Publish Date:Sep 20, 2025
బీఆర్ఎస్ నుంచి సస్పెండైన కల్వకుంట్ల కవిత వాయిస్ ఇప్పుడు ఒకింత నెమ్మదించిందా? బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావుపై తీవ్రమైన ఆరోపణలు చేైసి పార్టీ నుంచి సస్పెండైన కవిత.. సొంత పార్టీ ఏర్పాటు చేస్తారని అంతా భావించారు. అయితే తాజాగా ఆమె మీడియాతో మాట్లాడుతూ కొత్త పార్టీ విషయంలో ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె కేసీఆర్ వందల మందితో చర్చించిన తరువాతనే పార్టీ పెట్టారని గుర్తు చేశారు. తాను కూడా ఇప్పుడు అలాగే చేస్తున్నానన్నారు. బీఆర్ఎస్ కు చెందిన పలువురు నేతలు తనతో టచ్ లో ఉన్నారని చెప్పిన కవిత.. తండ్రి పార్టీ నుంచి సస్పెండైన మొదటి కుమార్తెను తానునని చప్పారు.
ఇక తను తీవ్రంగా విమర్శించిన హరీష్ రావు గురించి మాట్లాడుతూ కాలేశ్వరం విషయంలో తప్ప ఆయనపై తనకు వేరే కోపం ఏమీ లేదన్నారు. ఇరిగేష్ శాఖకు సంబంధించి అవకతవకలు, అక్రమాలు, అవినీతి గురించి 2016లోనే కేటీఆర్ ను అలర్ట్ చేశానని చెప్పిన కవిత.. హరీష్ రావు కాళేశ్వరం విషయంలో పూర్తి బాధ్యత అంతా కేసీఆర్ పై నెట్టేవేసి తప్పించుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. కాళేశ్వరం విషయంలో ప్రతి నిర్ణయం కేసీఆర్ దేనని హరీష్ రావు పీసీ ఘోష్ కమిషన్ కు చెప్పారన్నారు.
ఇక ఎమ్మెల్సీ పదవికి రాజీనామాపై మాట్లాడుతూ.. తాను స్పీకర్ ఫార్మట్ లోనే రాజీనామా సమర్పించానని స్పష్టం చేశారు. రాజీనామా ఇవ్వడమే కాకుండా వెంటనే ఆమోదించాల్సిందిగా ఫోన్ చేసి మరీ కోరానని తెలిపారు. బతుకమ్మకు సంబంధించి తనకు చాలా ఆహ్వానాలు వస్తున్నాయన్న కల్వకుంట్ల కవిత.. మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ ను తమ స్వగ్రామం చింతమడకలోనే జరుపుకుంటానన్నారు. తీన్మార్ మల్లన్న కొత్త పార్టీ గురించి మీడియా అడిగిన ప్రశ్నకు ప్రజాస్వామ్యంలో ఎవరికైనా పార్టీ పెట్టుకునే హక్తు ఉందని ముక్తాయించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/only-kaleswaram-no-oyher-issue-with-harish-39-206549.html
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!