పంజాగుట్ట స్మశానవాటికలో పూడ్చిన శిశువు.. మరుసటి రోజు మాయం..!

Publish Date:Aug 11, 2026

Advertisement

 

చార్మినార్ ప్రాంతానికి చెందిన దంపతులకు ఇద్దరు కవల పిల్లలు జన్మించగా ఆరు నెలలకే  కవలలు జన్మించారు. దీంతో ఇంట్లో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. అంతలోనే ఆ శిశులిద్దరినీ అనారోగ్యం కబళించింది. ఒక బిడ్డను కన్నీళ్లతో పూడ్చిపెట్టారు. మరుసటి రోజే రెండో బిడ్డ కూడా మృతి చెందడంతో.. రెండు మృతదేహాలను ఒకేచోట ఖననం చేద్దామని స్మశానవాటికకు వచ్చారు. కానీ అక్కడ కనిపించిన దృశ్యం వారిని షాక్‌కు గురిచేసింది. మొదట పూడ్చిన తమ బిడ్డ మృతదేహం అక్కడ కనిపించలేదు!

పంజాగుట్ట పరిధిలో నివాసం ఉంటున్న ఓ దంపతులకు కవలలు జన్మించారు.కానీ ఆరు నెలలకే జన్మించిన ఆ కవల శిశువులు అనారో గ్యంతో మృతి చెందారు. తొలుత మృతి చెందిన శిశువు మృతదేహాన్ని కుటుంబ సభ్యులు పంజా గుట్ట స్మశానవా టికకు తీసుకెళ్లారు. అక్కడి సిబ్బంది రూ.2,500 తీసుకుని మృతదేహాన్ని ఖననం చేసినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

అయితే ఒక బిడ్డ చనిపోయిందన్న విషా దంలో ఉండగానే... మరుసటి రోజే రెండో శిశువు కూడా కన్నుమూ సింది. దీంతో ఆ బిడ్డను కూడా తీసుకుని కుటుంబ సభ్యులు పంజాగుట్ట స్మశానవాటికకు చేరుకు న్నారు.ముందురోజు ఖననం చేసిన తమ శిశువు ఉన్నచోటే రెండవ శిశువు ఖననం చేయాల నుకున్నారు. అక్కడికి వెళ్లి చూడగా మొదట ఖననం చేసిన శిశువు మృతదేహం అక్కడ కనిపించలేదు. దీంతో ఏం జరిగిందో అర్థం కాక కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. మా బిడ్డ మృత దేహం ఎక్కడ అని  కుటుంబ సభ్యులు స్మశానవాటిక సిబ్బందిని నిలదీశారు. “మా బిడ్డను ఇక్కడే పూడ్చాం..ఇప్పుడు మృతదేహం లేదు... ఏమైంది?” అంటూ ప్రశ్నించారు. 

తమకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ.. సిబ్బంది తో వాగ్వాదానికి దిగారు.అయినా కూడా స్మశాన వాటిక సిబ్బంది నోరు మెదపలేదు. ఇద్దరు కన్నబిడ్డలను కోల్పోయిన తల్లిదండ్రులకు.. ఒక బిడ్డను పూడ్చిన చోటే మృతదేహం కనిపించక పోవడం ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించసాగారు. అనంతరం ఈ ఘటనపై కుటుంబ సభ్యులు బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభిం చారు. 

స్మశానవాటిక సిబ్బందిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.అసలు శిశువు మృతదేహం ఎలా మాయమైంది. ఖననం చేసిన తర్వాత ఎవరైనా మృతదేహాన్ని బయటకు తీశారా?స్మశానవాటిక సిబ్బంది నిర్లక్ష్యమా? లేక ఈ ఘటన వెనుక మరేదైనా కారణం ఉందా?*అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కన్నబిడ్డలను కోల్పోయిన ఆ తల్లిదండ్రులకు.. ఇప్పుడు తమ బిడ్డ మృతదేహం కోసం వెతకాల్సిన పరిస్థితి రావడం పలువురి హృదయాలను కలచివేస్తోంది.

Panjagutta Cemetery,  babys body disappeared, Charminar, Banjara Hills Police, CP Sajjanar, DGP C.V. Anand, CM Revanth reddy

By
en-us Political News

  
భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి రావడంతో ఉత్తరాంధ్రలో విమాన కనెక్టివిటీ మరింత విస్తరించే అవకాశం ఉంది. ఇ ఇదిలా ఉండగా, విమానాశ్రయా నికి ప్రయాణికుల రాకపోకలను సులభతరం చేసేందుకు ఆగస్టు 15 నుంచి ఎలక్ట్రిక్‌ బస్సుల సేవలను కూడా ప్రారంభిం చనున్నారు.  
ఇటీవలే   బిడ్డకు జన్మనిచ్చిన కరోలిన్ లెవిట్..  తన పిల్లలు కుటుంబ సభ్యులతోనూ ఎక్కువ సమయం గడిపేందుకు ప్రెస్ సెక్రటరీ పదవి నుంచి వైదొలగాలని స్వచ్ఛందంగా నిర్ణయించుకున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి.
వెలుగును చంద్రుడు పూర్తిగా అడ్డుకోవడంతో భూమిపైకి సూర్యకాంతి కనిపించకుండా పోయింది.  గ్రీన్‌లాండ్, ఐస్‌లాండ్, ఉత్తర రష్యా, స్పెయిన్, పోర్చుగల్ దేశాల్లో  ప్రాంతాల్లో ఈ సంపూర్ణ సూర్యగ్రహణం స్పష్టంగా దర్శనమిచ్చింది. ఈ ప్రాంతాల్లో ఏకంగా 2 నిమిషాల 18 సెకన్ల పాటు   అక్కడి ప్రజలు పట్టపగలే చిమ్మ చీకట్లు అలుముకున్న అద్భుతాన్ని ఆస్వాదించారు.  
మేడ్చల్ జిల్లా పరిధిలో జరిగిన సదరు కూల్చివేతలకు రెవెన్యూ యంత్రాంగం ఎలాంటి అనుమతులు,  ఉత్తర్వులు ఇవ్వలేదనీ,   తమ శాఖ సమ్మతి లేకుండానే జిల్లా వ్యాప్తంగా దాదాపు నలభై ప్రదేశాల్లో హైడ్రా బలగాలు కూల్చివేతలు సాగించాయని కలెక్టర్ హైకోర్టు ధర్మాసనం ముందు వెల్లడించారు. 
అమెరికా సైనిక సామర్థ్యాలను దగ్గరుండి పరిశీలించే అవకాశం దక్కిందన్న ఆయన తాము ఊహించిన దాని కంటే.. అమెరికా సైన్యం చాలా బలహీనంగా ఉందన్నారు.
గత విచారణల సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్‌కు పంపిన నోటీసులు ఆయనకు అందలేదని తేలడంపై న్యాయమూర్తి.. ఈసారి ఎలాంటి సాంకేతిక విఘాతాలు లేదా డెలివరీ సమస్యలు తలెత్తకుండా పక్కాగా నోటీసులు అందజేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.
సాంకేతిక పరిజ్ఞానం, పాలనా సంస్కరణలు, మౌలిక వసతుల విస్తరణ వంటి కీలక రంగాల్లో చంద్రబాబు చూపుతున్న చొరవ, ఆయన దార్శనికత ఏపీని అభివృద్ధి పథం వైపు పరుగులు పెట్టిస్తోందన్నారు. 
ఒకవైపు పార్టీ మొత్తం అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తే.. మరొ వైపు అదే పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అనంత బాబు మాత్రం ప్రజా సమస్యల సభలో గళమెత్తుతానంటూ బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం నెట్టింట తెగ ట్రోల్ అవుతోంది.
13 మందిపై 20,000 పేజీల భారీ సీబీఐ ఛార్జ్‌షీట్..!
సిట్ కోర్టుకు సమర్పించిన వివరాల ప్రకారం, ఏపీపీఎస్సీ ప్రాథమిక నియమావళికి  విరుద్ధంగా ఒకే జవాబు పత్రాలను  మూడు విడతలుగా మూల్యాంకనం చేసినట్లు అధికారులు శాస్త్రీయంగా నిర్ధారించారు. డిజిటల్ విధానం, హైలాండ్ రిసార్ట్, అలాగే  విజయవాడ కేంద్రంగా మూడు వేర్వేరు దశల్లో ఈ మూల్యాంకన   సాగిందని నివేదిక పేర్కొంది.
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విధానంపై ప్రస్తుతం తీవ్రస్థాయిలో రాజకీయ చర్చ నడుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సుదీర్ఘకాలం పాటు పదవుల కంటే పార్టీ సిద్ధాంతాలకు, ప్రజాసేవకే ప్రాధాన్యమిచ్చే నాయకులు అరుదుగా కనిపిస్తారు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.