పొలిటికల్ టర్న్ తీసుకుంటున్న ఆపరేషన్ కగార్!

Publish Date:May 1, 2025

Advertisement

ఆపరేషన్ కగార్.. ఇప్పుడు పొలిటికల్ టర్న్ తీసుకుంటోంది. ఆదివాసీలను ఇబ్బంది పెట్టేలా బ్లాక్ హిల్స్ లో సెర్చ్ ఆపరేషన్ ఏంటన్న ప్రశ్నలను వామపక్షాలు, పౌరహక్కుల సంఘాలు, బీఆర్ఎస్ వినిపిస్తున్నాయి. పార్టీ నిర్ణయం తర్వాత శాంతి చర్చలపై నిర్ణయం దిశగా తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తోంది.  ఛత్తీస్ గఢ్ వైపు నుంచి వచ్చిన బలగాలు కర్రెగుట్టలను ఈనెల 21న చుట్టుముట్టాయి. అప్పటి నుంచి కూంబింగ్ కొనసాగుతూనే ఉంది. మొత్తం 24 వేల మంది బలగాలతో ఆపరేషన్ కగార్ సంచలనంగా మారింది. 

బ్లాక్ హిల్స్, దుర్గం గుట్టలు మావోయిస్టులకు స్ట్రాటజిక్ లొకేషన్. ఇక్కడ కేంద్ర కమిటీ సమావేశాలు, ఇతర ప్లీనరీలు, భారీగా ఆయుధ డంపులు, ట్రైనింగ్ జరుగుతున్నదన్న ఉద్దేశంతో బలగాలు ఈ గుట్టలను రౌండప్ చేస్తున్నాయి. హెలికాప్టర్లు, డ్రోన్ల నిఘాలో జల్లెడపడుతున్నారు. అయితే ఈ ఆపరేషన్ తో తెలంగాణ పోలీసులకు సంబంధం లేదని పోలీస్ వర్గాలు అంటున్నాయి. కేంద్ర బలగాలే లీడ్ చేస్తున్నాయని చెబుతున్నారు. 

బ్లాక్ హిల్స్ లో ఆపరేషన్ కగార్ ను వెంటనే ఆపాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. అటు చర్చల విషయంపై మావోయిస్టుల లేఖలు కూడా బయటికొచ్చాయి. ఇక లెఫ్ట్ పార్టీల నేతలు, పౌర హక్కుల సంఘాలు కూడా ఆపరేషన్ కగార్ ను ఖండించాయి. శాంతి చర్చలు జరపాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నారు. కార్పొరేట్ శక్తులకు ఎదురు నిలిస్తే నేరమా అని ప్రశ్నిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి చర్యలు సరికాదని ప్రొఫెసర్ హరగోపాల్, కూనంనేని సహా పలువురు కామెంట్ చేస్తున్నారు. చర్చలకు వస్తామని అంటున్నా చంపడమేంటని ప్రశ్నిస్తున్నారు.  అంతకు ముందు బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ కూడా ఆపరేషన్ కగార్  ను ప్రస్తావించారు. ఎన్ కౌంటర్లు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, బలవంతంగా మావోయిస్టులను అంతం చేయడం కాకుండా శాంతి చర్చలు జరపాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. 

గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో 3,500 మంది నక్సలైట్లు లొంగిపోయారని, రెడ్ కారిడార్ రాష్ట్రాలు, రాజకీయ పార్టీలతో చర్చలు జరపాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అంటున్నారు. ఆపరేషన్ కగార్‌ను మారణకాండగా అభివర్ణిస్తూ తెలంగాణలో చాలా చోట్ల నిరసన ర్యాలీలు జరుగుతున్నాయి. భారత్ బచావో   వంటి సంస్థలు ఆపరేషన్‌ కగార్ ను ఆపాలని తెలంగాణ మంత్రి సీతక్కను కోరాయి. అడవుల్లోని ఖనిజ సంపదను కార్పొరేట్ సంస్థలకు అప్పగించే కుట్రలో భాగంగా ఆదివాసీలను బలిపశువులుగా చేస్తున్నారన్న ఆరోపణలు చేస్తున్నాయి  తుడుం దెబ్బ వంటి సంస్థలు.  కర్రెగుట్టలో ఆపరేషన్‌ను ఆపాలని, ఆదివాసీలు భయాందోళనలో ఉన్నారని, వారికి తాగునీరు కూడా అందని దుస్థితి నెలకొందని అంటున్నారు. 

మరోవైపు ఆపరేషన్ కగార్ పై రాష్ట్ర బీజేపీ నేతలు రియాక్ట్ అవుతున్నారు. చేతిలో తుపాకీ పట్టుకొని శాంతి చర్చలు అనడం ఎంత వరకు సమంజసం అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు.   శాంతి చర్చల కంటే ముందు మావోయిస్టులు తుపాకులు వదలాలని, తుపాకులు వదిలేస్తున్నామని ప్రకటించి శాంతి చర్చలకు రావాలన్నారు. సో ఆపరేషన్ కగార్ కాస్తా పొలిటికల్ కగార్ గా మారిపోయింది. ఇది ఇప్పుడు తెలంగాణలో ఇదోక సెన్సిటివ్ ఇస్యూ గా మారింది. బలగాలు మాత్రం కూంబింగ్ ఆపడం లేదు. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందన్న ఉత్కంఠ పెరుగుతోంది.

By
en-us Political News

  
విపక్షాల నిరసనల నేపథ్యంలో   పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు.  పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. 
 ధనుష్‌ తన కొత్త రాజకీయ పార్టీ కోసం  తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు  ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే  ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. 
అయితే ఆయన  తాజాగా   నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు,  వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో  కలకలం రేపింది. 
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు.  ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం. 
ఈ ప్రధాన పార్టీల వ్యూహాలకు తోడుగా మరికొన్ని రాజకీయ  పార్టీలో కూడా తమ ఉనికిని బలంగా చాటేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నాయి. కల్వకుంట్ల కవిత నేతకూడా రంగంలోకి దిగుతుండటంతో పోటీ ఊహించని మలుపు తిరుగుతోంది.  
గత కొన్నేళ్లుగా  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు.  ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు. 
 విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని  పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.