కేటీఆర్‌కు ఎన్నారైల కఠిన ప్రశ్నలు!.. ఆన్సర్స్ చెప్పలేక ఇబ్బందులు!?
Publish Date:Mar 24, 2022
Advertisement
కేటీఆర్ అమెరికాలో పర్యటిస్తున్నారు. తెలంగాణకు పెట్టుబడులు ఆకర్షిస్తున్నారు. మన ఊరు-మన బడిలో భాగంగా ఎన్నారైలు.. ఇక్కడి స్కూల్స్‌కు డొనేషన్స్ ఇవ్వాలని అడుతున్నారు. మిలిపిటాస్‌లోని ఇండియన్ కల్చరల్ సెంటర్‌లో ఎన్‌ఐఆర్‌ల ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొని.. తెలంగాణ సాధించిన విజయంలో ఎన్‌ఆర్‌ఐలు భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ అభివృద్ధి గురించి కేటీఆర్ తాను చెప్పాల్సింది చెప్పగా.. ఎన్నారైల నుంచి ఆయనకు పలు చేదు ప్రశ్నలు ఎదురైనట్టు తెలుస్తోంది. మీట్ అండ్ గ్రీట్ ప్రొగ్రామ్‌కు ప్రవాస భారతీయులు బాగానే ప్రిపేరై వచ్చినట్టున్నారు. పూర్తిగా వన్ సైడెడ్‌గా కాకుండా.. ఎన్నారైల నుంచి గట్టిగానే నిలదీతలు ఎదుర్కొన్నారట కేటీఆర్. వారి ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక కేటీఆర్ బాగా ఇబ్బంది పడ్డారని తెలుస్తోంది. ఆ మేరకు కేటీఆర్‌ను ఎన్నారైలు అడిగినట్టు చెబుతున్న పలు ప్రశ్నలు సోషల్ మీడియాలో అందుబాటులో ఉన్నాయి. ఆ క్వశ్చన్స్ చూస్తే.. కేటీఆర్‌ను బాగానే నిలదీసినట్టు.. ఆయన చాలా ఇబ్బంది పడినట్టు తెలుస్తోంది. ఆ ప్రశ్నలు ఇవేనంటూ వైరల్ అవుతున్న కొన్ని క్వశ్చన్స్ ఇవే..... Q: పిఆర్‌సిపై బిస్వాల్ కమిటీ నివేదిక ప్రకారం తెలంగాణలో 3 లక్షల ఖాళీలు ఉన్నాయి.. రాష్ట్రం ఏర్పడే సమయానికి 1.2 లక్షల ఖాళీ స్థానాలు లెక్క తేల్చారు. మరి, TSPSC గణాంకాల ప్రకారం.. ఇంత వరకూ కేవలం 33 వేల ఉద్యోగాలు మాత్రమే ఎందుకు భర్తీ చేశారు? ఒక్క గ్రూప్-1 నోటిఫికేషన్ కూడా ఎందుకు రిలీజ్ చేయలేదు? Q: తెలంగాణలో ఉపాధ్యాయ ఉద్యోగ నోటిఫికేషన్‌లు లేవు.. ఖాళీగా ఉన్న 2 లక్షల టీచర్ పోస్టులను ఎందుకు భర్తీ చేయలేదు? Q: తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ యువత ఎందుకు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు? ప్రతినెలా ఒకటి, రెండు ఆత్మహత్య కేసులు ఎందుకు చూస్తున్నాం? Q: కేవలం కొన్ని నియోజకవర్గాలకు మాత్రమే ఎక్కువ అభివృద్ధి, ఎక్కువ నిధులు ఎందుకు వస్తున్నాయి? ఇతర ప్రాంతాలకు ఎందుకు పెద్ద ఎత్తున నిధులు ఇవ్వట్లేదు? Q: మూసీ నది కార్యాచరణ ప్రణాళిక ఎందుకు అమలు కాలేదు? ప్రభుత్వం నుంచి ఎందుకు చొరవ, చర్యలు లేవు? Q: SC/ST సబ్ ప్లాన్ నిధులలో 10% ఎందుకు వినియోగించలేదు? Q: కాళేశ్వరం ఎత్తిపోతలతో ఎకరా నీటిపారుదలకి నికర వ్యయం ఎంత? Q: RTI సమాచారం ప్రకారం.. గడువులోపు యుటిలైజేషన్ సర్టిఫికెట్లు పంపనందుకు చాలా కేంద్ర నిధులు సరిగ్గా వినియోగించబడలేదు ఎందుకని? మ్యాచింగ్ గ్రాంట్‌లను ఎందుకు విడుదల చేయట్లేదు? Q: ప్రైవేట్ విద్యపై ఎందుకు నియంత్రణ లేదు? హైదరాబాద్‌లో బార్‌లు, పబ్బులు, గంజాయి అక్రమ రవాణా గురించి ఏం చెబుతారు?
http://www.teluguone.com/news/content/nri-questions-to-ktr-39-133459.html





