ఎన్టీఆర్ కాయిన్స్ అవుట్ ఆఫ్ స్టాక్!

Publish Date:Aug 30, 2023

Advertisement

ఆంధ్రుల అభిమాన నటుడు, తెలుగువారు దైవసమానంగా భావించే హీరో, శక పురుషుడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారకరామారావు. సినీ, రాజకీయ రంగాలలో ఎన్టీఆర్ అధిరోహించని ఎత్తులు లేవు. ఆయనను అభిమానించని తెలుగువాడు ఉండడు. అటువంటి ఎన్టీఆర్  గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలుగుజాతి ఉన్నన్నాళ్ళు ఆయన నామం చిరస్మరణీయం. అందుకే ఆయనకు సంబంధించి ఏ చిన్న అంశమైనా తెలుగు వారంతా తమ సొంతంగా భావిస్తారు. ఆయనకు సంబంధించి ఎప్పుడు ఎలాంటి కార్యక్రమం ఎవరు  చేపట్టినా తెలుగు జాతి ఉమ్మడిగా కదిలి వస్తుంది.

కాగా ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా ఆయన ముఖచిత్రంతో 100 రూపాయల నాణెంను రిజర్వ్ బ్యాంకు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ కాయిన్‍ను సోమవారం (ఆగస్ట్ 28) ఢిల్లీలోని రాష్ట్రపతి కల్చరల్ హాలులో నిర్వహించిన కార్యక్రమంలో  రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విడుదల చేశారు. ఎన్టీఆర్ 100 రూపాయల నాణెం విడుదల కార్యక్రమానికి నందమూరి కుటుంబీకులు బాలకృష్ణ, జయకృష్ణతోపాటు పురంధేశ్వరి, చంద్రబాబు నాయుడు తదితరులు హాజరయ్యారు.

సోమవారం విడుదలైన ఈ నాణేన్ని మంగళవారం నుంచి ఆఫ్ లైన్, ఆన్ లైన్ లో విక్రయానికి అందుబాటులో ఉంచారు. హైదరాబాద్ లోని సైఫాబాద్, చర్లపల్లిలోని మింట్ లో అమ్మకాలు చేపట్టగా తొలిరోజే విశేష స్పందన లభించింది. ఈ ఎన్టీఆర్ రూ.100 స్మారక కాయిన్ ధరను మూడు రకాలుగా ప్రజలకు అందుబాటులోకి ఉంచారు. రూ.4,850 చెక్క డబ్బాతో, రూ.4,380 ఫ్రూప్​ ఫోల్డర్​ ప్యాక్​, రూ.4,050 యూఎస్​సీ ఫోల్డర్​ ప్యాక్​గా నిర్ణయించింది. హైదరాబాద్ రెండు మింట్ కేంద్రాలతో పాటు..  https://www.indiagovtmint.in/en/commemorative-coins/ ద్వారా ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పించింది. ధర ఎక్కువైనా రూ.4,850 చెక్క డబ్బాతో వచ్చే కాయిన్ కు డిమాండ్ అధికంగా ఉండడం విశేషం. మంగళవారం ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు నాణేన్ని విక్రయానికి అందుబాటులో ఉంచగా.. నాణేన్ని సొంతం చేసుకొనేందుకు ఉదయం నుండే మింట్ వద్ద ఎన్టీఆర్ అభిమానులు క్యూ కట్టారు. 

రెండు కేంద్రాల్లో కలిపి తొలిరోజు ఐదు వేల వరకు నాణేలు విక్రయాలు జరిగాయి. కొద్ది నిమిషాల్లోనే ముద్రించిన నాణేలన్ని విక్రయాలు జరిగిపోగా.. మరోవైపు ఆన్‌లైన్‌లో విక్రయాలు ప్రారంభించిన కొద్ది గంటలకే వెబ్‌సైట్‌లో అవుటాఫ్ స్టాక్ బోర్డు పెట్టారు. ఊహించని స్థాయిలో ఎన్టీఆర్ స్మారక నాణేనికి  విపరీతమైన డిమాండ్ నెలకొంది. మొత్తం 12 వేల నాణెల్ని ముద్రించగా.. మరో ఎనిమిది వేల నాణేలను ముద్రించనున్నారు. ఆఫ్ లైన్ లో 5 వేల నాణెలు తొలిరోజే అమ్ముడుపోగా.. ఆన్ లైన్ లో నిమిషాల వ్యవధిలోనే అవుటాఫ్ స్టాక్ బోర్డులు పెట్టేశారు. సాధారణంగా  స్మారక నాణేలకు పెద్దగా డిమాండ్ ఉండదు. అందుకు భిన్నంగా ఎన్టీఆర్ నాణేలకు విపరీతమైన డిమాండ్ ఉండటం ఆయన పట్ల తెలుగువారి అభిమానానికి నిదర్శనంగా చెప్పవచ్చు. ఇప్పటి వరకు ఏ స్మారక నాణేనికి లేని డిమాండ్ ఎన్టీఆర్ నాణేనికి ఉందని మింట్ ఫైనాన్స్ జాయింట్ జనరల్ మేనేజర్ గుండపునీడి శ్రీనివాస్ చెప్పారు. 

ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా ప్రముఖుల జ్ఞాపకార్థం ఇలా ఎన్నో కాయిన్స్ విడుదల చేసినా ఏ  స్మారక నాణేనికీ దక్కని విశేష స్పందన ఎన్టీఆర్ నాణానికి దక్కడం విశేషం. ఇప్పటి వరకూ విడుదల చేసిన నాణేలేవీ  పదివేలకు మించి ముద్రించలేదని, ఎన్టీఆర్ నాణేనికి డిమాండ్ ఉంటుందని భావించి ముందుగానే 12వేలు ముద్రించామని, అయితే అవి తొలిరోజే అమ్ముడవడం విశేషమని శ్రీనివాస్ చెప్పారు. దీనిని బట్టే ఎన్టీఆర్ కు ఉన్న క్రేజ్ ఎంతటిదో అర్ధమౌతుంది.  మరో ఎనిమిది వేలు ముద్రించి అందిస్తామని శ్రీనివాస్ చెప్పారు. అయితే, తొలిరోజు ఎక్కడ ఈ నాణేలు దొరుకుతాయో.. ఎలా దక్కించుకోవాలో చాలా మంది అభిమానులకు అవగాహనా లేదు. అసలు చాలా మందికి ఇవి అందుబాటులోకి వచ్చాయని కూడా తెలియదు. అయినా ఈ స్థాయిలో డిమాండ్ ఏర్పడింది. కాగా.. ఒకటీ రెండు రోజులు పోతే ఈ నాణేనికి ఇంకాడిమాండ్ ఏర్పడడం ఖాయంగా కనిపిస్తున్నది. మరి ముద్రించే 8 వేలు ఉన్న డిమాండ్ కు ఏ మాత్రం సరిపోవు అనడంలో సందేహం అక్కర్లేదు. దశాబ్దాలు గడుస్తున్నా ఆయన ఛరిష్మా ఇసుమంతైనా తగ్గలేదు సరికదా మరింత పెరుగుతోంది అనడానికి  ఈ నాణానికి ఉన్న డిమాండ్ ను బట్టే తెలిసిపోతున్నది.

By
en-us Political News

  
వందేళ్లు దాటినా తగ్గని ఉత్సాహం.. 101 ఏళ్ల వృద్ధుడి ఆరోగ్య రహస్యాలు ఇవే.!
హైదరాబాద్ నగరం సైబర్ నేరాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్న తరుణంలో, అమాయకులను లక్ష్యంగా చేసుకుని సాగుతున్న మోసాలు కలకలం రేపుతున్నాయి
బాలీవుడ్ ప్రముఖ నటుడు టైగర్ ష్రాఫ్‌ను లక్ష్యంగా చేసుకుని జరిగిన కాల్పుల ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది
 తిరుపతి, ఏలూరు, శ్రీకాకుళం, సాలూరు,  పిఠాపురం ఇలా రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల సీట్ల సర్దుపాట్లు కూటమి శ్రేణుల మధ్య అగాధాన్ని పెంచుతూ ఐక్యతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత గడ్డ అయిన ఉమ్మడి కడప జిల్లాలో ఆ పార్టీకి తీవ్ర రాజకీయ ప్రతికూలత ఎదురౌతోందని చెప్పడానికి స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియే నిలువెత్తు నిదర్శనంగా చెబుతున్నారు.
కమ్మ నాయకుడు ఏబీవీకి స్వతంత్ర అభ్యర్థిగా మద్దతు ఇస్తూ, కాపు నాయకుడు  వంగవీటి రాధను జనసేనలోకి పంపారన్నది విజయసాయి రెడ్డి ఆరోపణ.  కాంగ్రెస్, సీపీఐ, సీపీఎంలు ఏబీవీకి మద్దతు ఇవ్వడాన్ని కూడా ఆయన చంద్రబాబు వ్యూహంగానే అభివర్ణిస్తున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఏకగ్రీవాలకు  అవకాశం ఇవ్వకూడదని వైసీపీ అధినేత జగన్ పలు మార్లు విస్పష్టంగా చెప్పినా, ఆయనకు అత్యంత బలమైన పట్టు ఉన్న కడప జిల్లాలోనే కీలకమైన రెండు మునిసిపాలిటీలు ఏకగ్రీవం కావడం పార్టీపై జగన్ పట్టు సడలిందా అన్న అనుమానాలను తావిస్తోంది.
పుంగనూరుతో పాటు రాయచోటి, ధర్మవరం తదితర ప్రాంతాల్లో నామినేషన్ల దాఖలు సమయంలో ఉద్రిక్తతలు తలెత్తిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలను ప్రస్తావిస్తూ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి సరిగా లేదన్న వాదనతో కేంద్ర బలగాలను రంగంలోకి దించాలని వైసీపీ   ప్రయత్నించింది.
హైదరాబాదు నగరంలో తీవ్ర సంచలనం సృష్టించిన మాజీ డీజీపీ వినయ్ రంజన్ రాయ్ సతీమణి తనూజ హత్య కేసులో తెలంగాణ స్పెషల్ టీం కీలక పురోగతి సాధించారు.
పండుగకు చెల్లిని ఇంటికి తీసుకెళ్లాలని వచ్చాడు.. కుటుంబమంతా కలిసి ఆనందంగా పండుగ జరుపుకోవాలని ఆశపడ్డాడు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ చర్చనీయాంశంగా ఉండే బెజవాడ రాజకీయం మరోసారి వేడెక్కింది.
పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో దుర్గాపూజ ఉత్సవాల వేళ తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
పండుగ వేళ ఆ కళాశాలలో నవ్వులు విరిశాయి.. స్నేహితుల సందడి, దాండియా నృత్యాలతో ప్రాంగణమంతా కోలాహలంగా మారింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.