ప్రజలపై భారం మోపుతున్న ప్రైవేట్ విద్యుత్ సంస్ధలు
Publish Date:Aug 15, 2012
Advertisement
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేటు సంస్థలకు గ్యాస్ సరఫరా నిలిపివేసి ప్రభుత్వరంగ సంస్ధలయిన ఏపి జన్కో ఆద్వర్యంలోని నేదునూరు, శంకరపల్లి సరఫరా చేయాలని ప్రతిపక్షపార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. తద్వారా విద్యుత్ చార్జీలను బాగా తగ్గించవచ్చని ఆ పార్టీల నాయకులు అంటున్నారు.నాలుగేళ్ల నుండి ల్యాంకో, జిఎంమ్మార్ లాంటి ప్రయివేట్ సంస్థలకు గ్యాసు ఇవ్వడం ద్వారా ప్రజలపై 2,850 కోట్ల రూపాయల భారం పడింది. అధిక ధర చెల్లించి ప్రవేటు సంస్థలనుండి రాష్ట్ర ప్రభుత్వం విధ్యుత్ కొనుగోలు చేయడం పూర్తిగా అనాలోచిత చర్యగా వినియోగదారులు భావిస్తున్నారు.ఎపి జెన్కో ప్రాజెక్టులు గ్యాస్ ఆధారంగా 2,500 మెగావాట్ల విద్యుత్‌ను విజయవంతంగా ఉత్పత్తి చేస్తున్నాయి. వీటి ఉత్పత్తి వ్యయం యూనిట్‌కు 1.85 నుండి 2.20 రూపాయలు వుండగా ప్రైవేట్ విద్యుత్ సంస్థల నుండి యూనిట్ విద్యుత్‌ను రూ 5.70 చెల్లించి కొనుగోలు చేయడం ప్రజలపై భారాన్ని మోపటమే. అలాగే విద్యుత్ టారీఫ్‌లను క్రమబద్దీకరించేందుకు ఆ ప్రైవేటు సంస్ధలపై ఒత్తిడి కూడా ప్రభుత్వం ఇంతవరకు తీసుకురాలేక పోయింది. జిఎంఆర్, ల్యాంకో సంస్థలు యధేచ్చగా ఎలక్ట్రిక్ రెగ్యులేషన్స్‌ను ఉల్లంఘించినా ఎటువంటి చర్యలూ ప్రభుత్వం తీసుకోవడం లేదు. ప్రజలపై భారాన్ని మోపే ప్రైవేట్ సంస్థల్ని కాక, ప్రభుత్వరంగ సంస్ధలను ప్రోత్సహించి విద్యుత్ కొరత తీర్చాలని ప్రతిపక్షాలు పట్టు పడుతున్నాయి.
http://www.teluguone.com/news/content/opposition-parties-demand-government-to-supply-gas-to-nedunooru-and-shankarpalli-power-projects-24-16543.html





