జనవరి 11 నుంచి న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరగనున్న వన్డే సిరీస్‌కు బీసీసీఐ టిమీండియా జట్టును ప్రకటించింది. శ్రేయస్ అయ్యర్ తిరిగి జట్టులోకి రాగా పేసర్ మహమ్మద్ షమీకి మాత్రం మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. టీ20 వరల్డ్ కప్‌కు బీసీసీఐ జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే వన్డే సిరీస్‌కు ఎట్టకేలకు శనివారం బీసీసీఐ న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు సంబంధించి భారత జట్టును ప్రకటించింది.
గతేడాది అక్టోబర్ ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో క్యాచ్ అందుకునే క్రమంలో శ్రేయస్‌కు తీవ్రమైన గాయమైంది. దీంతో తర్వాత జరిగిన మ్యాచ్‌లకు అయ్యర్ దూరమయ్యాడు. డిసెంబర్ 25న (CoE)లో చేరిన శ్రేయస్.. స్ట్రెంత్ అండ్ కండీషనింగ్‌లో పురోగతి సాధించాడు. బ్యాటింగ్, ఫీల్డింగ్‌లో నాలుగు సెషన్లపాటు కఠినమైన సాధన పూర్తి చేశాడు. మ్యాచ్ సిమ్యులేషన్ సెషన్స్‌లోనూ పాల్గొన్నాడు. దీంతో జట్టులో చోటు దక్కించుకున్నాడు.
భారత తుది జట్టు ఇదే..
శుభ్‌మన్ గిల్(కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, కేఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్, జడేజా, సిరాజ్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, నితీశ్ కుమార్ రెడ్డి, అర్ష్‌దీప్ సింగ్, యశస్వి జైస్వాల్.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/odi-series-36-211966.html
ఈ సంస్థ వలలో పడి 1,044 మంది మోసపోయినట్లు పోలీసుల దర్యాప్తులో చేరింది. ఎల్బీఎఫ్ బాధితుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే అత్యధికులని తేలింది. ఈ సంస్థపై కృష్ణా జిల్లా విస్సన్నపేట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తమిళనాడుతో పాటు పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లోకూడా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. వచ్చే 48 గంటలలో ఈ వాయుగుండం తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశాలున్నాయని పేర్కొంది.
ఆ వెంటనే కవిత బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికీ, బీఆర్ఎస్ ద్వారా తనకు లభించిన శాసనమండలి సభ్యత్వానికి కూడా అప్పుడే రాజీనామా చేశారు. ఆ రాజీనామాను మండలి చైర్మన్ ఇప్పుడు ఆమోదించారు.
బ్లో ఔట్ కారణంగా ఎగజిమ్ముతున్న మంటలను ఒకే సారి నియంత్రిస్తే సాంకేతిక సమస్యలు తలెత్తే అవకాశం ఉందనీ, అందుకే దశలవారీగా మంటల అదుపునకు ప్రయత్నాలు చేస్తున్నామనీ ఓఎన్జీసీ అధికారులు తెలిపారు.
పోలీసులు పలు క్లబ్లులు, పేకాట రాయుళ్లపై కేసులు నమోదు చేశారు.
ఈ నేపథ్యంలోనే 13 ముక్కల పేకాటకు అనుమతి ఇవ్వాలంటూ భీమవరం పట్టణంలోని కొన్ని క్లబ్బులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి.
ఆక్రమణల తొలగింపు కోసం ఢిల్లీ మునిసిపల్ కార్పొరేష్ బుధవారం తెల్లవారు జామున కూల్చివేతల డ్రైవ్ చేపట్టింది. ఈ కూల్చివేతలను స్థానికులు తీవ్రంగా వ్యతిరేకించారు. కూల్చివేతల ప్రాంతంలో ఏర్పాటు చేసిన బారికేడ్లను దాటుకుని వచ్చి మరీ పోలీసులపై రాళ్లు రువ్వారు.
ఖమ్మం నుండి విశాఖపట్నం వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో షార్ట్ సర్క్యూట్ కావడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
బస్సు కొవ్వూరు ఫ్లైఓవర్‌పైకి చేరుకున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్టును సీఎం చంద్రబాబు రేపు సందర్శించనున్నారు. ప్రాజెక్టు నిర్మాణం పనుల పురోగతిని సీఎం స్వయంగా పరిశీలించనున్నారు.
టీటీడీ శ్రీవాణి దర్శన టికెట్ల జారీ విధానంలో మార్పులు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
సోషల్ మీడియాలో కుట్ర పూరిత విద్వేష పోస్టులు పెట్టేవారిపై కఠినంగా వ్యవహరించాలని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు.
ఎంపీ అవినాష్ రెడ్డి అంత క్రిమినల్ బుర్ర నాకు లేదని పులివెందుల టీడీపీ ఇన్‌చార్జి బీటెక్ రవి విమర్శించారు.
గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలను ఒక్కొక్కటిగా వెలికి తీసుకున్నామని, అక్రమార్కులెవరినీ వదలిపెట్టే ప్రసక్తే లేదని మంత్రి సవిత స్పష్టంచేశారు
హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ వినియోగం, విక్రయాలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు.