న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో కాల్పుల కలకలం.. నిక్స్ ఛాంపియన్‌షిప్ వేడుకల వేళ పేలిన తుపాకులు!

Publish Date:Jun 18, 2026

Advertisement

అమెరికాలోనే అత్యంత రద్దీగా ఉండే, ప్రపంచ ప్రసిద్ధి గాంచిన న్యూయార్క్ లోని టైమ్స్ స్క్వేర్ కూడలి గురువారం (జూన్ 18)  ఒక్కసారిగా రణరంగంగా మారింది. అంతవరకు ఎంతో ఉల్సాహంగా సాగిన సంబరాల వాతావరణం క్షణాల వ్యవధిలో భయానకంగా మారిపోయింది.   కారణం అక్కడ ఒక్కసారిగా వినిపించిన తుపాకీ పేలుళ్లు. న్యూయార్క్ నిక్స్ బాస్కెట్‌బాల్ జట్టు ఏకంగా 53 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ప్రతిష్టాత్మకమైన బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకోవడంతో లోయర్ మాన్‌హట్టన్ ప్రాంతంలో నగర చరిత్రలోనే నిలిచిపోయేలా ఒక భారీ విజయోత్సవ పరేడ్‌ను నిర్వహించారు. ఈ చారిత్రాత్మక విజయంతో అభిమానులు ఆనందోత్సాహాలతో సంబరాలు జరుపుకున్నారు.  

అయితే.. ఆ సంబరాలు  ముగిసిన గంటల వ్యవధిలోనే..   టైమ్స్ స్క్వేర్ కూడలి వద్ద ఒక్కసారిగా కాల్పులు కలకలం రేపాయి. నల్లని దుస్తులలో ఉన్న  ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తుల  మధ్య తలెత్తిన  ఘర్షణ  చినికి చినికి గాలివానగా మారింది. కాల్పులకు దారితీసింది.  ఆ ఇద్దరూ   తుపాకులతో కాల్పులకు తెగబడటంతో అక్కడ ఉన్న వేలాది మంది  భయాందోళనలకు లోనయ్యారు. ప్రాణాలు దక్కించుకోవడానికి  పరుగులు తీశారు.  

ఈ   ఘటనలో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే అత్యవసర సేవా సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని, రక్తపు మడుగులో ఉన్న బాధితుడిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు.  కాల్పులు జరిపి జనం మధ్య నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తున్న ఒక  నిందితుడిని పోలీసులు  అదుపులోకి తీసుకున్నారు.  

By
en-us Political News

  
చుట్టూ ఎత్తయిన కొండలు, పచ్చని చెట్లతో ధర్మశాల, న్యూజిలాండ్ మైదానాలను తలపిస్తున్న కడప క్రికెట్ స్టేడియం అందాలు
లీప్‌ఫ్రాగ్ ఇంజనీరింగ్ సర్వీసెస్ ఐపీఓ (Leapfrog Engineering SME IPO) నేటితో ముగియనుంది. తాజా సబ్‌స్క్రిప్షన్ స్టేటస్, గ్రే మార్కెట్ ప్రీమియం (GMP), లాట్ సైజ్ మరియు కంపెనీ ఫైనాన్షియల్ డీటెయిల్స్ ఇక్కడ చూడండి.
క్రెడిట్ కార్డ్ స్వైప్ ఛార్జీలు లేదా MDR అంటే ఏమిటి? 1% నుండి 3% వరకు ఉండే ఈ అదృశ్య రుసుములు మీ జేబును ఎలా ప్రభావితం చేస్తాయో పూర్తి వివరాలతో తెలుసుకోండి.
బ్యాంకుల్లో లిక్విడిటీ నిల్వలు రూ. 4,772 కోట్లకు పడిపోవడంతో ఆర్‌బీఐ రూ. 1 లక్ష కోట్ల వేలాన్ని ప్రకటించింది. ఈ వేరియబుల్ రేట్ రెపో (VRR) వేలం పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
లేబనాన్ ఉద్రిక్తతల నడుమ అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు హఠాత్తుగా వాయిదా పడ్డాయి. వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ స్విట్జర్లాండ్ పర్యటన ఆలస్యం కావడం, $300 బిలియన్ల నిధిపై వివాదం మరియు హార్ముజ్ జలసంధి పరిణామాల పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
కేంద్ర ప్రభుత్వ పీఎం శ్రీ (PM SHRI) నిధుల వినియోగంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకుంది. ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణ, 844 స్మార్ట్ కిచెన్ల నిర్మాణం, విద్యార్థినుల కోసం 53 వేల బంక్ బెడ్ల ఏర్పాటు మరియు అనాథ పిల్లలకు తల్లికి వందనం పథకం అమలుపై మంత్రి నారా లోకేష్ తీసుకున్న కీలక నిర్ణయాల పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
ఫిఫా వరల్డ్ కప్ 2026లో సౌత్ కొరియాపై 1-0 విజయం సాధించి, రౌండ్ ఆఫ్ 32కు అర్హత సాధించిన తొలి జట్టుగా మెక్సికో సంచలన రికార్డు సృష్టించింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
స్టాక్ మార్కెట్ క్రాష్‌లోనూ అంబర్ ఎంటర్‌ప్రైజెస్ షేర్లు 3 శాతానికి పైగా దూసుకెళ్లాయి. ఒప్పో ఇండియాతో కుదిరిన మొబైల్ తయారీ ఒప్పందం ఈ భారీ ర్యాలీకి ఎలా కారణమైందో, ఈ మల్టీబ్యాగర్ రిటర్న్స్ వివరాలను ఇక్కడ చూడండి.
ప్రశాంతతకు మారుపేరైన విజయవాడ నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
జూన్ 19న దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా కుప్పకూలాయి. సెన్సెక్స్ ఏకంగా 780 పాయింట్లకు పైగా పడిపోగా, నిఫ్టీ 24,000 స్థాయిని కోల్పోయింది. కేవలం నిమిషాల్లో రూ. 2 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఎలా ఆవిరైంది, యాక్సెంచర్ ఇచ్చిన షాక్ ఏంటి, ఐటీ షేర్లు ఎందుకు పతనమయ్యాయో పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
హారిజన్ రీక్లెయిమ్ ఇండియా ఐపీఓ (Horizon Reclaim India SME IPO) బీఎస్‌ఈ ఎస్ఎమ్ఈ ప్లాట్‌ఫారమ్‌పై 47 శాతం ప్రీమియంతో రూ.151 వద్ద అద్భుతంగా లిస్ట్ అయింది. 304 రెట్లు సబ్‌స్క్రిప్షన్ సాధించిన ఈ షేరు లిస్టింగ్ వివరాలు, ఇన్వెస్టర్ల లాభాల పూర్తి సమాచారం ఇక్కడ చూడండి.
తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ సంచలన నిర్ణయం. బీసీసీఐ అనుమతులు లేని వివాదాస్పద టీజీ20 లీగ్‌కు ప్రచారం చేస్తున్నారంటూ టీమిండియా ఆటగాళ్లు మహ్మద్ సిరాజ్, తిలక్ వర్మలతో పాటు టాలీవుడ్ హీరోలు వెంకటేష్, విజయ్ దేవరకొండలకు లీగల్ నోటీసులు జారీ చేసింది.
ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం అగ్రహారం గ్రామంలో శుక్రవారం ఉదయం వెలుగులోకి వచ్చిన దారుణ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.