Publish Date:Jan 22, 2025
నల్లగొండ జిల్లా కేంద్రంలో బిఆర్ఎస్ రైతు మహాధర్నాకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నెల 28న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు మహా ధర్నా చేపట్టడానికి కోర్టు పచ్చ జెండా ఊపింది.
Publish Date:Jan 22, 2025
హన్మకొండలో దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం పెట్టుకున్న ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవ హత్యకు దారి తీసింది. ఇద్దరు కూడా ఆటో డ్రైవర్లుగా ఉన్నారు. మణికొండకు చెందిన ఆటో డ్రైవర్లు రాజ్ కుమార్, ఏనుగు వెంకటేశ్వర్లు తమ గ్రామానికి చెందిన యువతితో ఇద్దరూ వివాహేతర సంబంధం కొనసాగించారు.
Publish Date:Jan 22, 2025
తెలంగాణలో రెండో రోజు గ్రామసభలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరవేయడానికి అర్హులైన లబ్దిదారుల కోసం రేవంత్ సర్కారు కసరత్తు ప్రారంభించింది. గ్రామ సభలు నిర్వహిస్తోంది.
Publish Date:Jan 21, 2025
దొరక్క దొరక్క కోతికి కొబ్బరి చిప్ప దొరికితే ఎలా ప్రవర్తిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అదే తరహాలో గత నాలుగు రోజులుగా వైసీపీ నేతలు నానా హడావుడి చేస్తున్నారు. ఎన్నికల్లో ఘోర ఓటమి తరువాత వైసీపీ నేతలు పెద్దగా బయటకు రావడం లేదు.. సోషల్ మీడియాలో మాత్రం తెగ హడావుడి చేస్తున్నారు.
Publish Date:Jan 21, 2025
మావోయిస్టులను భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్ గఢ్ ఒడిశా సరిహద్దుల్లో సోమవారం నుంచి మంగళవారం వరకూ రెండు రోజుల పాటు జరిగిన భారీ ఎన్ కౌంటర్ లో పాతిక మంది మావోయిస్టులు హతమయ్యారు. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.
Publish Date:Jan 21, 2025
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. బుధవారం (జనవరి 22) ఉదయం శ్రీవారి దర్శనం కోసం భక్తులు క్యూకాంప్లెక్స్ లో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా నేరుగా ధర్శనానికి అనుమతిస్తున్నారు.
Publish Date:Jan 21, 2025
చట్టానికి అతీతులు ఎవరూ కాదు అని ఈ కేసు మరో మారు నిరూపణ అయ్యింది. నాగచైతన్య, శోభితల విషయమై ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ వేణుస్వామి చేసిన వ్యాఖ్యలపై ఫిలింజర్నలిస్ట్ అసోసియేషన్ ఫిర్యాదు మేరకు తెలంగాణ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసి విచారణకు రావాలని ఆదేశించిన సంగతి తెలిసిందే.
Publish Date:Jan 21, 2025
ఏపీకి సిస్కో గ్లోబల్ కెపాసిటీ సెంటర్ (జీసీసీ) రానుందా? ఈ సంటర్ విశాఖ పట్నంలో ఏర్పాటు కానుందా? అంటే ఔననే సమాధానమే వస్తోంది. దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో భాగంగా మంత్రి నారా లోకేష్ ఎమ్ఎన్సీ ఐటీ సంస్క సిస్కో వైస్ ప్రెసిడెంట్ ఫ్రాన్సిస్ కట్సౌదాస్ తో మంగళవారం (జనవరి 21) భేటీ అయ్యారు.
Publish Date:Jan 21, 2025
ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక జాతర మహాకుంభమేలా.. అనేకానేక విషయాలలో ఈ కుంభమేళా దానికదే సాటి. ఈ కుంభమేళాకు సాధువులు, నాగసాధువులు, అఘోరాలు ఇలా జనం ముందు ఎప్పుడో కానీ కనిపించని ఎందరెందరో వస్తారు. ఇలాంటి వారే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మిగులు తారు.
Publish Date:Jan 21, 2025
ప్రపంచ ఆర్థిక వేదిక వరల్డ్ ఎకనమిక్ ఫోరం శిఖరాగ్ర సదస్సులో భాగంగా దావోస్‌లో పర్యటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి బృందం అక్కడ తెలంగాణ పెవిలి యన్‌ను ప్రారంభించింది. ఈ పెవిలియన్ లో కేంద్ర మంత్రులు చిరాగ్ పశ్వాన్, జయంత్ చౌదరిలతో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు.
Publish Date:Jan 21, 2025
మాజీ మంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. 2019 ఎన్నికలలో వైఎస్ జగన్ పార్టీ విజయానికి ఈ హత్య ద్వారా వెల్లువెత్తిన సానుభూతి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.
Publish Date:Jan 21, 2025
తెలుగుదేశం కూటమి పార్టీల కార్యకర్తల మధ్య ఇప్పుడు ఓ అనవసర రచ్చ జరుగుతోంది. ముఖ్యంగా తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు ఎందుకో తెలియదు కానీ ఓ విధమైన అభద్రతా భావంలో ఉన్నారా అనిపించేలా వ్యవహరిస్తున్నారు. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ ను ఉప ముఖ్యమంత్రిని చేయాలన్న డిమాండ్ నేపథ్యంలో ఈ రచ్చ మొదలైంది.
Publish Date:Jan 21, 2025
కుంభమేళలో ఓవర్ నైట్ సెలబ్రిటీ అయిన మోనాలిసాపై వేధింపులు ఎక్కువయ్యాయి. ఇండోర్ కు చెందిన మోనాలిసా కుటుంబం పూసలమ్ముకుని జీవనం సాగిస్తుంది. మోనాలిసా చూడచక్కని కళ్లు, మోముపై చిరునవ్వు కుంభమేళకు వచ్చిన వారిని ఆకర్షించింది