Publish Date:Dec 21, 2022
ఏపీ ప్రభుత్వ ఆర్థిక అరాచకత్వం గురించి అందరూ మాట్లాడుతున్నారు. అయితే ఆ ఆరచకత్వాన్ని నిరోధించడానికి చేయాల్సినది మాత్రం చేయడం లేదు. అప్పులు వాటిని తీర్చడానికి మళ్లీ అప్పులు, ఉచిత పందేరాలకు అప్పులు.. అవీ సరిపోక పథకాల లబ్ధిదారుల సంఖ్యలో కోతలు. బటన్ నొక్కితే ఓట్లు రాలే మంత్రం కనిపెట్టాశానంటున్న ముఖ్యమంత్రి జగన్.. ఉద్యోగులకు సమయానికి జీతం ఇవ్వాల్సిన అవసరం ఉందని కూడా గుర్తించడం లేదు. పిఛనర్లకు పించన్ల విషయమూ పట్టించుకోవడం లేదు.
పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాలని కూడా భావించడం లేదు. దీంతో రాష్ట్రంలో అన్ని వర్గాలూ ఆందోళన బాట పట్టాయి. గత మూడున్నరేళ్లుగా రాష్ట్రంలో ఇదే పరిస్థితి ఉంది. ఇది రహస్యం కాదు. అందరికీ తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక అరాచకత్వానికి చెక్ పెట్టి నియంత్రించి దారిలో పెట్టాల్సిన కేంద్ర ప్రభుత్వం చోద్యం చూస్తూ కూర్చోలేదు. అన్ని విధాలుగా సహకరిస్తూ వచ్చింది. ఇప్పుడు కూడా పేరెత్తకుండా రాష్ట్రంలో ఆర్థిక అస్తవ్యస్త పరిస్థితుల గురించి సన్నాయి నొక్కులు నొక్కుతూ పరోక్ష విమర్శలు చేస్తున్నది.
తాజాగా పార్లమెంటులో కేంద్రం విత్త మంత్రి నిర్మలా సీతారామన్ ఏపీ పేరు ప్రస్తావించకుండా.. ఒక రాష్ట్ర ప్రభుత్వం అంటూ జీతాలు సమయానికి ఇవ్వలేని పరిస్థితికి వచ్చిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉద్యోగులంతా నిరసనలు చేస్తుంటే.. ఆ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తో.. తమ పథకాల ప్రచారానికి మాత్రం భారీ మొత్తం వెచ్చించి మరీ ప్రకటనలు గుప్పిస్తోందని విమర్శించారు. ఉచితాలను తప్పుపట్టడం లేదు కానీ.. ఆదాయం లేకుండా అప్పులు చేసి మరీ పందేరం చేయడం సరికాదన్నారు. ఏపీ పేరు ప్రస్తావించకపోయినా.. ఆమె ఈ విమర్శలు, వ్యాఖ్యలు చేసింది ఏపీని ఉద్దేశించేనని ఎవరికైనా ఇట్టే అర్థమైపోతుంది.
సభలో రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులపై మాట్లాడుతూ నిర్మలా సీతారామన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఆదాయం పెరగలేదు.. ఖర్చులు మాత్రం రెట్టింపు అవుతున్నాయి. కార్పొరేషన్ల పేరుతో అడ్డగోలుగా అప్పులు చేస్తోంది. ఆర్బీఐకి దృతరాష్ట్రుడిలా అనుమతులు ఇచ్చేస్తోంది. ఈ విషయాలన్నీ తెలసీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వం పరోక్ష విమర్శలతో సరిపెట్టేస్తోంది. ఇందుకు కారణం రాజకీయం అని వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. పరోక్షంగా అన్ని విధాలుగా ఏపీ ఆర్థిక వినాశనానికి సహకరిస్తూ.. పరోక్షంగా విమర్శలు హెచ్చరికలతో సరిపెట్టేసి తమ నిర్వాకాన్ని కప్పిపుచ్చుకోవాలని కేంద్రం చూస్తోందనడానికి తాజాగా విత్తమంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలు మరో నిదర్శనం.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ap-financial-condition-worrest-39-148865.html
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది. సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది. 25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు.
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు.
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది.
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్, విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు.