ఈ నెలాఖరులో డీలిమిటేషన్ బిల్లు: పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు.. పావులు కదుపుతున్న కేంద్రం.!

Publish Date:Oct 20, 2026

Advertisement

దేశ రాజకీయాలలో హాట్ టాపిక్ గా ఉన్న అంశం ఏదైనా ఉందంటే.. అది నియోజకవర్గాల పునర్విభజన బిల్లు మాత్రమే. అటువంటి కీలక బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెట్టడానికి కేంద్రం ముహూర్తం నిర్ణయించేసింది. ఈ నెలాఖరులోనే పార్లమెంటులో ఆ బిల్లును ప్రవేశ పెట్టి ఆమోదింప చేసుకోవాలని కేంద్రం కసరత్తు చేస్తోంది.  ఇందు కోసం పార్లమెంటు ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది

 గత ఏప్రిల్ లో లోక్‌సభలో ఎదురైన సాంకేతిక రాజ్యాంగ సవరణ లోపాలను పూర్తిగా సరిదిద్ది, ఈసారి ఎటువంటి అవాంతరాలు లేకుండా పక్కా వ్యూహంతో ముందుకు వెళ్లాలని కేంద్ర హోం, న్యాయ మంత్రిత్వ శాఖలు నిర్ణయిచాయి. దేశ అత్యున్నత చట్టసభల రూపురేఖలను సమూలంగా మార్చేయగల ఈ అంశంపైనే ఇప్పుడు రాజకీయవర్గాలలో ఎడతెగని చర్చ జరుగుతోంది. 

ఇందు కోసం కేంద్రం బహుముఖ వ్యూహాన్ని అమలు చేస్తున్నది.   దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న జనాభా ప్రాతిపదికన స్థానాల కేటాయింపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా కేంద్రం వ్యూహాలకు పదును పెడుతున్నది.  పార్లమెంట్‌లో లోక్‌సభ స్థానాల సంఖ్యను ప్రస్తుతమున్న 543 నుంచి   850కి పెంచే దిశగా ప్రతిపాదనలు దాదాపు సిద్ధమయ్యాయని చెబుతున్నారు. అలాగే  దశాబ్దాల తరబడి వాయిదా పడుతూ వస్తున్న 33 శాతం మహిళా రిజర్వేషన్ల చట్టాన్ని కూడా ఈ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియతో జత చేయాలని కేంద్రం నిర్ణయించింది. అన్నీ అనుకున్నట్లు జరిగితే.. వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికే  మహిళలకు చట్టసభల్లో మూడో వంతు స్థానాలు దక్కేలా చేయాలని కేంద్రం భావిస్తోంది. 

అయితే.. లోక్‌సభ స్థానాల పునర్విభజన ప్రక్రియ ప్రారంభమైతే ఉత్తరాది రాష్ట్రాలలో జనాభా విపరీతంగా పెరిగినందున అక్కడి సీట్లు భారీగా పెరుగుతాయని, ఫలితంగా దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాతినిధ్యం తగ్గిపోతుందనే  ఆందోళన వ్యక్తమౌతున్నది. ఈ సమస్యకు   చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక ఫార్ములా  రూపొందించినట్లు తెలుస్తోంది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ వంటి ఐదు ప్రధాన దక్షిణాది రాష్ట్రాల సీట్ల సంఖ్యను ప్రస్తుతమున్న 129 నుండి  195కు పెంచి, దేశంలోని మొత్తం లోక్‌సభ స్థానాల్లో ఆయా రాష్ట్రాల ప్రాతినిధ్య శాతాన్ని  తగ్గకుండా కాపాడేలా హోంశాఖ కసరత్తు చేస్తున్నది.   ప్రాంతీయ అసమతుల్యతలకు తావులేకుండా అన్ని ప్రాంతాల ప్రయోజనాలకూ సమ ప్రాతినిథ్యం వచ్చేలా బిల్లును రూపొందిస్తున్నట్లు చెబుున్నారు. 


ఇక పోతే.. ఈ రాజ్యాంగ సవరణ బిల్లులను పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదింపజేసుకోవడం కేంద్రానికి సవాలే.   రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదానికి  పార్లమెంట్‌లో మూడింట రెండొంతుల  మెజారిటీ అవసరం. దీంతో కేంద్రానికి అందుకు సరిపడా సంఖ్యా బలం పార్లమెంటులో లేకపోవడంతో బిల్లు ఆమోదం సులభ సాధ్యం కాదు. ఈ నేపథ్యంలోనే   కేంద్రం  చాకచక్యంగా వ్యవహరిస్తూ, ఇండియా కూటమిలోని కొన్ని కీలక భాగస్వామ్య పక్షాలు,  ప్రాంతీయ పార్టీలతో తెరవెనుక లోపాయికారీ సంప్రదింపులు జరుపుతున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారమౌతోంది. ముఖ్యంగా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీతో విభేదిస్తున్న కొన్ని ప్రాంతీయ పార్టీలు, అలాగే డీఎంకే వంటి దక్షిణాది ప్రాంతీయ పార్టీల మద్దతును కూడగట్టడం ద్వారా ఈ ప్రతిష్టాత్మక బిల్లును  గట్టెక్కించాలని కేంద్రం పావులు కదుపుతోంది.

ఈ పునర్విభజన ప్రక్రియకు సంబంధించి కేవలం కేంద్ర స్థాయిలోనే కాకుండా, ప్రాంతీయ స్థాయిలో కూడా పరిణామాలు వేగంగా మారుతున్నాయి. గతంలోనే డీలిమిటేషన్ అంశంపై దక్షిణాది రాష్ట్రాల్లో వస్తున్న అపోహలను తొలగించడానికి, అలాగే అన్ని వర్గాలను విశ్వాసంలోకి తీసుకోవడానికి కేంద్ర పెద్దలు ప్రత్యేక రాయబారాలు నడిపినట్లు వార్తలు వచ్చాయి. మరోవైపు, దక్షిణాది రాష్ట్రాల అసెంబ్లీలలో కూడా ఈ అంశంపై చర్చలు జరిగి, కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేక తీర్మానాలు కూడా వెలువడిన నేపథ్యం ఉంది. ఇలాంటి సున్నితమైన రాజకీయ వాతావరణం నెలకొన్న తరుణంలో, కేంద్రం ఈ నెలాఖరున నేరుగా పార్లమెంట్ వేదికగా ఈ బిల్లును ప్రవేశపెట్టాలని నిర్ణయించడం భారతీయ సమాఖ్య వ్యవస్థలో సరికొత్త చర్చకు తెరతీసింది. దక్షిణాది రాష్ట్రాల హక్కులకు ఎటువంటి భంగం కలగకుండా చూస్తామన్న కేంద్రం హామీలు ఎంతవరకు ఆచరణలో నిలుస్తాయనేది వేచి చూడాలి.  


[Delimitation Bill before Parliament, Increase Lok Sabha Seats, Womens Reservation Bill, Special Session Parliament, Telugu One] 

By
en-us Political News

  
విజయవాడలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా
విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు.
ప్రముఖ పంజాబీ గాయకుడు దలేర్‌ మెహందీకి ఉత్తరాఖండ్‌లో ఒక సాంస్కృతిక వేడుకలో తీవ్రమైన చేదు అనుభవం ఎదురైంది.
ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
వందేళ్లు దాటినా తగ్గని ఉత్సాహం.. 101 ఏళ్ల వృద్ధుడి ఆరోగ్య రహస్యాలు ఇవే.!
హైదరాబాద్ నగరం సైబర్ నేరాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్న తరుణంలో, అమాయకులను లక్ష్యంగా చేసుకుని సాగుతున్న మోసాలు కలకలం రేపుతున్నాయి
బాలీవుడ్ ప్రముఖ నటుడు టైగర్ ష్రాఫ్‌ను లక్ష్యంగా చేసుకుని జరిగిన కాల్పుల ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది
 తిరుపతి, ఏలూరు, శ్రీకాకుళం, సాలూరు,  పిఠాపురం ఇలా రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల సీట్ల సర్దుపాట్లు కూటమి శ్రేణుల మధ్య అగాధాన్ని పెంచుతూ ఐక్యతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత గడ్డ అయిన ఉమ్మడి కడప జిల్లాలో ఆ పార్టీకి తీవ్ర రాజకీయ ప్రతికూలత ఎదురౌతోందని చెప్పడానికి స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియే నిలువెత్తు నిదర్శనంగా చెబుతున్నారు.
కమ్మ నాయకుడు ఏబీవీకి స్వతంత్ర అభ్యర్థిగా మద్దతు ఇస్తూ, కాపు నాయకుడు  వంగవీటి రాధను జనసేనలోకి పంపారన్నది విజయసాయి రెడ్డి ఆరోపణ.  కాంగ్రెస్, సీపీఐ, సీపీఎంలు ఏబీవీకి మద్దతు ఇవ్వడాన్ని కూడా ఆయన చంద్రబాబు వ్యూహంగానే అభివర్ణిస్తున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఏకగ్రీవాలకు  అవకాశం ఇవ్వకూడదని వైసీపీ అధినేత జగన్ పలు మార్లు విస్పష్టంగా చెప్పినా, ఆయనకు అత్యంత బలమైన పట్టు ఉన్న కడప జిల్లాలోనే కీలకమైన రెండు మునిసిపాలిటీలు ఏకగ్రీవం కావడం పార్టీపై జగన్ పట్టు సడలిందా అన్న అనుమానాలను తావిస్తోంది.
పుంగనూరుతో పాటు రాయచోటి, ధర్మవరం తదితర ప్రాంతాల్లో నామినేషన్ల దాఖలు సమయంలో ఉద్రిక్తతలు తలెత్తిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలను ప్రస్తావిస్తూ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి సరిగా లేదన్న వాదనతో కేంద్ర బలగాలను రంగంలోకి దించాలని వైసీపీ   ప్రయత్నించింది.
హైదరాబాదు నగరంలో తీవ్ర సంచలనం సృష్టించిన మాజీ డీజీపీ వినయ్ రంజన్ రాయ్ సతీమణి తనూజ హత్య కేసులో తెలంగాణ స్పెషల్ టీం కీలక పురోగతి సాధించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.