ఉస్మానియా బిస్కెట్ ఫ్యాక్టరీపై... వెలుగులోకి షాకింగ్ విషయాలు

Publish Date:Mar 27, 2026

Advertisement

 

హైదరాబాద్ నగరంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు, పోలీ సులు సంయుక్తంగా చేపడుతున్న దాడుల్లో వరుసగా కల్తీ ఆహార దందాలు బయటపడుతున్నాయి. నగరాన్ని కేంద్రంగా చేసుకుని గుట్టు చప్పుడు కాకుండా నకిలీ ఆహార పదార్థాలు తయారు చేస్తున్న ముఠాలపై అధికారులు కొరడా ఝళిపిస్తున్నారు. వంటింటి సామాన్ల నుంచి చిన్నపిల్లలు ఇష్టంగా తినే ఆహార పదార్థాల వరకు కల్తీ వ్యాపారం విస్తరించినట్లు బయటపడటంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఇటీవల పిల్లలు ఎంత ఇష్టంగా తినే ఐస్‌క్రీమ్ తయారీ కేంద్రాలపై జరిగిన దాడుల్లో కుళ్లిన పదార్థాలు, ప్రమాదకర రసాయనాలు ఉపయోగిస్తున్నట్లు గుర్తించిన అధికారులు, తాజాగా నగరంలోని పలు ప్రాంతాల్లో బేకరీ యూనిట్లపై దాడులు నిర్వహించారు. ఈరోజు నిర్వహించిన తనిఖీల్లో...  ఎక్కువ మంది చాయ్‌తో  పాటు ఇష్టంగా తినే ఉస్మానియా బిస్కెట్ల తయారీలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.  ఇప్పుడు ఆ ఉస్మానియా బిస్కెట్ ఎలా తయారు చేస్తున్నారు చూద్దాం రండి...

హైదరాబాద్ నగరంలోని అంబర్పేట్ ప్రాంతంలో ఉస్మానియా బిస్కెట్లు తయారు చేస్తున్న ఓ ఫ్యాక్టరీ పై పోలీసులు మరియు ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. అత్యంత ప్రమాదకరమైన రసాయనాలు ఉపయోగిస్తున్నట్లుగా గుర్తించారు. బిస్కెట్లకు ఆకర్షణీయమైన రంగులు రావడానికి ప్రత్యేకంగా కెమికల్స్ కలిపి కొత్త రంగులు తయారు చేస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. ఈ రసాయనాలు ఆరోగ్యానికి హానికరమయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. తనిఖీల సమ యంలో ఫ్యాక్టరీలో ఉన్న ఆ పరిశుభ్రత వాతావరణం చూసి పోలీసులు షాక్‌కు గురయ్యారు. 

పరిశుభ్రత ప్రమాణాలు పూర్తిగా లెక్క చేయకుండా బిస్కెట్లు తయారీ జరుగుతున్నట్లుగా అధికారులు గుర్తించారు. అంతేకాదండోయ్ మరో షాకింగ్ విషయం కూడా బయటపడింది. బిస్కెట్ల తయారీలో నాసిరకం పాడైన గుడ్లు ఉపయోగిస్తున్నట్లుగా పోలీసులు గమనించారు. అయితే ఈ విధంగా కుళ్ళిన గుడ్లతో ఉస్మానియా బిస్కెట్లను తయారుచేసి వాటిని పలు షాపులకు సరఫరా చేస్తున్నట్టుగా పోలీసులు తెలుసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ఫ్యాక్టరీ యజమాన్యంపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. నగరంలో ఆహార భద్రతా ప్రమాణాలపై మరింత కఠినంగా తనిఖీలు కొనసాగిస్తామని అధికారులు తెలిపారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.... ఈ ఘటనతో నగరంలో ఫుడ్ సేఫ్టీ చర్చనీయాంశంగా మారింది.

By
en-us Political News

  
సీఐబీటీలో చదివిన ఉదయ్ రుద్రరాజు ఓపెన్ ఏఐ కంప్యూట్ విభాగానికి చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ సీటీవోగా నియమితులయ్యారు ఒక సాధారణ ప్రాంతీయ ఇంజనీరింగ్ కాలేజీ నుంచి ప్రపంచం గర్వించే స్థాయికి ఎదిగిన తెలుగు తేజం ప్రస్థానం.. అంకితభావం, నైపుణ్యం ఉంటే ఆకాశమే హద్దు అని నిరూపించింది.
ఈ సందర్భంగా కోర్టు వెలుపల జరుగుతున్న రాజకీయ చర్చలపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ఇది కేవలం ఒక నేరపూరిత ఉదంతం. దీనిని కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం సరికాదని పేర్కొంది.
ఈ తీవ్రమైన ఆరోపణలపై ఉదయ్ కృష్ణారెడ్డి స్పందిస్తూ, అవన్నీ అసత్యాలని, బేస్‌లెస్ ఆరోపణలని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తెలిపారు. తన వద్ద ఉన్న ఆధారాలతో సదరు మహిళా అధికారిణిపై కేసు పెడతానని మీడియాకు మెసేజ్ పంపారు. అయితే ఈ వార్త జాతీయ మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ విపరీతంగా ప్రచారం కావడం, తన ప్రతిష్ఠకు భంగం కలిగిందన్న మానసిక ఆందోళనకు ఆయన గురై.. హైదరాబాద్ మోతీనగర్‌లోని తన బంధువుల ఇంట్లో తీవ్ర డిప్రెషన్‌లో ఉన్న ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల ప్రైవేటీకరణపై దుష్ప్రచారం చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆక్వా కల్చర్, పొగాకు రంగాలను బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని
ప్రధాని మోడీకి ఎప్పుడు వీలు కుదిరితే అప్పుడే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ ముహూర్తం ఖరారు చేస్తామని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు చెబుతూ వస్తున్నారు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ముహూర్తం ఎట్టకేలకు ఖరారైంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ప్రధాని మోడీ వచ్చే నెల మొదటి తేదీన భోగాపురం రానున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుపతి వేదికగా జరిగిన ఒక ప్రైవేట్ కార్యక్రమం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
శ్రీకాకుళం సమీపంలోని చాపురం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న 900 చదరపు గజాల ఖాళీ స్థలం కబ్జాలక్ష్యంగా.. ఆ భూమి అసలు యజమానులకు సంబంధం లేకుండా, స్థలాన్ని కబ్జా చేసేందుకు, లేని వ్యక్తులను ఉన్నట్లుగా, ఉన్న వారిని మరణించినట్లుగా చూపిస్తూ బోగస్ మరణ ధృవీకరణ పత్రాలు సృష్టించారు. తద్వారా న్యాయబద్ధమైన వారసుల పత్రాలను ఫోర్జరీ చేసి అక్రమంగా యాజమాన్య హక్కులను పొందడానికి ప్రయత్నించినట్లు దర్యాప్తులో తేలింది.
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా గత కొన్ని రోజులుగా సాగుతున్న ఉత్కంఠ భరిత పరిణామాల్లో ఒక కీలక మలుపు చోటుచేసుకుంది.
రాష్ట్రంలో మాతా–శిశు సంక్షేమానికి అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోన్న ప్రభుత్వం
ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలో అత్యంత దిగ్భ్రాంతికరమైన ఘటన వెలుగుచూసింది.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన తొలిరోజే ఉభయ సభలను నీట్ వివాదం కుదిపేసింది.
సీజేపీ చలో పార్లమెంట్ ఉద్రిక్తం, పోలీసుల ఆంక్షలు..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.