స్థానిక ఎన్నికలకు కేంద్ర బలగాలు: వైసీపీ పిటిషన్ డిస్మిస్.. బెడిసికొట్టిన జగన్ వ్యూహం.!

Publish Date:Oct 18, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్న తరుణంలో,వైసీపీకి న్యాయస్థానంలో ఊహించని షాక్ తగిలింది. రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం, నామినేషన్ల పర్వం ప్రారంభమైన వేళ ఉద్రిక్త పరిస్థితులను సాకుగా చూపుతూ కేంద్ర బలగాలను రప్పించాలని ఆ పార్టీ దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు తోసిపుచ్చింది. పలు ప్రాంతాల్లో చోటుచేసుకున్న ఘటనలను చూపిస్తూ వైసీపీ కోర్టును ఆశ్రయించినప్పటికీ, ఆ వాదనలు నిలవకపోవడంతో వైఎస్సార్‌సీపీ వ్యూహాలు బెడిసికొట్టాయి.

పుంగనూరుతో పాటు రాయచోటి, ధర్మవరం తదితర ప్రాంతాల్లో నామినేషన్ల దాఖలు సమయంలో ఉద్రిక్తతలు తలెత్తిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలను ప్రస్తావిస్తూ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి సరిగా లేదన్న వాదనతో కేంద్ర బలగాలను రంగంలోకి దించాలని వైసీపీ   ప్రయత్నించింది. అయితే, ఇతర రాష్ట్రాల ఉదాహరణలను ప్రస్తావించినప్పట్టికి, ఏపీలోనూ అలాంటి పరిస్థితులు ఉన్నాయా అన్న ప్రశ్నకు సరైన వివరణ ఇవ్వలేకపోవడంతో న్యాయస్థానం వారి అభ్యర్థనను అంగీకరించలేదు.  

ఈ వివాదాల కేంద్రంగా నిలిచిన పుంగనూరు ఘటనలో ఎంపీ మిథున్ రెడ్డి వ్యవహారశైలిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా రిటర్నింగ్ అధికారి కార్యాలయం వద్ద జరిగిన పరిణామాలు, కాన్వాయ్ దూసుకెళ్లిన వైనంపై పోలీసులు ఇప్పటికే కేసులు నమోదు చేశారు. డ్రోన్ కెమెరా ఫుటేజ్.  ఇతర ఆధారాలను అడ్వకేట్ జనరల్ న్యాయస్థానం ముందు ఉంచడంతో, ఘర్షణలకు ఎవరు కారణమన్న అంశంపై స్పష్టత వచ్చింది. కార్యాలయం వద్ద జరిగిన హడావుడి, రక్తం అంటించుకుని నిరసన తెలిపిన తీరు వంటి అంశాలు తెరపైకి రావడంతో వైసీపీ పరువు గంగలో కలిసినట్లైంది. 

మరోవైపు . క్షేత్రస్థాయిలో అభ్యర్థుల ఎంపిక, ఆర్థికపరమైన అంశాలు, గత ప్రభుత్వ హయాంలోని పరిణామాలు ప్రస్తుత ఎన్నికలపై ప్రభావం చూపుతున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  కొన్ని కీలక నియోజకవర్గాల్లో వైసీసీ నుంచి పోటీ చేయడానికి ఎవరూ ముందుకు రాని పరిస్థితులు నెలకొన్నాయన్న ప్రచారం కూడా జరుగుతోంది.  ఇలాంటి సమయాల్లో పార్టీని నడిపించేందుకు అధిష్టానం వేస్తున్న ఎత్తుగడలు బూమరాంగ్ అవుతున్నాయనీ, పార్టీ ప్రతిష్ట పూర్తిగా మసకబారుతోందన్న వాదన గట్టిగా వినిపిస్తోంది. 

 

[YCP High Court Setback, Mithun Reddy Punganur Incident, AP Local Body Elections,YS Jagan Strategy, Central Forces AP High Court, Telugu One]

By
en-us Political News

  
కమ్మ నాయకుడు ఏబీవీకి స్వతంత్ర అభ్యర్థిగా మద్దతు ఇస్తూ, కాపు నాయకుడు  వంగవీటి రాధను జనసేనలోకి పంపారన్నది విజయసాయి రెడ్డి ఆరోపణ.  కాంగ్రెస్, సీపీఐ, సీపీఎంలు ఏబీవీకి మద్దతు ఇవ్వడాన్ని కూడా ఆయన చంద్రబాబు వ్యూహంగానే అభివర్ణిస్తున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఏకగ్రీవాలకు  అవకాశం ఇవ్వకూడదని వైసీపీ అధినేత జగన్ పలు మార్లు విస్పష్టంగా చెప్పినా, ఆయనకు అత్యంత బలమైన పట్టు ఉన్న కడప జిల్లాలోనే కీలకమైన రెండు మునిసిపాలిటీలు ఏకగ్రీవం కావడం పార్టీపై జగన్ పట్టు సడలిందా అన్న అనుమానాలను తావిస్తోంది.
హైదరాబాదు నగరంలో తీవ్ర సంచలనం సృష్టించిన మాజీ డీజీపీ వినయ్ రంజన్ రాయ్ సతీమణి తనూజ హత్య కేసులో తెలంగాణ స్పెషల్ టీం కీలక పురోగతి సాధించారు.
పండుగకు చెల్లిని ఇంటికి తీసుకెళ్లాలని వచ్చాడు.. కుటుంబమంతా కలిసి ఆనందంగా పండుగ జరుపుకోవాలని ఆశపడ్డాడు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ చర్చనీయాంశంగా ఉండే బెజవాడ రాజకీయం మరోసారి వేడెక్కింది.
పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో దుర్గాపూజ ఉత్సవాల వేళ తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
పండుగ వేళ ఆ కళాశాలలో నవ్వులు విరిశాయి.. స్నేహితుల సందడి, దాండియా నృత్యాలతో ప్రాంగణమంతా కోలాహలంగా మారింది.
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌ జిల్లాలో శనివారం అర్ధరాత్రి దాటాక అత్యంత హృదయ విదారకమైన ఘటన చోటుచేసుకుంది
కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో భక్తుల తాకిడి ఒక్కసారిగా భారీగా పెరిగింది.
బర్త్‌డే నాడే భార్యను చంపి సూసైడ్ చేసుకున్న టెకీ.!
చిన్నారుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని దేశీయ ఆహార భద్రతా నియంత్రణ సంస్థ కీలకమైన ముసాయిదా నిబంధనను తెరపైకి తెచ్చింది.
భారతీయ సైన్యంలో అత్యున్నత ప్రమాణాలుగా భావించే క్రమశిక్షణను ఉల్లంఘించిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గమ్మవారిని ప్రముఖ సినీ నటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న దంపతులు దర్శించుకున్నారు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.