పట్టపగలే చిమ్మ చీకట్లు.. ఎక్కడో, ఎందుకో తెలుసా?
Publish Date:Aug 13, 2026
Advertisement
స్పెయిన్, రష్యా వంటి కొన్ని దేశాల్లో పట్టపగలే చిమ్మ చీకట్లు కమ్ముకున్నాయి. ఆకాశంలో నక్షత్రాలు మెరిశాయి. పగలే రాత్రిగా మారిపోయింది. ఈ పరిస్థితి నిముషాల పాటే ఉన్నా.. వీక్షించిన వారందరికీ జీవితంలో మరచిపోలేని అనుభూతిని మిగిల్చింది. ఎప్పుడో ఓ సినీ కవి పగలే వెన్నెలా, జగమే ఊయల అంటూ రాసిన పాటు ఆయా దేశాలలో వారికి అనుభవంలోకి వచ్చింది. ఈ ఖగోళ వింతకు కారణం సంపూర్ణ సూర్య గ్రహణం. భూమికి, సూర్యుడికి మధ్య చంద్రుడు ఒకే సరళరేఖపైకి రావడం వల్ల ఈ సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్ప డింది. సూర్యుడి నుంచి వచ్చే వెలుగును చంద్రుడు పూర్తిగా అడ్డుకోవడంతో భూమిపైకి సూర్యకాంతి కనిపించకుండా పోయింది. గ్రీన్‌లాండ్, ఐస్‌లాండ్, ఉత్తర రష్యా, స్పెయిన్, పోర్చుగల్ దేశాల్లో ప్రాంతాల్లో ఈ సంపూర్ణ సూర్యగ్రహణం స్పష్టంగా దర్శనమిచ్చింది. ఈ ప్రాంతాల్లో ఏకంగా 2 నిమిషాల 18 సెకన్ల పాటు అక్కడి ప్రజలు పట్టపగలే చిమ్మ చీకట్లు అలుముకున్న అద్భుతాన్ని ఆస్వాదించారు. అయితే ఈ సంపూర్ణ సూర్యగ్రహణం భారత్‌లో మాత్రం కనిపించలేదు. ఇందుకు కారణం సూర్యగ్రహణం ఏర్పడిన సమయంలో ఇండియాలో రాత్రి వేళ కావడమే. Dark in broad sunlight, solar eclipse 2026, europe solar eclipse, spain, turns day into night
http://www.teluguone.com/news/content/-dark-in-broad-sunlight-36-228808.html





