ఓటు కోసం అమెరికా టూ హైదరాబాద్
Publish Date:Dec 7, 2018
Advertisement
ఈ మధ్యనే ఓ సినిమాలో చూసాం ఓ వ్యక్తి తన ఓటు హక్కు వినియోగించుకోటానికి విదేశాల నుంచి స్వదేశానికి వస్తాడు. అది సినిమా.. కానీ నిజ జీవితంలో ఓటు కోసం అంత ఖర్చు పెట్టుకొని ఎవరు వస్తారు అనుకుంటే పొరపాటే. నేడు తెలంగాణాలో పోలింగ్ జరుగుతున్నది విదితమే. ఈ నేపథ్యంలో తన ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అమెరికా నుంచి నగరానికి వచ్చారు. సీతాఫల్‌మండికి చెందిన సత్య ప్రకాష్ వృత్తిరీత్యా అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. సొంత రాష్ట్రం తెలంగాణలో జరుగుతున్న ఎన్నికల్లో ఎలాగైనా వెళ్లి ఓటు వేయాలని సంకల్పంతో అమెరికా నుంచి వచ్చి తన విలువైన ఓటును వినియోగించుకున్నారు. మరోవైపు సరితగౌడ్ అనే యువతి కూడా దక్షిణాఫ్రికా నుంచి సికింద్రాబాద్‌కు వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేయడం కోసమే నగరానికి వచ్చిన వీరు గురించి పోలింగ్ కేంద్రాల తెలియడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మంచి ప్రజానాయకుడిని ఎన్నుకోవటానికి ఓటే ఆయుధమని, అందుకోసం ప్రతి ఒక్కరూ తమ విలువైన ఓటును వినియోగించుకోవాలని యువ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సత్య ప్రకాష్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఓటు వేసేందుకు వీరు చూపిన చొరవ ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం. అంతేకాకూండా ఓటు యొక్క విలువను వీరు చాటి చెప్పారు.
http://www.teluguone.com/news/content/nris-utilizing-their-votes-in-telangana-elections-39-84767.html





