తల్లిదండ్రులు తెలియకుండా చేస్తున్న ఈ తప్పులు పిల్లలను దూరం చేస్తాయ్..!
Publish Date:Feb 24, 2025
.webp)
Advertisement
పిల్లలను పెంచడం అనేది బాధ్యతాయుతమైన, కష్టమైన పని. తల్లిదండ్రుల ప్రతి మాట పిల్లల జీవితంపై గాఢమైన ప్రభావాన్ని చూపుతుంది. తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తును మెరుగ్గా ఉంచడానికి తమ శాయశక్తులా ప్రయత్నిస్తారు. తల్లిదండ్రులుగా మారడం ఖచ్చితంగా ఒక ఆహ్లాదకరమైన అనుభూతి, కానీ తల్లిదండ్రులుగా సమర్థవంతమైన బాధ్యత కత్తిమీద సాము వంటిదనే చెప్పవచ్చు. ప్రస్తుత కాలంలో పెంపకం కూడా చాలా మారిపోయింది. ఈ రోజుల్లో తల్లిదండ్రులు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. దీనివల్ల సమయం లేకపోవడంతో పాటు అనేక ఇతర సమస్యలు తల్లిదండ్రులకు ఇబ్బందిగా మారుతున్నాయి. తమ పిల్లలకు మంచి పెంపకాన్ని అందించాలంటే డబ్బు బాగా సంపాదించాలని తల్లిదండ్రులు పగలు రాత్రి కష్టపడి పనిచేస్తారు. విద్య, మంచి బట్టలు, ఖరీదైన వస్తువులు ఇస్తారు. అయితే, ఇవన్నీ ఉన్నప్పటికీ చాలా సార్లు పిల్లలు తమ తల్లిదండ్రుల నుండి దూరం అవుతుంటారు. పిల్లలను వారి తల్లిదండ్రుల నుండి దూరం చేసే తల్లిదండ్రుల 3 తప్పులు ఉన్నాయి. అవేంటంటే..
రిజెక్ట్ చేయడం..
ఈ రోజుల్లో చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలు తమ మాట ఏ విధంగానూ వినడం లేదని ఆందోళన చెందుతుంటారు. ఈ కారణంగా తల్లిదండ్రులకు, పిల్లలకు మధ్య గొడవలు అవుతుంటాయి. దీనికి ప్రధాన కారణం తల్లిదండ్రులు, పిల్లల మధ్య సరైన వాతావరణం లేకపోవడం. తల్లిదండ్రులు తరచుగా తమ పిల్లలు చెప్పే ప్రతిదాన్ని పట్టించుకోకపోవడం లేదా పిల్లలు చెప్పిన దాన్ని వ్యతిరేకించడం, రిజెక్ట్ చేయడం చేస్తారు.దీని కారణంగా పిల్లలు కూడా తల్లిదండ్రులతో అదే విధంగా ప్రవర్తిస్తారు.ఈ సమస్య పోవాలంటే పిల్లలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. కూర్చుని పిల్లలతో మాట్లాడాలి.
సమయం..
నేటికాలం తల్లిదండ్రులు ఇద్దరూ తమ పిల్లలకు మంచి జీవితాన్ని ఇవ్వాలని డబ్బు సంపాదనలో మునిగిపోతున్నారు. దీని కారణంగా వారికి పని ఒత్తిడి పెరుగుతుంది. పగలు మరియు రాత్రి పనిపై దృష్టి పెట్టడం వల్ల తల్లిదండ్రులు తమ పిల్లలకు సమయం కేటాయించలేకపోతున్నారు. దీని కారణంగా పిల్లలు ఒంటరితనం ఫీలవుతారు. తల్లిదండ్రులు పిల్లల మధ్య దూరం పెరగడానికి ఇదే కారణం.
పోలిక..
తల్లిదండ్రులు తమ పిల్లలను ఇతర పిల్లలతో పోల్చుతారు. చదువు అయినా, ఆటలు అయినా, ప్రతి చిన్న విషయానికి పిల్లలను ఇతరులతో పోల్చడం వల్ల వారి మనస్సులలో న్యూనతా భావన ఏర్పడుతుంది. దీని కారణంగా, పిల్లలు తల్లిదండ్రులపై కోపంగా ఉండి, వారికి దూరంగా ఉండటం మొదలుపెడతారు. తమ తల్లిదండ్రులను శత్రువులుగా భావిస్తారు.
*రూపశ్రీ.
http://www.teluguone.com/news/content/parents-mistakes-35-193322.html












