పిలిప్పీన్స్ కేంద్రంగా నడుస్తున్న అంతర్జాతీయ ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠాను అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పోలీసులు బట్టబయలు చేశారు. ఈ ముఠాకు చెందిన 10 మందిని అరెస్ట్ చేశారు, మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. నిందితుల వద్ద నుంచి రూ.19.70 లక్షల నగదు, కారు, నాలుగు బైకులు, ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులు తదితర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే.. 9 బ్యాంకుల్లో ఉన్న రూ.18.20 లక్షల నిధులను ఫ్రీజ్ చేశారు. మొత్తం స్వాధీనం విలువ సుమారు రూ.60 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. కల్యాణదుర్గం పట్టణంలోని సిద్దప్పవంక వీధిలో ఓ ఇంటిలో నిందితులు డ్రీమ్ ప్లే-1 యాప్ ద్వారా క్యాసినో, రోలెంట్, డ్రాగన్, క్రికెట్ బెట్టింగ్ వంటి నిషేధిత గేమ్స్ నిర్వహిస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
పిలిప్పీన్స్ కేంద్రంగా నెట్‌వర్క్
పోలీసుల విచారణలో శివ అనే వ్యక్తి పిలిప్పీన్స్‌లోని మాకాటి ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని ఈ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తేలింది. దేశవ్యాప్తంగా సభ్యులను నియమించి, వారి ద్వారా బ్యాంకు ఖాతాలు, సిమ్ కార్డులు సేకరించి విదేశాలకు పంపుతున్నట్లు గుర్తించారు. ఫోన్‌పే ద్వారా లావాదేవీలు నిర్వహిస్తూ అక్రమ ఆదాయం పొందుతున్నట్లు వెల్లడైంది.
మ్యూల్ ఖాతాల వినియోగం
స్థానికంగా తలారి మధు ముఠాను నడిపిస్తూ, ఇతరులను చేర్చుకుని సుమారు 70 మంది పేర్లపై బ్యాంకు ఖాతాలు తెరిపించినట్లు తెలిసింది. పాస్‌బుక్స్ కోసం వారికి రూ.10 వేల చొప్పున చెల్లించినట్లు పోలీసులు తెలిపారు. సేకరించిన సిమ్ కార్డులు, బ్యాంకు వివరాలను కార్గో పార్శిళ్లలో దాచిపెట్టి పిలిప్పీన్స్‌కు పంపినట్లు పోలీసులు వెల్లడించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/nternational-cricket-betting-racket-busted-36-219036.html
ఢిల్లీ ఎన్‌సీఆర్ ప్రాంతంలో రాత్రంతా కురిసిన భారీ వర్షాలకు జనజీవనం స్తంభించింది. ఐఎండీ రెడ్ అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో వాతావరణ అప్‌డేట్స్, ట్రాఫిక్ జామ్స్ మరియు వర్షపాతం వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
జూలై 9 గురువారం నాడు దేశంలో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. హైదరాబాద్, విజయవాడ, ఢిల్లీ సహా ప్రముఖ నగరాల్లో 24 క్యారెట్, 22 క్యారెట్ పసిడి తాజా రేట్లను ఇక్కడ తెలుసుకోండి.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సరికొత్త EPS Scheme 2026 తో ఉద్యోగుల పెన్షన్ విధానంలో భారీ మార్పులు జరిగాయి. కేవలం 20 రోజుల్లోనే క్లెయిమ్ సెటిల్‌మెంట్, ఆలస్యమైతే 12% పెనాల్టీ వడ్డీతో పాటు పాత స్కీమ్ EPS 1995 కు మరియు కొత్త విధానానికి గల ముఖ్యమైన తేడాలను ఈ స్టోరీలో పూర్తిగా తెలుసుకోండి.
కేంద్ర ప్రభుత్వం కస్టమ్స్ సుంకం Customs Duty మినహాయింపులను భారీగా విస్తరించడంతో డిక్సన్ టెక్, సిర్మా ఎస్జీఎస్, అంబర్ ఎంటర్‌ప్రైజెస్ షేర్లు 6 శాతం వరకు పెరిగాయి. 2029 వరకు వర్తించే ఈ కొత్త రూల్స్ ఎలక్ట్రానిక్స్ రంగాన్ని ఎలా మార్చబోతున్నాయో ఇక్కడ చూడండి.
భారత ఆర్థిక రంగంలో చారిత్రక మైలురాయి తొలిసారిగా ఎఫ్‌ఐఐ FII ఆస్తులను అధిగమించి రూ. 76.41 లక్షల కోట్లకు చేరిన దేశీయ మ్యూచువల్ ఫండ్స్ ఆస్తులు. పూర్తి వివరాలు మరియు ఆసక్తికర గణాంకాలు ఇక్కడ చూడండి.
ఐసీఐసీఐ బ్యాంక్ షాపింగ్ ఫెస్టివల్ ఆఫర్లు ఈరోజు అర్ధరాత్రితో ముగియనున్నాయి. ఎలక్ట్రానిక్స్, ఈ-కామర్స్, ఫ్యాషన్ వస్తువులపై ₹7,500 వరకు డిస్కౌంట్ పొందే పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
న్యూజిలాండ్‌లో ఉన్నత చదువుల కోసం ఇమ్మిగ్రేషన్ శాఖ సరికొత్త పాత్‌వే స్టూడెంట్ వీసా (PSV) నిబంధనలను తెచ్చింది. ఒకే వీసాతో ఐదేళ్లలో 3 కోర్సులు చదివే ఈ కొత్త రూల్స్, అర్హతల పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
టాటా గ్రూప్ ఐటీ దిగ్గజం టీసీఎస్ (TCS) నేడు తమ క్యూ1 ఫలితాలను విడుదల చేయనుంది. ఉద్యోగుల వేతనాల పెంపు ప్రభావం మరియు రాబోయే డివిడెండ్, మార్కెట్ నిపుణుల అంచనాల పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
నిన్నటి భారీ పతనం తర్వాత భారత స్టాక్ మార్కెట్లు అదిరిపోయే రీతిలో కోలుకున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ భారీ లాభాల్లో పయనిస్తూ ఇన్వెస్టర్ల సంపదను పెంచాయి. మార్కెట్ జోరుకు గల 5 ముఖ్య కారణాలు మరియు రాబోయే రోజుల్లో ఏం జరగబోతుందో ఇక్కడ పూర్తిగా తెలుసుకోండి.
ఫిఫా ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్‌లో ఫ్రాన్స్‌తో తలపడనున్న మోరాకోకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. హామ్‌స్ట్రింగ్ గాయం కారణంగా స్టార్ ప్లేయర్ ఇస్మాయిల్ సైబారీ మ్యాచ్‌కు దూరమయ్యాడు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
ఈ పత్రాలను నమ్మిన మెటాలాయిడ్ సంస్థ షేర్‌హోల్డర్స్ అగ్రిమెంట్, ప్రాజెక్ట్ గవర్నెన్స్ ఒప్పందాలు సహా పలు ప్రక్రియలను పూర్తి చేసింది. అయితే అనంతరం నిర్వహించిన డ్యూ డిలిజెన్స్‌లో సమర్పించిన బ్యాంకు పత్రాలు, గ్యారంటీలు, ఖాతా వివరాలు నకిలీవని తేలింది. దీంతో తాము మోసపోయినట్లు గుర్తించిన సంస్థ ప్రతినిధులు నేరుగా సంబంధిత బ్యాంకును సంప్రదించగా, పత్రాల్లో పేర్కొన్న వివరాలు తమ రికార్డుల్లో లేవని స్పష్టం చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఫిఫా వరల్డ్‌కప్ 2026 క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ విడుదల. అర్జెంటీనా, ఫ్రాన్స్, స్పెయిన్, ఇంగ్లాండ్ జట్ల మ్యాచ్‌ల తేదీలు, సమయాలు మరియు పూర్తి వివరాలు తెలుగులో చూడండి.
భారత టెన్నిస్ దిగ్గజం, 18 గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల విజేత లియాండర్ పేస్ ఆసియా టెన్నిస్ సమాఖ్య (ATF) ప్లేయర్ అంబాసిడర్‌గా నియమితులయ్యారు. వింబుల్డన్ వేదికగా జరిగిన ఈ చారిత్రాత్మక నిర్ణయం మరియు పేస్ సాధించిన రికార్డుల పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.