నాగేంద్రన్‌కి ఉరి వ‌ద్దు.. సింగ‌పూర్‌లో ఉద్య‌మం..

Publish Date:Nov 6, 2021

Advertisement

అత‌ని పేరు నాగేంద్రన్ కె ధర్మలింగం. భార‌త సంత‌తికి చెందిన వ్య‌క్తి. పుట్టింది మ‌లేసియాలో. ప్ర‌స్తుతం సింగ‌పూర్ జైల్లో ఉన్నాడు. ఆయ‌న‌కు త్వ‌ర‌లో ఉరి వేయ‌నున్నారు. అయితే, నాగేంద్ర‌న్‌కు ఉరి శిక్ష వ‌ద్దంటూ.. క్ష‌మాభిక్ష‌ ప్ర‌సాదించాలంటూ ఆన్‌లైన్‌లో పెద్ద ఎత్తున ఉద్య‌మం న‌డుస్తోంది. మానవ హక్కుల సంఘాలు భారీ మొత్తంలో సంతకాలు సేకరిస్తున్నాయి. అక్టోబర్ 29న ఆన్​లైన్ వేదికగా 50వేల సంతకాల సేకరణే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాయి. ఇప్పటివరకు 40వేల‌కు పైగా సంతకాలు సేకరించాయి. మ‌రి, ఆన్‌లైన్ పోరాటం ఫ‌లిస్తుందా?  నాగేంద్ర‌న్ కె ధ‌ర్మ‌లింగంకు ఉరి ర‌ద్దు అవుతుందా? అనేది ఆస‌క్తిక‌రంగా మారింది. ఇంత‌కీ ఎవ‌రీ నాగేంద్ర‌న్‌? ధ‌ర్మ‌లింగం జైల్లో ఎందుకు మ‌గ్గుతున్నారు? ఉరి శిక్ష ప‌డేంత త‌ప్పు ఏం చేశారు? అత‌ని కోసం ఆన్‌లైన్ ఉద్య‌మం ఎందుకు హోరెత్తుతోంది? ఇవ‌న్నీ ఇంట్రెస్టింగ్ విష‌యాలే.

భార‌త సంత‌తికి చెందిన‌ నాగేంద్రన్ కె ధర్మలింగం 2009లో డ్రగ్స్ అక్రమ రవాణా చేస్తూ సింగపూర్​ పోలీసుల‌కు చిక్కాడు. ఆ కేసులో దోషిగా తేలిన నాగేంద్రన్‌కు సింగపూర్ కోర్టు ఉరిశిక్ష విధించింది. ఈ న‌వంబ‌ర్ 10న నాగేంద్రన్‌కు ఉరి వేయ‌నున్నారు జైలు అధికారులు. దీంతో మానవ హక్కుల సంఘాలు నాగేంద్ర‌న్ ఉరిశిక్ష ర‌ద్దుకు ప్రయత్నిస్తున్నాయి. అత‌ను హైపర్ యాక్టివిటీ డిజార్డర్ అనే మాన‌సిక స‌మ‌స్య‌తో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. నాగేంద్ర‌న్‌ ప్రేయసిని హత్య చేస్తామని బెదిరించి.. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అత‌నితో బలవంతంగా డ్రగ్స్ అక్రమ రవాణా చేయించారని కూడా అంటున్నారు. అందుకే,  నాగేంద్రన్‌కు క్షమాభిక్ష ప్రసాదించాలంటూ సింగపూర్ అధ్యక్షుడు హలీమా యాకోబ్‌కు అభ్యర్థనలు పంపుతున్నాయి. న‌వంబ‌ర్ 10న ఉరి శిక్ష అమ‌లు చేయ‌నుండ‌గా.. ఈ లోపే క్ష‌మాభిక్ష కోసం ఆన్‌​లైన్ వేదికగా సంత‌కాల సేక‌ర‌ణ స్టార్ట్ చేశారు. 

అయితే, 2010లో డ్ర‌గ్స్‌ అక్రమ రవాణా కేసులో దోషిగా తేలిన నాగేంద్రన్ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని సింగ‌పూర్ అధికార వ‌ర్గాలు చెబుతున్నాయి. చేసిన అప్పులు తీర్చేందుకు పూర్తి అవగాహనతోనే అతడు ఈ తప్పు చేసినట్టు.. హైకోర్టుతో పాటు అప్పీల్ కోర్టు సమర్థించినట్టు.. సింగపూర్ హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అతనితో బలవంతంగా ఈ పని చేయించారనే వాదనలను తోసిపుచ్చింది. క్షమాభిక్ష కోసం అధ్యక్షునికి నాగేంద్రన్ పెట్టుకున్న పిటీష‌న్‌ కూడా తిరస్కరణకు గురైందని హోం మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. న‌వంబ‌ర్ 10న ఉరి శిక్ష అమ‌లును చూసేలా, నాగేంద్రన్ ఫ్యామిలీ మలేసియా నుంచి సింగపూర్‌కు వచ్చేందుకు ప్రయాణ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపింది. అయితే, ఆన్‌లైన్ ఉద్యమం హోరెత్తుతుండ‌టంతో న‌వంబ‌ర్ 10న ఏమైనా జ‌ర‌గొచ్చ‌ని అంటున్నారు. 

By
en-us Political News

  
కరీంనగర్ గడ్డపై బీజేపీ కాషాయ దళం కదం తొక్కింది.
ఈ చర్చల్లో భాగంగానే.. రేవంత్ కేబినెట్ లో ఇప్పుడు ఉపముఖ్యమంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క కు తోడుగా మరో ఉపముఖ్యమంత్రిని కూడా నియమించే అవకాశాలున్నాయన్న చర్చ జోరందుకుంది. 
రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత   ప్రతి జిల్లాలోనూ పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నాయని ఆయన సవివరంగా పేర్కొన్నారు. ఈ విషయంలో ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.
పంచాయతీ ఎన్నికలకు పొత్త ధర్మం వర్తించదని ఆ ప్రకటన పేర్కొంది.   గ్రామాభివృద్ధి, స్వేచ్ఛాయుత పాలన, మహాత్మాగాంధీ ఆశయాల సాకారం గ్రామీణ స్థాయి నుంచే సాధ్యమవుతాయని పేర్కొంది.   
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయడం వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాగలిగిందని బి.ఎం. సందీప్ కుమార్ పేర్కొన్నారు.
సాధారణంగా   నాయకులు, తాము ప్రజలకు చేయగల పనుల విషయంలో వాస్తవికత వదిలేసి అతిశయోక్తులతో, అతి అంచనాలతో గొప్పలు చెప్పుకుంటుంటారు.
మొత్తం 28 జడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 27 చోట్ల విజయం సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.  
అదానీతో సంబంధాలపై   రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. తెలంగాణలో అదానీ పెట్టుబడుల ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, ప్రజాధనాన్ని దోచి అదానీకి కట్టబెట్టే విధానం తమది కాదని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీకి బలమైన ఉనికి లేదని, ఇటీవలి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్ కూడా కోల్పోవడమే ఇందుకు నిదర్శనమన్నారు.
పోలీసుల హెచ్చరికలు, ఆంక్షలను బేఖాతరు చేస్తూ ఆయన భారీ కాన్వాయ్‌తో అక్కడికి రావడంపై స్థానిక ప్రజలు, తెలుగుదేశం వర్గీయులు  ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఎంపీ కాన్వాయ్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా  అంకాలమ్మ గూడూరులో ఘర్షణ వాతావరణం నెలకొంది. 
ఇదే వేదికపై నుంచి   544.11 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన రేవంత్ రెడ్డి,  ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని కూడా   ప్రారంభించారు.
కొలంబియా యూనివర్సిటీ వేదికగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ప్రస్తుతం  దేశ ఆర్థిక వ్యవస్థ   పతనావస్థలో ఉందని రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోయిందని, యువతకు ఉపాధి అవకాశాలు కరవయ్యాయని ఆయన ఆరోపించారు.
తమ కుటుంబ వివాహ వేడుకకు తండ్రిసమానులైన ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని ఆహ్వానించడంలో తప్పేముందని ప్రశ్నించిన షర్మిల.. దీనికి అనవసరమైన, అభ్యంతరకరమైన అర్థాలు ఆపాదించి ప్రచారం చేయడం జగన్ దిగజారుడుతనానికి నీచ మసస్థత్వానికి నిదర్శనమన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.