ఒంగోలు టు రాజమహేంద్ర వరం!.. దేశం జోష్ బ్రహ్మాండం!

Publish Date:May 28, 2023

Advertisement

టైమ్ మనది కానప్పుడు.. వెయిట్ చేయాలి. అలా వెయిట్ చేయడం వల్ల వచ్చే ఫలితాలు సూపర్బ్ గా ఉంటాయి. ఇంకా క్లియర్ కట్‌గా చెప్పాలంటే.. సూపర్‌గా కిక్ ఇస్తాయి. ప్రస్తుతం ఆ కిక్ ని తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎంజాయి చేస్తున్నాయి. ఉదాహరణ  చెప్పాలంటే.. తాజాగా రాజమహేంద్రవరం వేదికగా నిర్వహించిన మహానాడు మహాద్భుత విజయం సాధించింది. రెండు రోజుల పాటు నిర్వహించిన ఈ సభకు జనం పోటెత్తారు. అయితే ఈ మహానాడు సూపర్ సక్సెస్‌ కావడంపై పోలిటికల్ సర్కిల్‌లో వాడీవేడీ చర్చ జరురగుతోంది.

గత ఏడాది అంటే 2022 మే 27, 28 తేదీల్లో ప్రకాశం జిల్లా ఒంగోలులో నిర్వహించిన మహానాడు... నుంచి సైకిల్ పార్టీ శ్రేణుల్లో  నయా జోష్ కొట్టొచ్చిన్నట్లు కనిపిస్తోంది. ఈ మహానాడు వేదికగానే పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు ప్రారంభ ప్రకటన చేయడం.. అలాగే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో మినీ మహానాడులు నిర్వహిస్తామని వెల్లడించడం.. అదే విధంగా జగన్ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు బాదుడే బాదుడు, ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం... చివరకు తెలంగాణ  లోని ఖమ్మం వేదికగా చంద్రబాబు అధ్యక్షతన జరిగిన శంఖారావ సభ విజయవంతం కావడంతో అక్కడి పార్టీ శ్రేణుల్లో సైతం కొత్త జోష్ కొట్టొచ్చినట్లు కనిపించింది.  

అయితే ఈ శంఖారావ సభ సక్సెస్‌తో అధికార గులాబీ పార్టీలో   గుబులు  రేగింది.  ఇక హైదరాబాద్‌లో నిర్వహించిన పార్టీ ఆవిర్భావ సభకు ప్రజల నుంచి విశేష స్పందన రావడం.. అదే విధంగా అటు విజయవాడలో ఇటు హైదరాబాద్‌లో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు ఇటీవల ఘనంగా నిర్వహించడం.. ఇక ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు విజయకేతనం ఎగురవేయడం.. ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక సీటుని టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ కైవసం చేసుకోవడం చకచకా జరిగిపోయాయి.   

ఈ వరుస పరిణామాలన్నీ నిశీతంగా పరిశీలిస్తే.. ఒంగోలులో నిర్వహించిన మహానాడు నుంచి రాజమహేంద్రవరంలో నిర్వహించిన మహానాడు వరకు తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం శ్రేణుల్లో  ఉత్సాహం ఉరకలేస్తోందని పోలిటికల్ సర్కిల్‌లో  బలంగా వినిపిస్తోంది.  ఒక్క సారి 2019 నుంచి 2022 మే వరకు చోటు చేసుకొన్న పరిణామాలను గమనిస్తే.. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమి చెందింది. దీంతో ఆ ఏడాది ఆ పార్టీ ఆధినాయకత్వం మహానాడును నిర్వహించ లేదు. ఇక 2020లో కరోనా వేళ.. మహానాడు ఊసే లేదు. ఆ మరుసటి ఏడాది అంటే 2021లో కూడా కరోనా ఎఫెక్ట్‌తో మహానాడు నిర్వహించలేదు కానీ... టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన ఆన్‌లైన్‌లో మహానాడు నిర్వహించగా.. దానికి మంచి స్పందన అయితే వచ్చింది. 

మరోవైపు   జగన్.. గద్దెనెక్కిన తర్వాత తొలి కేబినెట్‌లోని మంత్రుల బూతుల పంచాంగానికి... అలాగే ప్రతిపక్ష పార్టీ నేతగా  జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీలకు.. ఆయన గద్దెనెక్కిన తర్వాత అమలు చేస్తున్న విదివిధానాలకు ఎక్కడా పొంతన లేదని.... దీంతో  జగన్  పాలనపై ప్రజల్లో ఓ విధమైన వ్యతిరేకత వ్యక్తమౌతోంది కానీ ...  అది ఏ స్థాయిలో ఉందనేది మాత్రం ఎవరికి ఇతమిద్దంగా అంతు పబట్టని విధంగా.. అర్థం కానీ విధంగా ఉండేది.. కానీ 2022లో ఒంగోలు వేదికగా నిర్వహించిన మహానాడుకు  జనం పోటెత్తారు.

దీంతో జగన్ పాలనపై ప్రజలు క్లారిటీగా ఉన్నారని.. వారంతా తెలుగుదేశం పార్టీ వైపే ఉన్నారని.. నిన్న.. నేడు.. రేపు కూడా ఆ పార్టీతోనే కలిసి నడుస్తారని అందరికీ అర్థమైంది. తాజాగా రాజమహేంద్రవరంలో జరిగిన మహానాడుతో అది సుస్పష్టమైందని  రాజకీయవర్గాల్లో ఓ రేంజ్ లో చర్చ జరుగుతోంది.  ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ మహానాడు విజయవంతం కావడంతో.. రాబోయే ఎన్నికల్లో  తెలుగుదేశం పార్టీ తప్పకుండా సత్తా చాటి... అధికారంలోకి వస్తుందన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో  బలంగా వ్యక్తమౌతోంది. 

By
en-us Political News

  
ఈ సందర్భంగా కేటీఆర్ రాజాసింగ్ పై సెటైర్లు వేశారు. రాజాసింగ్, కేటీఆర్ మధ్య రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ వ్యక్తిగత స్థాయిలో ఇలాంటి స్నేహపూర్వక సంభాషణలు సాగడం మంచి వాతావరణానికి నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
తాజా ఇంటర్వ్యూలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు జగన్ మోహన్ రెడ్డి వ్యక్తిత్వానికి, పార్టీ ఇమేజ్‌కు నష్టం కలిగించేలా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వందేమాతరం అంశం చర్చనీయాంశంగా మారింది.
2024 ఎన్నికల సమయానికి ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న జనసేన పార్టీ తెలుగుదేశం, బీజేపీలతో పొత్తు పెట్టుకుని ఎన్నికల రంగంలోకి దిగింది. ఆ ఎన్నికలలో నాగబాబు అనకాపల్లి లోక్ సభ స్థానం నుంచి రంగంలోకి దిగుతారని పెద్ద ఎత్తున ప్రచారం అయ్యింది. అయితే పొత్తు ధర్మంలో భాగంగా నాగబాబుకు ఆ ఎన్నికలలో పోటీ చేసే అవకాశమే దక్కలేదు.
తమిళనాడులో బీజేపీ, హీరో విజయ్ సారథ్యంలోని టీవీకేల పొత్తు విషయంలో మరోసారి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
దేశంలోని నాలుగు రాష్ట్రాలతో పాటు ఒక కేంద్రపాలిత ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది
ఈసీ తీరుపై నమ్మకం లేదని చెబుతున్న పార్టీ, ఇప్పుడు సీఈసీపై అభిసంశన తీర్మానానికి మద్దతుగా నిలబడకుంటే.. ఆ పార్టీ నైతికతే ప్రశ్నార్థకంగా మారుతుంది. ఒక వేళ వైసీపీ ఈ తీర్మానాన్ని వ్యతిరేకిస్తే ఇక ముందు, ఎన్నికల అక్రమాలపై మాట్లాడేందుకు వైసీపీకి అర్హతే ఉండదు. ఇంత వరకూ తెలుగుదేశం కూటమి విజయంపై వారు చేసిన విమర్శలన్నీ దూదిపింజెల్లా ఎగిరిపోతాయి.
బీఆర్ఎస్ హయాంలో ఇదే ఫామ్‌హౌస్ వేదికగా జరిగిన ఎమ్మెల్యేల కొనుగోలు ఉదంతం అప్పట్లో పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అప్పట్లో రోహిత్ రెడ్డి ఫిర్యాదుతోనే పోలీసులు అక్కడ సోదాలు నిర్వహించి, ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. అప్పట్లో ఈ కేసు జాతీయ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది.
దేవ్ జీ అరెస్ట్ ఎలా జరిగింది? అరెస్టు తరువాత ఆయన లొంగుబాటు ప్రకటన చేసి జనజీవన స్రవంతిలో కలుస్తున్నట్లు ఎందుకు ప్రకటించాల్సి వచ్చింది? లొంగిపోలేదు అంటూనే.. ప్రస్తుత పరిస్థితుల్లో అజ్ణాతంగా ఉండి ఉద్యమాన్ని కొనసాగించడం కష్టసాధ్యమని ఎందుకు చెబుతున్నారు?
త్రిష త్వరలోనే సినిమాలకు గుడ్‌బై చెప్పి రాజకీయాల్లోకి రావడం కన్ఫర్మ్ అన్న వాదన బలంగా వినిపిస్తోంది. అయితే ఇందుకు సంబంధించి త్రిష నుంచి ఎటువంటి క్లారిటీ అయితే ఇప్పటి వరకూ రాలేదు. ప్రస్తుతం త్రిష పలు సినిమాలలో నటిస్తున్నారు. వాటిలో మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమా కూడా ఉంది.
మంత్రిగా పదవీ బాధ్యతలు నిర్వర్తిస్తూ కూడా పవన్ కల్యాణ్ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనీ, షూటింగ్ లంటూ అధిక సమయం హైదరాబాద్ లోనే ఉంటున్నారని రోజా అన్నారు. ప్రజా సమస్యలను గాలికొదిలేసి సినిమాలలో యాక్టింగ్ కి పరిమితమైనట్లుగా పవన్ కల్యాణ్ తీరు ఉందని రోజా అన్నారు. కీలకమైన మంత్రివర్గ సమావేశానికి డుమ్మా కొట్టడం సరికాదన్న రోజా దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విధానసౌధలో కేబినెట్ సమావేశం నిర్వహిస్తున్న సమయంలోనే.. పాతిక మంది ఎమ్మెల్యేలు ఓ ప్రైవేట్ హోటల్‌లో ఈ భేటీ జరగడం సంచలనం సృష్టించింది.
తెలుగువన్ వాస్తవ వేదిక 16వ సంచికలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.