పాకిస్తాన్‎ను దడ పుట్టిస్తున్న బలూచిస్తాన్

Publish Date:May 12, 2025

Advertisement

 

పాకిస్తాన్‎ను గత కొన్ని రోజులుగా నిద్రపట్టినివ్వకుండా చేస్తున్న చిన్న దేశం అది. పాకిస్తాన్ నుంచి విడిపోయినప్పటికీ.. తన పోరాటం మాత్రం వీడటం లేదు. బలూచిస్తాన్.. ప్రస్తుతం దీని పేరు వింటే పాక్ కు దడ పుడుతోంది. నిద్రలో ఉన్నా ఉలిక్కిపడే రోజులు పోయి అసలు నిద్రే పట్టకుండా పోయింది. కేవలం 10 రోజుల వ్యవధిలో 71 మందికి పైగా పాక్ సైన్యాన్ని పొట్టన పెట్టుకుంది.  భారత్‌‌, పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఇదే తమకు అందివచ్చిన అవకాశంగా భావిస్తూ బీఎల్‌‌ఏ మెరుపు దాడులతో దూకుడు పెంచింది. బలూచ్‌‌లో పాక్‌‌ సైన్యం అధీనంలో ఉన్న ప్రాంతాలను ఒక్కొక్కటిగా ఆక్రమించుకుంది. పాక్ మిలటరీ స్థావరాలు, ప్రభుత్వ ఆస్తులే లక్ష్యంగా భీకరమైన దాడులు చేస్తోంది. భారత్ తో కయ్యానికి కాలు దువ్విన పాకిస్తాన్ పై ఇండియన్ ఆర్మీ మిసైళ్ల వర్షంతో పాక్ కు ముచ్చెమటలు పిట్టించింది. పాక్ పై సమరానికి ఇదే సరైన సమయం అని భావించిన బీఎల్‌‌ఏ.. తనదైన శైలిలో దాడులకు పాల్పడుతూ పాక్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇక ఇలాంటి అవకాశం మళ్లీ రాదని భావిస్తూ వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు బలూచిస్తాన్ సైనికులు. గత 10 రోజుల్లో పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున దాడులు చేశారు. 

బీఎల్‌‌ఏకు చెందిన స్పెషల్ టాక్టికల్ ఆపరేషన్స్ స్క్వాడ్ ద్వారా ఐఈడీ బాంబు దాడులతో పాటు గ్రనేడ్లు, అత్యాధునిక ఆయుధాలతో పాక్ సైన్యం, మిలటరీ స్థావరాలు, మౌలిక సదుపాయాలు, కమ్యూనికేషన్ వ్యవస్థ లక్ష్యంగా అటాక్ చేస్తున్నారు. ఈ నెల 3న గ్వాదర్‌‌‌‌లో పాక్ ఆర్మీ వెహికల్‌‌ను ఐఈడీ బాంబుతో పేల్చివేశారు. ఈ దాడిలో దాదాపు 20 మంది పాక్ సైనికులు మరణించినట్టు బీఎల్‌‌ఏ అధికారికంగా తెలిపింది. ఈ నెల 6న కచ్చి జిల్లాలోనూ పాక్ మిలటరీ కాన్వాయ్‌‌పై ఐఈడీ దాడి చేసింది. ఇందులో 12 మంది పాక్ సైనికులు చనిపోయినట్టు తెలిపింది. ఈ నెల 7న కెచ్ జిల్లాలో బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్‌‌పైనా ఐఈడీ దాడి చేసింది. ఈ దాడిలో ఒక పాక్ సైనికుడు మరణించినట్టు వెల్లడించింది. ఈ క్రమంలోనే బలూచిస్తాన్ దాడులను తిప్పి కొట్టేందుకు సరికొత్త వ్యూహాన్ని రచించింది. బలూచిస్తాన్ దాడులు చేస్తున్న ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పాక్ సైన్యాన్ని మోహరించింది. అయితే సైనిక స్థావరాలపై బీఎల్‌‌ఏ దాడులు చేస్తూ, ఒక్కో ప్రాంతాన్ని తమ అధీనంలోకి తెచ్చుకుంటోంది. బలూచిస్తాన్ రాజధాని క్వెట్టాపై దాడులు చేసి.. ఫ్రాంటియర్ కార్ప్స్ హెడ్‌‌క్వార్టర్స్‌‌తో పాటు కీలకమైన చెక్‌‌ పాయింట్లను స్వాధీనం చేసుకున్నట్టు బీఎల్‌‌ఏ ప్రకటించింది. అలాగే కలత్ జిల్లాలోని మాంగోచర్ టౌన్ సహా కెచ్, మస్తుంగ్, కచ్చి జిల్లాల్లోనూ కొన్ని ప్రాంతాలు తమ చేతుల్లోకి వచ్చాయని వెల్లడించింది. అయితే, బలూచిస్తాన్‌‌లోని 39 ప్రాంతాల్లో ఏక కాలంలో దాడులు చేసినట్టు బీఎల్‌‌ఏ శనివారం ప్రకటించింది. 

ఈ ఆపరేషన్స్ ఇంకా కొనసాగుతున్నాయని వెల్లడించింది. ఈ ప్రాంతాల్లో ఇప్పటికే పలు స్టేషన్లు, ఆర్మీ పోస్టులు, హైవేలను తమ అధీనంలోకి తెచ్చుకున్నామని బీఎల్‌‌ఏ అధికార ప్రతినిధి జీయాంద్ బలూచ్ తెలిపారు.బలూచిస్తాన్ తన పోరాటాన్ని గత కొన్ని దశాబ్దాలుగా కొనసాగిస్తూనే ఉంది. ఈ ఏడాది మార్చిలో రైలును హైజాగ్ చేసి ఇంటర్నేషనల్ లెవెల్లో వార్తల్లో నిలిచింది. ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షించేలా చేసింది. క్వెట్టా నుంచి పెషావర్‌‌‌‌కు వెళ్తున్న జఫర్ ఎక్స్‌‌ప్రెస్ రైలును బోలన్ పాస్ సమీపంలో బీఎల్‌‌ఏ హైజాక్ చేసింది. బలూచ్ రాజకీయ ఖైదీలను 48 గంటల్లోగా విడుదల చేయాలని, లేదంటే రైలులో ప్రయాణిస్తున్న 400 మంది ప్రయాణికులను చంపుతామని పాకిస్తాన్ ​ను హెచ్చరించింది. అయితే పాక్ సైన్యం ఆపరేషన్ గ్రీన్ బోలన్ చేపట్టి ప్రయాణికులను రక్షించింది. ఈ ఆపరేషన్‌‌లో 33 మంది బీఎల్‌‌ఏ తిరుగుబాటుదారులతోపాటు 21 మంది ప్రయాణికులు, నలుగురు పాక్ సైనికులు మరణించారు.  


పాకిస్తాన్‌‌లోని అతిపెద్ద ప్రావిన్స్ బలూచిస్తాన్. పాకిస్తాన్ విస్తీర్ణంలో 44శాతం ఒక్క బలూచిస్తాన్‌‌లోనే ఉండటంతో తమ హక్కుల కోసం తిరుగుబాటు ప్రారంభించారు బీఎల్ఏ సైన్యం. ఈ ప్రాంతంలో అపారమైన ఖనిజాలు, వనరులు ఉన్నాయి. కానీ దశాబ్దాలుగా పాక్ పాలకుల నిర్లక్ష్యానికి బలూచిస్తాన్ గురవుతోంది. తమ వనరులను దోచుకుంటూ, తమను మాత్రం పట్టించుకోవడం లేదని స్థానికుల్లో తీవ్ర అసంతృప్తి  ప్రారంభమైంది. అదికాస్తా తిరుగుబాటుగా మారి నేడు యుద్దంగా రూపాంతరం చెందింది. 1947లో పాకిస్తాన్ ఏర్పాటు సమయంలోనే బలూచిస్తాన్ స్వాతంత్ర్యంగా ఉంటామని కోరింది. అయితే ఆనాడు బలూచ్ రాజకీయ నాయకుడు కలాత్ ఖాన్ పాక్‌‌లో చేరేందుకు ఒప్పుకున్నారు. దీనికి అంగీకరించని బలూచిస్తాన్ ప్రజలు.. అప్పటి నుంచే బలూచిస్తాన్ జాతీయ ఉద్యమం మొదలుపెట్టారు. ఆ తర్వాత అనేక దశల్లో తిరుగుబాటు కొనసాగుతూనే వచ్చింది. అయితే పాక్ ను దెబ్బ తీయాలంటే సరైన టీం అవసరమని భావించి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పేరుతో ఒక సైన్యాన్ని 2000 సంవత్సరంలో ఏర్పాటు చేసుకున్నారు. అప్పటి నుంచి పాకిస్తాన్ కు వ్యతిరేకంగా పోరాటం ఉధృతం అయింది. అలా దశాబ్దాల కాలం నుంచి పోరాడుతూ తమ హక్కుల కోసం మన దాయాది దేశమైన పాకిస్తాన్ పై అంతర్యుద్దం చేస్తూనే ఉన్నారు.


 

By
en-us Political News

  
గత కొన్నేళ్లుగా  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు.  ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు. 
 విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని  పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
ఒకవైపు ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూనే, మరోవైపు అదే ఎన్నికల్లో ప్రతిపక్షాలు పాల్గొనడం వల్ల ఆ తప్పులకూ, లోపాలకు చట్టబద్ధత కల్పించినట్లవుతోందన్న ఆయన ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
ఆ సమయంలో తాను కేరళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తుండగా, గ్యానేష్ కుమార్ కేంద్ర హోంమంత్రిత్వ శాఖలో ఉన్నతాధికారిగా సేవలందిస్తున్నారని గుర్తుచేశారు. ప్రయాణ సమయంలో తన రిటైర్మెంట్ అనంతర ప్రణాళికల గురించి  ఆరా తీసిన జ్ణానేష్ కుమార్‌.. ఆ సందర్భంలోనే బీజేపీ తరఫున పతనం తిట్ట లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని సూచించారన్నారు. 
ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల ఫలితాలు,  ప్రస్తుత రాజకీయ వాతావరణం దృష్ట్యా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు విజయంపై ధీమాతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ బరిలోకి దిగడంతో సమీకరణాలు ఏ విధంగా మారతాయన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 
ప్పటి వరకూ మోడీ సర్కార్ ఘనంగా చెప్పుకుంటూ వచ్చిన పారదర్శకత ప్రశ్నార్థకమైంది.  రాజ్యాంగ వ్యవస్థలు బలహీనపడ్డాయన్న వాదనకు బలం చేకూరింది. అంత వరకూ విపక్షాలు చేసే విమర్శలను సునాయాసంగా తిప్పికొట్టి పై చేయి సాధించిన మోడీ సర్కార్ నీటి విషయంలో సమాధానం చెప్పుకోలేక తడబడింది. వెనకడుగు వేసింది. 
ఎంతటి సంక్షోభాన్నైనా సంయమనం కోల్పోకుండా అధిగమించడం, ఆ సంక్షోభాన్నే అవకాశంగా మలచుకుని ముందుకు సాగడం ఆయన నైజం. ఎంతటి క్షిష్టమైన సమస్యనైనా  పరిష్కరించగలిగే నేర్పు, ఎంతటి సంక్షోభాన్నైనా తట్టుకునిముందుకు సాగే సామర్ధ్యం కారణంగానే ఆయనకు పొలిటికల్ సర్కిల్స్ లొ  క్రైసిస్ మ్యాన్ అన్న గుర్తింపు వచ్చింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.