Publish Date:Dec 21, 2022
ఏపీకి చంద్రబాబే దిక్కు అంటూ వైసీపీ నాయకుడొకరు సంచలన వ్యాఖ్యలు చేశారు.ముఖ్యమంత్రి జగన్ సామాజిక వర్గానికీ, జగన్ సొంత జిల్లాకు చెందిన ఆ నాయకుడు చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. ప్రస్తుత అస్తవ్యస్థ పరిస్థితి నుంచి ఏపీని గట్టెక్కించాలంటే చంద్రబాబే దిక్కు.. ఈ మాట అన్నది ఏ తెలుగుదేశం నాయకుడో కాదు.. సాక్షాత్తూ వైసీపీ నేత. రాయలసీమలో గుర్తింపు ఉన్న నాయకుడు డీఎల్ రవీంద్రారెడ్డి. ఔను డీఎల్ రవీందరారెడ్డి బుధవారం (డిసెంబర్ 21) కడపలో మీడియా సమావేశం పెట్టి మరీ సొంత పార్టీపైనా, పార్టీ అధినేతపైనా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
జగన్ పై విమర్శించడానికి ఆయన ఎంచుకున్న భాష.. వైసీపీ నాయకులలో వస్తున్న మార్పునకు తార్కానంగా చెప్పుకోవచ్చు. ఎక్కడా పరిధి మీరకుండానే జగన్ అవినీతిని ఎండగట్టారు. వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడు ఇంత అవినీతిపరుడని అనుకోలేదని సున్నితంగానే అయినా నషాళానికి అంటేలా ఘాటుగా విమర్శించారు. ఇంత విమర్శలు గుప్పిస్తున్న తనను పార్టీ నుంచి బహిష్కరించడం వల్లే తాను ఇలా విమర్శలు గుప్పిస్తున్నానని అనుకుంటారో ఏమో అన్నట్లుగా తాను ఇప్పటికీ వైసీపీలోనే ఉన్నానని, వాళ్లేం తనను పార్టీ నుంచి తీసేయలేదనీ స్పష్టత ఇచ్చారు.
జగన్ అధికారం చేపట్టినప్పటి నుంచీ అవినీతి పాలనే సాగిస్తున్నారని దుయ్యబట్టారు. తమ పార్టీ వచ్చే ఎన్నికలలో సింగిల్ డిజిట్ స్థానాలలోనే గెలుస్తుందని జోస్యం చెప్పారు. 2019 ఎన్నికలకు ముందు తన ఇంటికి మనుషులను పంపి బతిమాలి పార్టీలో చేర్చుకున్నారని రివీల్ చేసిన డీఎల్ రవీంద్రారెడ్డి.. .జగన్ పాలన అవినీతి మయం అన్నారు. ఈ పార్టీలో ఉన్నందుకు తన మీద తనకే అసహ్యం వేస్తోందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో చంద్రబాబు తప్ప మరెవరూ రాష్ట్రాన్ని కాపాడలేరని డీఎల్ రవీంద్రారెడ్డి అన్నారు. వైఎస్ వివేకా హత్య కేసులో ఒంటరి పోరు సాగిస్తున్న డాక్టర్ సునీత ధైర్యాన్ని అభినందించాల్సిందే అన్నారు.
జనవరి 3 నుంచీ వైఎస్ వివేకా హత్య కేసులో కీలక మార్పులు ఉంటాయని అన్నారు. గత ఎన్నికల ముందు తనను బతిమలాడి జగన్ పార్టీలో చేర్చుకున్నారనీ, ఆ సందర్బంగా ఎంతో ఆదర్శవంతంగా మాట్లాడారనీ డీఎల్ వివరించారు. తనకు తండ్రిని మించిన పేరు తెచ్చుకోవాలన్న ఆకాంక్ష తప్ప మరే కోరికలూ లేవని జగన్ అన్నారనీ, కానీ పాలన మొదలు పెట్టిన క్షణం నుంచీ జగన్ పాలన అంతా అవినీతేనని డీఎల్ విమర్శించారు. జనసేనాని నిజాయితీ పరుడే కానీ పాలనాదక్షత ఉందని తాను భావించడం లేదన్నారు. పవన్ కల్యాణ్ చంద్రబాబు కలిసి పని చేస్తే ఏపీకి మేలు జరుగుతుందన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/only-babu-can-save-ap-39-148855.html
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది. సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది. 25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు.
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు.
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది.
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్, విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు.