పరస్పర అంగీకారంతో విడిపోతున్నాం: పవన్, అన్నా సంయుక్త ప్రకటన: 13 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు.!
Publish Date:Nov 9, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆయన భార్య అన్నా కొణిదెల తాము విడాకులు తీసుకుంటున్నట్లు చేసిన సంయుక్త ప్రకటన సంచలనంగా మారింది. . తామిరువురం పరస్పర అవగాహనతో ఒకరిపై ఒకరుసంపూర్ణ గౌరవంతో విడిపోతున్నామని వారా ప్రకటనలో పేర్కొన్నారు. తమ వివాహ బంధం ఒక ముగింపునకు వచ్చిందని పవన్, అన్నా ఆ ప్రకటనలో స్పష్టం చేశారు. భార్యాభర్తలుగా తమ విడిపోయినప్పటికీ స్నేహితులుగా కలిసే ఉంటామని పేర్కొన్నారు. పిల్లల బాధ్యతలను ఇద్దరం చూసుకుంటామనీ, . ఇది పూర్తి అవగాహనతో తీసుకున్న వ్యక్తిగత నిర్ణయం అని, ఈ సమయంలో తమ గోప్యతను గౌరవించాలని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. 1996లో నందిని పవన్ వివాహం చేసుకున్నారు. పరస్పర విభేదాల తర్వాత 2008లో వీరికి విడాకులు మంజూరయ్యాయి. ఆ తర్వాత ప్రముఖ నటి రేణు దేశాయ్ ను పవన్ 2009లో వివాహం చేసుకుని, 2012లో విడాకులు తీసుకున్నారు. వీరికి అకిరా నందన్, ఆద్య సంతానం. రష్యన్ నటి అన్నా లెజెనేవా (అన్నా కొణిదెల)ను 2013లో పవన్ పెళ్లి చేసుకున్నారు. 13 ఏళ్ల వివాహ బంధం తర్వాత పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు సంయుక్త ప్రకటన ద్వారా వెల్లడించారు. దాదాపు పదమూడేళ్ల పాటు సాగిన వివాహ బంధం నుంచి పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు సోమవారం (నవంబర్ 9) రాత్రి సంయుక్త ప్రకటన ద్వారా వారు వెల్లడించారు. జనసేన అఫీషియల్ పోర్టల్స్ ద్వారా వారీ ప్రకటన విడుద చేశారు. తామిద్దరం కలిసి జీవితంలో ఎన్నో కీలక ఘట్టాలను పంచుకున్నామని, అయితే ఇప్పుడు పరస్పర గౌరవంతో విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్న వారు.. భార్యాభర్తలుగా తమ ప్రయాణం ముగిసినా, తమ మధ్య స్నేహం, పరస్పర అభిమానం, గౌరవం చెక్కుచెదరకుండా ఉంటాయని పేర్కొన్నారు. అదే విధంగా తమ పిల్లల బాధ్యతను చూసుకుంటామని, వారి సంక్షేమం, సంతోషమే తమ మొదటి ప్రాధాన్యతగా ఉంటుందని పవన్ కల్యాణ్, అన్నాఆ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తమ గోప్యతను గౌరవించాలనీ, తమకు అండగా నిలిచి, మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. వివాహ బంధం నుండి వైదొలుగుతున్నట్లు ప్రకటించినప్పటికీ, చట్టపరమైన ప్రక్రియలకు సంబంధించిన వివరాలను వారు ఆ ప్రకటనలో పేర్కొన లేదు. పరస్పర అంగీకారం మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. ఇది కూడా చదవండి: షాకిచ్చిన పవన్ కళ్యాణ్ సతీమణి: ఇన్స్టాగ్రామ్ డీయాక్టివేట్ అసలు కారణం ఇదేనా.? ఈ పరిణామానికి సంబంధించి గతంలో సోషల్ మీడియాలో వైరల్ అయిన అంశాలు ఇప్పుడు మళ్లీ విస్తృతంగా చర్చకు వస్తున్నాయి. అన్నా కొణిదెల కొద్ది వారాల క్రితమే తన ఇన్స్టాగ్రామ్ ఖాతాను పూర్తిగా డీయాక్టివేట్ చేశారు. మామూలుగా అన్నా కొణిదెల సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. పవన్ కళ్యాణ్‌తో కలిసి దిగిన జిమ్ ఫొటోలు, పీఠాపురం పర్యటన తదితర జ్ఞాపకాలను అభిమానులతో పంచుకునేవారు. ఆమె సోషల్ మీడియా నుంచి అకస్మాత్తుగా తప్పుకోవడం ఆ సమయంలో అందరి దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు పవన్, అన్నా సంయుక్త ప్రకటన నేపథ్యంలో ఆమె సోషల్ మీడియా నుంచి వైదొలిగిన అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల వివాహం సెప్టెంబర్ 2013లో జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలుఉన్నారు. ప్రజా జీవితంలో బిజీగా ఉండే పవన్ కళ్యాణ్, రాజకీయ బాధ్యతలను నిర్వర్తిస్తూనే కుటుంబ వ్యవహారాలను కూడా నిర్వహిస్తూ వచ్చారు. సుదీర్ఘకాలం పాటు సాగిన వీరి వైవాహిక బంధం ముగియడం రాజకీయ వర్గాలతో పాటు అభిమానులలోనూ విస్మయాన్ని కలిగించింది. మీకు నచ్చవచ్చు: పవన్ కళ్యాణ్ బాటలో అన్నా కొణిదెల.. 6,30,000 రూపాయలతో ప్రజా జీవితంలో ఉంటూనే వ్యక్తిగత నిర్ణయాలను పారదర్శకంగా వెల్లడించిన ఈ ఉదంతం డిజిటల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమైంది. ఇరువురి భవిష్యత్తు ప్రయాణం, పిల్లల బాధ్యతల నిర్వహణ ఏ విధంగా ఉంటుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. [Pawan Kalyan Anna Konidela Divorce, AP Deputy CM Pawan Kalyan Divorce, Pawan Kalyan wife separation, Combined Statement, TeluguOne]
http://www.teluguone.com/news/content/pawan-kalyan-anna-konidela-divorce-36-236682.html




