలుగా పవన్ కల్యాణ్ పేరే వినిపించకుండా చాలా జాగ్రత్తగా రాజకీయం చేస్తున్నారు జగనన్న. ఆ జగన్నాటకంలో ముఖ్య పాత్రధారి, సూత్రధారి ఆ తమ్ముడి అన్నయ్య చిరంజీవే కావడం ఆసక్తికరం. అవును, చిరంజీవి వల్లే పవన్ సోదిలో కూడా లేకుండా పోయారనేది జనసైనికుల మంట. తమకు బద్దవిరోధి అయిన జగన్‌రెడ్డితో చిరంజీవి పదే పదే భేటీ కావడాన్ని పీకే ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు. ఓకే, ఏదో ఇండస్ట్రీ కోసం చొరవ చూపారే అనుకున్నా.. మీటింగ్‌లో మరీ అంత దీనంగా.. మెగాస్టార్ అంతటి వారు చేతులు జోడించి జగన్‌రెడ్డిని వేడుకోవడం.. ఆ వీడియోను కావాలనే వైసీపీ వర్గాలు వైరల్ చేయడంపై మంటగా ఉన్నారు మెగా అభిమానులు. అదే చిరు ప్లేస్ లో పవన్ ఉండిఉంటేనా... చేతులు జోడించడం కాదు, తాట తీసేవారని సోషల్ మీడియాలో మదనపడుతున్నారు. వకీల్ సాబ్ రిలీజ్ అప్పటి నుంచే టికెట్ ధరల వివాదం నడుస్తోంది. అప్పుడు అన్నయ్య పెద్దగా స్పందించలేదు. ఆ తర్వాత ఓ సినిమా ఫంక్షన్లో తమ్ముడు రెచ్చిపోయారు. జగన్ సర్కారును, మంత్రి పేర్ని నానిని సన్నాసులంటూ ఏకిపారేశారు. ఏం చేసుకుంటారో చేసుకోండి.. తగ్గేదేలేదంటూ చెడామడా వాయించేశారు. పీకే అంతలా రెచ్చిపోతే.. చిరు మాత్రం ఇంతలా దిగజారిపోవడాన్ని ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. వకీల్‌సాబ్ సినిమా అప్పుడు సైలెంట్‌గా ఉన్న అన్నయ్య.. ఆచార్య రిలీజ్ వచ్చే సరికి యాక్టివ్ అయ్యారని.. అప్పుడు తమ్ముడి పక్షాన ఫైట్ చేయకుండా.. ఇప్పుడు ఇండస్ట్రీ కోసం, తన సినిమా కోసం తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ పరేడ్‌లు చేయడాన్ని తప్పుబడుతున్నారు. టోటల్ ఎపిసోడ్‌లో పవన్ కల్యాణ్ ఒంటరి వాడయ్యాడనే ఫీలింగ్. కొంతకాలంగా పీకే సైలెంట్‌గా ఉన్నారు.. జనసైనికులు సైతం కామ్ అయ్యారు. వర్మ లాంటి వారు కూడా ఏదో ట్రై చేశారు కానీ.. పవర్‌స్టార్ మాత్రం ఈ మధ్య కాలంలో ఆ టాపికే తీసుకురాలేదు. ఇదే.. జగనన్నకు కావలసింది. తనకు పొలిటికల్ ఎనిమీగా మారిన జనసేనానిని మాగ్జిమమ్ సైడ్ చేసేందుకే చిరంజీవిని తెరమీద ప్రమోట్ చేశారని అంటున్నారు. ఏపీలో బలంగా ఉన్న మెగా ఫ్యాన్స్‌ను.. చిరు ఫ్యాన్స్, పవన్ ఫ్యాన్స్‌గా విడగొట్టే కుట్రలో భాగంగానే.. మెగాస్టార్‌ను ప్యాలెస్ చుట్టూ తిప్పించుకున్నారని.. రాజ్యసభ సీటు అంటూ ప్రచారం చేయించారని.. చెబుతున్నారు. అసలు సినిమా టికెట్ ధరలు తగ్గించిందే పవన్ కల్యాణ్‌ను దెబ్బకొట్టేందుకనే అనుమానం ఉండగా.. ఇప్పుడు చిరంజీవితో ప్యాలెస్‌లో జగన్నాటకం ఆడించి.. అన్నయ్యతో తమ్ముడిని సైడ్ చేయించారనే ప్రచారం జరుగుతోంది. ముందున్నది అన్నయ్యే కాబట్టి.. తమ్ముడు సైతం సైలెంట్ మోడ్‌లో ఉన్నారని.. కానీ, సమయం, సందర్భం వచ్చినప్పుడు మళ్లీ చెగువేరాలా రెచ్చిపోవడం ఖాయమని.. జనసేనానిగా జగన్‌రెడ్డి సినిమా డ్రామాలో పీకేనే హీరోగా మారుతారని అంటున్నారు ఫ్యాన్స్.
http://www.teluguone.com/news/content/pawan-kalyan-become-silent-in-tollywood-issue-39-131694.html





