ఒమిక్రాన్ వైరస్ అంత డేంజరా? పెను ముప్పు తప్పదా?  ఇండియాకు కొత్త వేరియంట్ వచ్చేసిందా? 

Publish Date:Nov 28, 2021

Advertisement

దాదాపు రెండేళ్లుగా ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి కొన్ని రోజులుగా కొంత సద్దుమణిగినట్లు అనిపించింది. వైరస్ పీడ పోతుందని ప్రపంచ దేశాలు ఊపిరీ పీల్చుకుంటున్న సమయంలోనే మరో రూపంలో మహమ్మారి విరుచుకుపడుతోంది.  ప్రస్తుతం కరోనా వైరస్ ఓ కొత్త  వేరియెంట్  ఒమిక్రాన్ రూపంతో మళ్లీ ప్రపంచం ముందుకు వచ్చింది. దీంతో ఇప్పుడిప్పుడే ఊపిరిపీల్చుకుంటున్న ప్రజలంతా మళ్లీ వణికిపోతున్నారు. అసలీ ‘ఒమిక్రాన్ అనే వేరియెంట్ ఏమిటి? దాని ప్రభావం తీవ్రంగా ఉంటుందా? ఒమిక్రాన్ ను కంట్రోల్ చేయడం కష్టమా అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. 

కొత్త వేరియంట్ ఒమిక్రాన్ గురించి తెలుస్తున్న విషయాలు తీవ్ర ఆందోళన కల్గిస్తున్నాయి. హాంగ్ కాంగ్ లో క్వారంటైన్ కోసమే ఉద్దేశించిన ఓ హోటల్ లో ఒక  రూమ్ లోని ఓ వ్యక్తికి కొత్త వేరియెంట్ ఒమిక్రాన్  వచ్చింది. ఆయన దక్షిణాఫ్రికా నుంచి రావడంతో ఎందుకైనా మంచిదని ఎదుటి రూమ్ లో ఉన్న దక్షిణాఫ్రికా నుంచి రాని వ్యక్తికి కూడా పరీక్ష చేయించారు. అయితే ఎదుటి రూమ్ వ్యక్తికి కూడా ఒమిక్రాన్ నిర్దారణ అయింది. దీంతో అంతా షాకయ్యారు. ఇద్దరూ కూడా రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్నవారే కావడం మరింత కలవరపరుస్తోంది.  ఓ వ్యక్తి దగ్గర్నుంచి ఎదుటి గదిలో ఉన్న వ్యక్తికి కూడా ‘డెల్టా’ వేరియెంట్ కన్నా  అత్యంత వేగంగా వ్యాపించడంతో ఇప్పుడు ప్రపంచ దేశాలన్ని వణికిపోతున్నాయి.

కరోనా వైరస్ కి కొత్త కొత్త వేరియంట్లు రావడం సహజమే. కాని ఇలా కొత్త వేరియంట్లు వస్తున్నప్పుడు వాటి గురించి అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు గతంలో చెప్పారు. కానీ ఇప్పుడు కొత్తగా వస్తున్న ఈ ‘ఒమిక్రాన్ వేరియంట్ గురించి ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ దీన్ని ‘వేరియంట్ ఆఫ్ కన్సర్న్ గా ప్రకటించింది. బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన తర్వాతే డెల్టాను ‘వేరియంట్ ఆఫ్ కన్సర్న్ గా పేర్కొన్నారు. కానీ... ఒమిక్రాన్ విషయంలో మాత్రం కేవలం వంద మందికి సోకగానే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది.ఈ వేరియంట్ విస్తృతంగా ఉన్న సౌతాఫ్రికా నుంచి విమానాలను అనేక దేశాలు ఇప్పటికే నిషేధించాయి. 

ఆ జన్యు ఉత్పరివర్తనాలు ఒక మేరకు మించి జరిగినప్పుడు అది అంతకుముందున్న వేరియంట్ కంటే పూర్తిగా భిన్నమైనదని శాస్త్రవేత్తలు భావించినప్పుడు... దాన్ని ‘కొత్త వేరియంట్ గా పిలుస్తారు. ఇప్పటివరకు కరోనా వైరస్ లో వచ్చిన వేరియంట్లలో అన్నిటికన్నా ఎక్కువగా జన్యు ఉత్పరివర్తనలు జరిగిన వేరియంట్‌ ఒమిక్రాన్. కరోనాకి  సంబంధించిన వేరియంట్లలో ఉత్పరివర్తనాల విషయంలో ఇది రారాజు లాంటిది.  ఇప్పటి వరకు 50కి పైగా కొత్త జన్యు ఉత్పరివర్తనాలు ఈ వేరియంట్లో శాస్త్రవేత్తలు గుర్తించారు. అంతేకాకుండా వీటిలో సుమారుగా 32 ఉత్పరివర్తనాలు... ఒక్క దాని స్పైక్ ప్రోటీన్ లోనే  ఉండటాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అందులో కూడా ఫ్యూరీన్ క్లీవేజ్ సైట్ అనే భాగంలో మూడు ఉత్పరివర్తనాలు ఉండటం గమనించారు. ఇందువల్ల ఈ వైరస్ కి యాంటీబాడీస్ ను బైపాస్ చేసుకునే లక్షణం వస్తుందనేది శాస్త్రవేత్తల అంచనా. ఎందుకంటే కరోనా వైరస్ మానవ శరీరంలో ప్రవేశించాలంటే దాని స్పైక్ ప్రోటీన్ ను... మన కణజాలంలోకి చొప్పించాల్సిన అవసరం ఉంటుంది. 

యాంటీబాడీస్ తయారుచేయడానికీ, వ్యాక్సిన్ లను రూపొందించడానికీ, మందుల తయారీకీ  శాస్త్రవేత్తలు స్పైక్ ప్రోటీన్‌ని ఒక లక్ష్యంగా చేసుకున్నారు. ఇప్పుడు...  ఎప్పుడైతే స్పైక్ ప్రోటీన్లో ఎక్కువగా ఉత్పరివర్తనాలు జరుగుతున్నాయో అప్పుడు అనేక రకాలైన మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. దీనిలో ముఖ్యంగా కరోనా వైరస్ మన శరీర కణాలలోకి చొచ్చుకుపోయే విషయంలో ఇంకా వేగవంతమయ్యే  అవకాశం ఉంటుంది. రెండవది... మనం తయారుచేసుకున్న వాక్సిన్లను మన శరీరంలోకి ప్రవేశపెట్టాక... అక్కడ అవి ఉత్పత్తి చేసే యాంటీబాడీస్.. ఈ వైరస్‌ని గుర్తించలేకపోవచ్చు. మూడవది... మనం తయారుచేసుకున్న యాంటీవైరల్‌ మందులు ఈ వేరియంట్ పైన పని చేయకపోవచ్చు. నాలుగోది... మనం తయారుచేసుకున్న సింథటిక్ యాంటీబాడీస్ ఈ వైరస్‌ని ప్రభావితం చేయలేకపోవచ్చు. ఈ కారణాలను బట్టి ఈ ఒమిక్రాన్ వేరియంట్ కు కొన్ని ‘సూపర్ పవర్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు.

వేరియంట్లలో ముఖ్యమైనది ఎక్కువ వేగంగా ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాప్తి చెందే సామర్థ్యం. రెండోది... ఎక్కువమందిని ప్రాణాపాయానికి గురిచేసే అవకాశం. మూడోది... ఇప్పుడు ఉన్న వ్యాక్సిన్స్ ... అలాగే సహజంగా ఇన్ఫెక్షన్  తర్వాత దేహంలో ఉత్పన్నమయ్యే యాంటీబాడీలను సమర్థంగా ఎదుర్కొని రోగుల మీద దాడి చేయగలిగే సామర్థ్యం. ఒమిక్రాన్‌ విషయంలోఒక మనిషి నుంచి ఇంకొక మనిషికి వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉందనడానికి కొన్ని ఆధారాలున్నాయి. ముఖ్యంగా దక్షిణాఫ్రికాలో ఈ వేరియంట్  డెల్టా వైరస్ కన్నా వేగంగా వ్యాప్తి చెందుతోంది. రెండోది... ఈ వైరస్ సౌత్ ఆఫ్రికా నుంచి హాంకాంగ్ కి చేరుకున్న తర్వాత అక్కడ క్వారంటైన్ లో ఉన్న ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి చాలా తేలికగా సోకింది. బెల్జియం, ఇజ్రాయిల్‌ మొదలైన దేశాలకు కూడా ఈ వేరియంట్ ఇప్పటికే పాకింది. మొట్టమొదటగా ఈ వేరియంట్ ని బోట్స్ వానా, దక్షిణాఫ్రికాలలో గుర్తించారు. అక్కడ్నుంచి ఇది హాంకాంగ్, బెల్జియం, ఇజ్రాయెల్ కు పాకింది. ఇంకా అనేక దేశాల్లో ఈ వేరియంట్ ఇప్పటికే విస్తరించి ఉండే అవకాశం లేకపోలేదు. ఈ వైరస్ ని ముందుగా బి.1.1.529 అని పిలిచారు. డబ్ల్యూహెచ్ ఓ దీన్ని ‘వేరియంట్  ఆఫ్ కన్సర్న్ గా గుర్తించగానే దీనికి గ్రీక్ ఆల్ఫాబెట్‌ లో 15వ  అక్షరమైన ‘ఒమిక్రాన్  అనే పేరు పెట్టారు. 

By
en-us Political News

  
తెలంగాణ ప్రయోజనాలే తమకు పరమావధన్న ఆయన పార్లమెంటులో ఈ ప్రతిపాదనపై చర్చ,  ఓటింగ్ జరిగినప్పుడు తమ పార్టీకి చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు అనుకూలంగా ఓటు వేస్తారని వెల్లడించారు.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులు ఆమోదం పొందితే దేశ రాజకీయాలలో కాంగ్రెస్ ప్రతిష్ఠ బాగా మసకబారుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నాయి. ఇది 2029 సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ గెలుపు అవకాశాలపై నిస్సందేహంగా ప్రతికూల ప్రభావం చూపుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
తొలి విడత పంచాయతీ ఎన్నికలలో  వైసీపీ మద్దతుదారులు కనీసం పాతిక శాతం  స్థానాలను కూడా గెలుచుకోలేకపోయారు. అదే సమయంలో తెలుగదేశం కూటమి మద్దతు ఉన్నఅభ్యర్థులు తిరుగులేని విజయాలతో ప్రభంజనం సృష్టించారు. 
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ బిల్లు ఉద్దేశాలను, ప్రక్రియను  తప్పుబడుతుండగా, ఇండియా కూటమిలోని పలు ప్రాంతీయ పార్టీలో,  సీట్ల వాటా రక్షణ, సవరణల ఆధారంగా తమ వైఖరిని మార్చుకుంటున్న సంకేతాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి.
డీలిమిటేషన్ తో పాటు, మహిళా రిజర్వేషన్ల అమలును తీసుకురావడమే ఈ సమావేశాల నిర్వహన ప్రధాన లక్ష్యంగా కేంద్రంలోని మోడీ సర్కార్ చెబుతున్నప్పటికీ, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఈ హడావుడి సమావేశాల వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం బీజేపీకి రాజకీయ లబ్ధి చూకూర్చడమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
కేంద్రం తాజాగా తీసుకున్న నిర్ణయం మేరకు ఏ   రాష్ట్రంలోనూ  సీట్ల వాటా తగ్గదు, ప్రస్తుత నిష్పత్తిని కాపాడుతూనే అన్ని రాష్ట్రాల్లోనూ సమానంగా స్థానాలు పెరుగుతాయి.  అంతేకాకుండా, 2051 సీట్ల విషయంలో మార్పులు లేకుండా స్తంభనను అమలు చేయడం ద్వారా భవిష్యత్ జనాభా గణాంకాల ఆధారంగా రాష్ట్రాల మధ్య సీట్ల నిష్పత్తి మారకుండా నియంత్రించామని కేంద్రం చెబుతోంది. 
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన శుక్రవారం (నవంబర్ 27) సాయంత్రం జరిగే  ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశంలో వీరు పాల్గొంటారు. ఈ సమావేశంలో పాల్గొనాల్సిందిగా ప్రధాని నరేంద్రమోడీ ఆహ్వానించడంతో వీరిరువురూ ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు.
ఇటీవలి కాలంలో ఆయన బీజేపీకి దూరంగా జరుగుతున్నారనీ, అదే సమయంలో ఇండియా కూటమికి దగ్గరౌతున్నారనీ వార్తలు వినవస్తున్న నేపథ్యంలో... కేంద్రంలోని ఎన్డీయే కూటమి పార్లమెంటులో డీ లిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టడానికి సమాయత్తమైన తరుణంలో ఆయన మద్దతు ఇస్తారా ఇవ్వరా అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
తెలుగు వన్ న్యూస్ నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ డీఎన్ ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు టీపీసీసీ చీఫ్ పలు కీలక అంశాలపై సమాధానాలిచ్చారు.
జగన్ ఆలయ సంరక్షకుడిగా ఎప్పుడు మారారు అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.  జగన్ హయాంలో ఆత్రేయపురం రథం దగ్ధం సహా పలు ఆలయాలలో జరిగిన అరాచకాలను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు. 
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక అంశాలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో శరద్ పవార్ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇప్పటికే పలువురు నేతలలో కనిపిస్తోంది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో చేసిన సంచలన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపారు.
దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.