ఎంపి మాగుంట వద్ద జయలలిత నిధులు?
Publish Date:Mar 28, 2012
Advertisement
ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి వద్ద తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు చెందిన కోట్లాది రూపాయల నిధులు ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. మాగుంట కుటుంబానికి మన రాష్ట్రంలోని అనేకమంది వ్యాపారవేత్తలు, సినీనటులతో పాటు తమిళనాడుకు చెందిన రాజకీయ నాయకులతో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వారు తమ వద్ద ఉన్న అనధికార మొత్తాలను గత 20 ఏళ్ళుగా మాగుంట కుటుంబీకుల వద్ద దాస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మొత్తాలను మాగుంట కుటుంబం పలు వ్యాపారాల్లో పెట్టుబడులుగా పెడుతోంది. అయితే వీరంతా మాగుంట కుటుంబం వద్ద డబ్బు దాయడానికి గల కారణం ఏమిటని ఆరా తీస్తే ఈ కుటుంబానికి నిజాయితీతో కూడిన కమిట్ మెంట్ చాలా ఎక్కువని తెలిసింది. డబ్బులు ఎవరు దాచుకున్నా అణాపైసలతో సహా లెక్కకట్టి తిరిగి ఇచ్చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. గతంలో ఎన్టీరామారావు కూడా పెద్ద మొత్తంలో నిధులను మాగుంట కుటుంబానికి అప్పగించారు. ఆయన మరణానంతరం ఒక్క మాగుంట కుటుంబీకులే తిరిగి ఆ మొత్తాన్ని ఎన్టీఆర్ కుటుంబానికి అప్పగించడంతో వారి ప్రతిష్ట మరింత ఇనుమడించింది. దీంతో వీరివద్ద డబ్బు దాచుకుంటున్న వారి సంఖ్య బాగా పెరిగిందని తెలిసింది. గతంలో కరుణానిధి కుటుంబానికి చెందిన కోట్లాది రూపాయలు వీరివద్ద ఉండేవని, ఇప్పుడు జయలలిత ఆర్జించిన మొత్తాల్లో కొంత భాగం వీరివద్దే దాచుకుంటుందని తెలిసింది. చిరంజీవికి చెందిన కొంత మొత్తం కూడా వీరి వద్దే భద్రంగా ఉన్నట్లు సమాచారం. మాగుంట కుటుంబం చాలా కమిట్ మెంట్ తో తమవద్ద డబ్బు దాచుకున్న వారి పెట్టుబడులను కాపాడుతూ వారు ఆడిగినప్పుడు అసలుతో పాటు వడ్డీలను కూడా చెల్ల్లిస్తోంది.
http://www.teluguone.com/news/content/ongole-mp-magunta-srinivasulareddy-24-12963.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





