పీఎం మోదీని ఉక్రెయిన్ టార్గెట్ చేసిందా?.. ఆ విమానాన్ని అందుకే కూల్చేసిందా?

Publish Date:Mar 24, 2022

Advertisement

రష్యా – ఉక్రెయిన్ యుద్ధం మొదలై నెలరోజులు పూర్తయింది. రెండవ నెలలో ప్రవేశిస్తోంది. ముగింపు కనుచూపు మేరలో కనిపించడం లేదు. నిజానికి, రష్యా – ఉక్రెయిన్ యుద్ధం అనే కాదు, ఏ యుద్ధం అయినా అంతే, ప్రారంభమే దేశాధి నేతలు, సైన్యాధ్యక్షుల చేతుల్లో ఉంటుంది, ముగింపు, ఎవరి చేతుల్లోనూ ఉండదు. ఊహకూ అందదు. అందులోనూ ఉభయ దేశాలు ఒక విధమైన మొండి వైఖరిని అవలంబిస్తున్నప్పుడు, యుద్ధం ముగింపు ఊహించడం కూడా ఒక విధంగా, యుద్ధమంత దుస్సాహసమే అవుతుందని,అందుకే యుద్ధం వద్దని నిపుణులు ఎప్పుడూ హెచ్చరిస్తూనే ఉంటారు. అదలా ఉంటే, రష్యా - ఉక్రెయిన్ యుద్ధం రెండు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం కాదు. రష్యా - ఉక్రెయిన్ యుద్ధం అగ్రరాజ్యం అమెరికా, చైనా సహా అనేక దేశాల దౌత్య సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. భౌగోళిక, ఆర్థిక స్థితిగతుల మీద ప్రభావం చూపుతుంది. అందుకే రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందనే భయాందోళనలు వ్యక్త మవుతున్నాయి. 

ఇలా అనేక  చిక్కుముళ్ళ మధ్య సాగుతున్న యుద్ధం ఎప్పుడు ముగుస్తుంది? ముగింపు ఎలా ఉంటుంది? అనేది ఊహాకు చిక్కే విషయం కాదు. అందుకే, ప్రపంచ దేశాలు వేటికవి ఆచి తూచి అడుగులు వేస్తున్నాయి. భారత దేశం సహ ఏ దేశం కూడా గీత దాటి యుద్ధ వ్యూహంలో వేలు పెట్టే ప్రయత్నం చేయడం లేదు. అమెరికా సహా అనేక పాశ్యాత్య దేశాలు రష్యాపై ఆంక్షలు విధించడం, తద్వారా రష్యాను దారికి తెచ్చుకునే  ప్రయత్నాలు చేస్తున్నాయే కానీ, ఉక్రెయిన్ కోరినా ఆయుధాలు, యుద్ధ విమానాలు ఇచ్చేందుకు సుముఖత చూపడం లేదు. అదే జరిగితే చైనా, రష్యా చేతులు కలిపే ప్రమాదం ఉందని పాశ్యాత్య దేశాలు వెనకా ముందు అవుతున్నాయని దౌత్య రంగ నిపుణులు అంటున్నారు. ఇలా ఎలా చూసినా కుడా రష్యా,ఉక్రెయిన్ యుద్ధం చిక్కుముళ్ళ దశను దాటి సంక్షోభం అంచులకు చేరుకుంది. రోజు రోజుకు మరింత జటిలంగా మారుతోంది. చివరకు ఏ తీరం చేరుతుంది, ఎంత వినాశనాన్నిమిగులుస్తుందో,ఏమో ఎవరికీ తెలియదు. 

అదలా ఉంటే రష్యా, ఉక్రెయిన్ యుద్ధం కీలక దశకు చేరుకున్న ప్రస్తుత సమయంలో కొన్ని కొత్త నిజాలు, వెలుగు చూస్తున్నాయి. యుద్ధం మొదలైన మొదటి రోజు నుంచి, రష్యా తప్పు చేస్తోందనే భావన, అందరిలో ముఖ్యంగా భారతీయుల్లో బలంగా వ్యక్తమైంది. రోడ్డు ప్రమాదంలో తప్పు ఎవరిదైనా, దెబ్బలు తగిలినవాడి పట్ల సానుభూతి వ్యక్తమైన విధంగా, రష్యా దాడిలో చాలా పెద్ద సంఖ్యలో సామాన్య ప్రజలు కూడా ఉక్రెయిన్ ప్రజలు మరణించడం, ఆస్తులు ద్వంసం కావడంతో ప్రపంచ వ్యాప్తంగాను ఉక్రెయిన్ పట్ల  ఒక విధమైన సానుభూతి వ్యక్తమవుతోంది. రష్యా దురాక్రమణకు పాల్పడుతోందనే అభిప్రాయమే, అందరిలో వ్యక్తమైంది. ఉక్రెయిన్ బాధిత దేశంగా సానుభూతిని సంపాదించుకుంది. కానీ, అదెలా ఉన్నప్పటికీ, ఉక్రెయిన్’ అందరూ అనుకున్నత సాధు దేశం కాదని, తాజాగా వెలుగు చూసిన ఉదంతం ఒకటి హెచ్చరిస్తోంది. 

భారత ప్రధాని నరేంద్ర మోడీ, 2014లో అధికార పగ్గాలు చేపట్టిన వెంటనే, అనేక ప్రపంచ దేశాలు చుట్టి వచ్చారు. అదే క్రమంలో, జర్మనీలోని ఫ్రాంక్’ఫర్ట్’లో ఒక అంతర్జాతీయ సదస్సుకు హాజరయ్యారు. అక్కడి నుంచి తిరుగు ప్రయాణం అయిన  2014 జూలై 17న ఉక్రెయిన్’ తమ దేశ గగనతలంలో పయనిస్తున్న మలేషియా ప్యాసింజర్ విమానాన్ని కూల్చేసింది. ఈ దుర్ఘటనలో 275 ప్రయాణీకులు దుర్మరణం పాలయ్యారు. మీడియా, పత్రికలు కొద్ది రోజులు గగ్గోలు పెట్టి చల్లబడి పోయాయి. పొరపాటున ఒక విమానం అనుకుని ఇంకొక విమానాన్ని కూల్చామని ఉక్రెయిన్ చేతులు దులుపుకొంది. ఏ విమానమనుకుని, ఎవరి విమానం అనుకుని, అందులో ఎవరు ప్రయాణిస్తున్నారు అనుకుని , ఉక్రెయిన్.. మలేషియా ప్యాసింజర్ విమానాన్ని కూల్చేసింది? ఇంతకాలం ఈ ప్రశ్నకు ఉక్రెయిన్ సమాధానం ఇవ్వలేదు. కానీ, అసలు విషయం ఇప్పుడు బయటకొచ్చింది. 

ఉక్రెయిన్’ టార్గెట్ చేసింది భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రయాణిస్తున్న, ఎయిర్ ఇండియా విమానాన్ని. అయితే, ప్రధాని ప్రయాణించవలసిన విమానంలో సాంకేతిక లోపం తలెత్తడం వలన, ఫ్రాంక్ ఫర్ట్ నుంచి ప్రధాని విమానం కొంత ఆలస్యంగా బయలు దేరింది. దీంతో ముందుగా మలేషియా విమానానికి అనుమతి నిచ్చారు. అదే మోడీ ప్రయాణిస్తున్న విమానం అనుకుని, దాని టార్గెట్ చేశారు. విమానంలో ఏర్పడిన సాంకేతిక లోపం, మోడీ ప్రాణాలను అయితే కాపాడింది కానీ, 275 మంది ప్రాణాలను బలితీసుకుంది. అందుకే, ఉక్రెయిన్, తేలు కుట్టిన దొంగలా, మలేషియా ప్యాసింజర్ విమానాన్నికూల్చి వేసిన సంఘటనను, విచారణ కంబళిలో కప్పేసింది. 

అయితే, భారత ప్రభుత్వం ఒత్తిడితో  నెదర్లాండ్స్ లోని అంతర్జాతీయ న్యాయస్థానం ఈ విషయాన్ని విచారించింది. ఇందుకు సంబందించి  నలుగురు అరెస్టయ్యారు. వాళ్లలో ఉక్రెయిన్’ కు చెందిన ఐగర్ గ్రికిన్’ తన స్టేట్మెంట్’ లో “మా లక్ష్యం మలేషియా విమానం కాదు.  నేనంతవరకే చెప్పగలను.  అంతకు మించి ఏమీ చెప్పలేను” అని ముగించారు. దీని బట్టి, మలేషియా విమానం ప్రమాదానికి గురైన కొద్దిసేపటికే ఆ మార్గంలో వెళ్ళిన భారత ప్రధాని ప్రయాణిస్తున్న విమానమేవారి లక్ష్యమని ఐగర్ గ్రికిన్’ చెప్పకనే చెప్పినట్లు  అయిందని అంటున్నారు. 

అందుకే,  ఈరోజు ప్రపంచం ముందు అమాయకంగా నటిస్తూ, భారత దేశం, ప్రధాని మోడీ సహయం కోరుతున్న ఉక్రెయిన్, విషయంలో తస్మాత్ జాగ్రత్త అని, నిపుణులు హెచ్చరిస్న్తున్నారు. అలాగే, భారత దేశానికీ పాకిస్థాన్ ఏ  విధంగా అయితే, పక్కలో బల్లెంలా ఉందో, రష్యాకు ఉక్రెయిన్ కూడా అదే విధంగా ప‌క్క‌లో బల్లెంలా, సమస్యలు సృష్టిస్తోందని రష్యన్లు భావిస్తున్నారు. పాశ్యాత్య దేశాలతో చేతులు క‌లిపి, యురోపియన్ యూనియన్’లో చేరి రష్యాకు చిక్కులు సృష్టించే ప్రయత్నం చేస్తోంది. అందుకే రష్యా అధ్యక్షుడు పుతిన్ యుద్ధానికి సిద్డమయ్యారని అంటున్నారు. 

అదెలా ఉన్నా, ఎప్పుడో 2014లో ఉక్రెయిన్ గగనతలంలో ప్రధాని మోడీపై జరిగిన, గురితప్పిన విమాన దాడి, విషయాన్ని ఇప్పుడు ఎందుకు, బయటకు తెచ్చారు. ఉక్రెయిన్’కు యుద్ధంతో బదులిచ్చిన రష్యాను స్పూర్తిగా తీసుకుని, పాక్’ ఫై యుద్ధానికి మోడీ సిద్దమవుతున్నారా? అందుకోసమే, ఉక్రెయిన్’ను ప్రపంచం ముందు దోషిగా నిలబెట్టేందుకు రష్యా చేస్తున్న ప్రయత్నాలకు మద్దతుగానే, ఎనిమిదేళ్ళ నాటి పాత ముచ్చటను తెరమీదకు తెచ్చారా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. నిజానికి, పాక్ ఆక్రమిత కాశ్మీర్ భారత దేశంలో అంతర్భ్గాగమని, ఏదో ఒకనాటికి, భారత దేశం ఆ భూభాగాన్ని స్వాధీనం చేసుకోవడం ఖాయమని బీజేపీ విశ్వసిస్తోంది. అందులో భాగంగానే  మోడీ ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దు చేసిందనే విమర్శలు ఎటూ వినిపిస్తునే ఉన్నాయి. అలాగే,  ‘కశ్మీర్ ఫైల్స్’ సినిమా ఆధారంగా దేశం దృష్టిని, కశ్మీర్ వైపుకు తీసుకు పోవడం కూడా అయితే అందులో భాగం కావచ్చునని అంటున్నారు. అలాగే, రష్యా, ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఇతర కీలక నాయకులు తరచుగా జమ్ము –కశ్మీర్’లో పర్యటిస్తున్నారు. మార్చి 23న కూడా అమిత్ షా కశ్మీర్’ పర్యటనలోనే  ఉన్నారు. సో.. ఉక్రెయిన్’ గగన తలంలో ప్రధాని ప్రయాణిస్తున్న విమానాన్ని, కూల్చి వేసేందుకు ఎప్పుడో 2014లో జరిగిన విఫల ప్రయత్నం, ‘కథ’ను ఇప్పుడు బయట పెట్టడం వెనక, పాక్’ఫై యుద్ధానికి సన్నద్ద సంకేతాలు ఏమైనా ఉన్నాయా? అనే అనుమానాలు అక్కడక్కడా వినవస్తున్నాయి. అయితే, అదే సమయంలో, రష్యాను చూసి భారత దేశం పాక్ పై యుద్ధానికి దిగితే.. ప్రపంచ దేశాలు ముఖ్యంగా అమెరికా, చైనా ఎలా స్పందిస్తాయి.. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్న చందం అవుతుందా అన్న సందేహాలు కూడా లేక పోలేదు. ఏది ఏమైనా, రష్యా ఉక్రెయిన్ యుద్ధం భారతదేశంపై అన్ని విధాల బలమైన ప్రభావం చూపుతోంది. అందులో మాత్రం సందేహం లేదని, నిపుణులు అంటున్నారు.

By
en-us Political News

  
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.