వాణిజ్యం పై రూపాయి విలువ తరుగుదల ప్రభావం...చర్చించనున్న పార్లమెంటరీ కమిటీ

Publish Date:Nov 1, 2022

Advertisement

వాణిజ్యం పై రూపాయి విలువ తరుగుదల ప్రభావం గురించి చర్చించడానికి పార్లమెంటరీ ప్యానల్ సంసిద్ధత వ్యక్తం చేయనుంది. అయితే దీని గురించి బిజేపీ సభ్యులు వ్యతిరేకించవచ్చుననే అభిప్రా యాలు లేకపోలేదు.  కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అభిషేక్ మను సింఘ్వీ నాయకత్వంలో  వాణిజ్య వ్యవహారాలపై  పార్టమెంటరీ స్టాండింగ్ కమిటీ  అనేక అంశాలు చర్చించేందుకు  సోమవారం సమావేశ మయింది. కమిటీ కొత్తగా రూపొందించిన తర్వాత సమావేశం కావడం ఇదే తొలిసారి. సమావేశంలో సంఘ్వీ వాణిజ్యంపై రూపాయి విలువ తరుగుదల ప్రభావం కూడా చర్చించా ల్సిన అంశంగా ప్రతి పాదించారు.  

అయితే సంఘ్వీ ప్రతిపాదనను ప్యానల్ సభ్యుడు,  బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే వ్యతిరేకించారు. రూపా యి విలువ తరగడమన్నది శాశ్వతం కాదు, కేవలం తాత్కాలికమే గనుక ఆ అంశం కంటే వాణిజ్యానికి సంబందించిన ఇతర కీలకాంశాలు చర్చించడమే మేలని ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనను ఇతర బీజేపీ ఎంపీలు రాజు బిస్త, రాజకుమార్ చాహార్, దీపక్ ప్రకాష్ సమర్ధించారు. కానీ ఇతర ప్రతిపక్ష ఎంపీలందరూ సంఘ్వీ ప్రతిపాదించాల్సినది చర్చించాల్సిన అంశమేనని అన్నారు.  కనుక వాణిజ్యం సంస్థలు, ప్రభుత్వ ఉన్నతాధికారులను ఈ అంశంలో తమ అభిప్రాయాలను కోరవచ్చు.  వారి అభిప్రాయాలు, సూచనల ఆధారంగానే చర్చ జరగవచ్చు. 

ఈ ఏడాది ఆరంభం నుంచే రూపాయి విలువ తరుగుదలకు గురవుతూనే ఉంది.  యు. ఎస్ ఫెడరల్ రిజర్వ్ రేట్ల పెంపుదల  తర్వాత  విదేశీ నిధుల  ప్రవాహానికి  దారితీసిన తరువాత  ఇతర  అభివృద్ధి  చెందుతున్న మార్కెట్ కరెన్సీలతో కలిసి రూపాయి ఈ సంవత్సరం ప్రారంభం నుండి ఒత్తిడిలో ఉంది. దేశీయ కరెన్సీ అక్టోబర్‌లో  యు. ఎస్  డాలర్‌తో పోలిస్తే దాని జీవితకాల కనిష్ట స్థాయి 83కి పడిపోయింది మరియు ఇది రు.82 పైన కొనసాగుతోంది.

By
en-us Political News

  
భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రస్తుతం అత్యంత కీలకమైన, ఆందోళనకరమైన మలుపు తిరుగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో అత్యంత వైభవంగా జరుపుకునే పండుగలలో విజయదశమి లేదా దసరాకు ప్రత్యేక స్థానం ఉంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో సరికొత్త సమీకరణాలకు తెరలేచింది. రాజ్యసభ మాజీ సభ్యుడు, సీనియర్ రాజకీయ నాయకుడు విజయసాయిరెడ్డి త్వరలో సరికొత్త రాజకీయ పార్టీని స్థాపించేందుకు సర్వం సిద్ధం చేశారు
స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ జోరుగా సాగుతున్న తరుణంలో అధికార తెలుగుదేశం పార్టీలో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
పదేళ్లుగా పెండింగ్‌లో రూ.20 కోట్ల విలువైన స్థలం.. పఠాన్ ఎన్డీఏలో చేరగానే గిఫ్ట్.!
హైదరాబాద్‌లోని ఉప్పల్‌–నాగోల్ మార్గంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
విజయవాడలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా
 గత ఏప్రిల్ లో లోక్‌సభలో ఎదురైన సాంకేతిక రాజ్యాంగ సవరణ లోపాలను పూర్తిగా సరిదిద్ది, ఈసారి ఎటువంటి అవాంతరాలు లేకుండా పక్కా వ్యూహంతో ముందుకు వెళ్లాలని కేంద్ర హోం, న్యాయ మంత్రిత్వ శాఖలు నిర్ణయిచాయి.
విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు.
ప్రముఖ పంజాబీ గాయకుడు దలేర్‌ మెహందీకి ఉత్తరాఖండ్‌లో ఒక సాంస్కృతిక వేడుకలో తీవ్రమైన చేదు అనుభవం ఎదురైంది.
ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
వందేళ్లు దాటినా తగ్గని ఉత్సాహం.. 101 ఏళ్ల వృద్ధుడి ఆరోగ్య రహస్యాలు ఇవే.!
హైదరాబాద్ నగరం సైబర్ నేరాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్న తరుణంలో, అమాయకులను లక్ష్యంగా చేసుకుని సాగుతున్న మోసాలు కలకలం రేపుతున్నాయి
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.