ఒమిక్రాన్‌ ను ఉపేక్షిస్తే మూల్యం తప్పుదు

Publish Date:Jan 1, 2022

Advertisement

దేశంలో కరోనా కొత్త వేరియంట్, ఒమిక్రాన్ శరవేగంగా విస్తరిస్తోంది. థర్డ్ వేవ్ వచ్చేసింది. రోజురోజుకు పెరుగుతున్న కేసుల సంఖ్యను గమనిస్తే, అధికారికంగా ప్రకటించక పోయినా, థర్డ్ వేవ్ వచ్చినట్లేనని, వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. గత మూడు నాలుగు రోజులుగా కొత్త కేసుల సంఖ్య వేగంగా పరుగులు తీస్తోంది. కేసులే కాదు, మరణాల సంఖ్య కూడా ఆందోళనకరంగానే  వుంది. పాత సంవత్సరం పోతూ పోతూ చివరి రోజు దేశవ్యాప్తంగా  400 పైగా పైగా  కొవిడ్  రోగుల ప్రాణాలను పట్టుకు పోయింది. అదే రోజున  22వేలకు పైగా కొత్త కేసుల పెరిగాయి, 400 మందికి పైగా మరణించారు. అలాగే, క్రితం రోజుతో పోలిస్తే  డిసెంబర్ 31న ఓమిక్రాన్ కేసులు దాదాపు 200 పెరిగాయి. మొత్తం ఒమిక్రాన్ కేసులు సంఖ్య 1431కు చేరింది. అత్యధికంగా మహారాష్ట్రలో 454 మందికి కొత్త వేరియంట్‌ సోకగా.. డిల్లీలో 351 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి.

అయితే, పరిస్థితి ఇంత ఆందోళనకరంగా ఉన్నా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు ఎవరూ కూడా ఒమిక్రాన్‌ ఉదృతిని గమనించిన దాఖలాలు కన్పించడం లేదు. అసెంబ్లీ ఎన్నికలు జరుగానున్న ఐదు రాష్ట్రాల్లో పీఎం మొదలు ప్రియంకా వాద్రావరకు ప్రతి ప్రముఖ నాయకుడు, నాయకురాలు ఎన్నికల ప్రచార ర్యాలీలు నిర్వహిస్తూనే ఉన్నారు. పెళ్ళికి, చావుకు ఇంత మంది మించి హాజరు కారాదని ఆంక్షలు విధించిన నాయకులు, అధికారులు రాజకీయ పార్టీల ర్యాలీలకు వేలమంది కాదు, లక్షల మంది పాల్గొన్నా పట్టించుకోవడం లేదు. ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలే కాదు, ప్రజలు కూడా ఇంటింటా విషాదాన్ని నిమ్పిన్ సెకండ్ వేవ్’ని అప్పుడే మరిచి పోయారా, అన్నట్లుగా కనీసం ముఖానికి మాస్క్ అయినా లేకుండా  విచ్చల విడిగా విహార యాత్రలు చేస్తున్నారు. గుళ్ళు గోపురాలు తిరుగుతున్నారు. 

‘కొత్త సంవత్సరం తొలి పొద్దున్న జమ్ముకశ్మీర్‌లో మాతా వైష్ణోదేవి ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఇందుకు ఒక ప్రత్యక్ష ఉదాహరణ. ఓ వంక వైరస్ పంజా విసురుతున్న సమయంలో, భౌతిక దూరం అమలులో ఉన్న వేళ దేవాలయంలో  తొక్కిసలాట జరిగి ఏకంగా 12మంది చనిపోయారు. మరో 20 మంది క్షతగాత్రులయ్యారు. దేశంలో ఫై నుంచి క్రింది వరకు నిర్లక్ష్యం, బాధ్యతా రాహిత్యం ఏ స్థాయికి చేరిందో తెలుసుకునేందుకు ఈ విషాద ఒక్కటి చాలని పిస్తోంది. సాధరణ పరిస్థితిలో తొక్కిసలాట జరిగిందంటే కొంత వరకు  అర్థం చేసుకోవచ్చును. కానీ, ఒమిక్రాన్ వేరియంట్ ఉరుముతున్న సమయంలో తొక్కిసలాట జరగటం, జరిగిన విషాద సంఘటన కంటే చాలా చాలా విషాదం. ఇదొకటే కాదు, కొత్త సంవత్సరం సందర్భంగా దేశ వ్యాప్తంగా పబ్బులు, క్లబ్బులు, బార్లు కిటకిటలాడి పోయాయి.ఈ ప్రభావం ఏమిటో ... ఒమిక్రాన్ కేసులు ఏమేరకు పెరుగుతాయో ముందు ముందు గానీ తెలియదు.  

అన్ని జాగ్రత్తలు తీసుకుని మొత్తం సభ్యుల్లో సగం మంది కూడా సభకు హాజరు కాకపోయినా, ఇటీవల ముగిసిన మహరాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాలు వైరస్‌ వ్యాప్తికి కారణమయ్యాయి. ఈ సమావేశాలకు హాజరైన 10 మంది మంత్రులు.. మరో 20 మందికిపైగా ఎమ్మెల్యేలకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అందుకే కావచ్చు మహారాష్ట్ర ప్రభుత్వం, చేతులు కాలిన తర్వాత  న్యూ ఇయర్ వేడుకలపై నిషేధం విధించింది. ఇంకా చేతులు అంతగా కాలని, తెలంగాణ ప్రభుత్వం ఉన్న ఆంక్షలను కూడా తీసేసి ‘ఎంజాయ్’ చేయమంది.అదెలా, ఉన్నా ప్రభుత్వాలు, ప్రజలు జాగ్రత్త పడవలసిన సమయం వచ్చిందని, ఇంకా ఉపేక్ష వహిస్తే అందుకు మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరిస్తున్నారు.

By
en-us Political News

  
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్,   విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.  
 నామినేషన్ల ఉపసంహరణ గడువు  ముగిసే నాటికి  రాష్ట్ర వ్యాప్తంగా  77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.  ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు.  గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో   మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.