Publish Date:Apr 26, 2022
దాదాపు 9 ఏళ్లుగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితిలో ఇప్పుడు వర్గ విభేదాలు ఆ పార్టీని చీకాకు పెడుతున్నాయా అంటే అవుననే అనాలి. పలు జిల్లాల్లో పార్టీ నేతల మధ్య విభేదాలు ఆయా జిల్లాల్లో పార్టీని చీకాకు పరుస్తున్నాయి. అంతే కాకుండా ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో ఆయా నియోజకవర్గాలలో సిట్టింగులకు, సీటు ఆశిస్తున్న ఆశావహులకు మధ్య పొసగడం లేదు. దీంతో అసమ్మతీయులు పక్క చూపులు చూస్తున్నారు. అటువంటి వారిని అక్కున చేర్చుకోవడానికి రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీలు సిద్ధంగా ఉన్నాయి. తెరాస అసమ్మతి వాదులకు తలుపులు బార్లా తెరిచి ఉంచాయి. దీంతో ఇప్పటి వరకూ ఇతర పార్టీల నుంచి తెరాసలోకి వచ్చి చేరడమన్న పరిస్థితి ఇక ముందు తెరాస నుంచి వలసలుగా మారే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా తెరాసలో ధిక్కార స్వరం వినిపించడమే ఇందుుక నిదర్శనమని చెబుతున్నారు. ఇందుకు ఉదాహరణగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిస్థితిని వారు ఉదహరిస్తున్నారు. తాండూరు నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే, సిట్టింగ్ ఎమ్మెల్సీల మధ్య విభేదాల పరిష్కారం పార్టీ అధినేత వల్ల కూడా కాకపోవడమే ఇందుకు నిదర్శనమంటున్నారు. ఈ ఇరువురిలో ఒకరు పార్టీ మారే విషయంపై త్వరలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. తాండూరు సిట్టింగ్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డిల మధ్య విభేదాలు తెలిసిందే. అయితే ఇటీవల ఇరువురి మధ్యా సంబంధాలు మరింతగా దెబ్బతిన్నట్లు వరుస సంఘటనలను బట్టి అర్ధమౌతుంది. రానున్న ఎన్నికలలో తాండురు నుంచి పార్టీ ఎమ్మెల్యేగా పోటీలో ఉండేది తానేనని ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి బహిరంగంగానే చెప్పుకుంటుండటంతో విషయాన్ని హై కమాండ్ దగ్గరకు తీసుకు వెళ్లారు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి. దీంతో పార్టీ అధినేత ఇరువురతో మాట్లాడినా పరిస్థితితో మార్పు రాలేదు. దీంతో ఎమ్మెల్యే కినుక వహించినట్లు చెబుతున్నారు.
అలాగే ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ, ఆదిలాబాద్ జిల్లాలలో కూడా ఆశావహులు, సిట్టింగ్ ల మధ్య పెద్దగా పొసగడం లేదంటున్నారు. ఖమ్మం జిల్లాలో తుమ్మల ఇప్పటికే అలకపాన్పు ఎక్కారు. ఆయన ఎప్పుడైనా పార్టీ మరే అవకాశం ఉందని చెబుతున్నారు. ఏది ఏమైనా వచ్చే ఎన్నికల సమయానికి టీఆర్ఎస్ నుంచి పెద్ద ఎత్తున వలసలు ఉండే అవకాశం ఉందని పరిశీలకులు చెబుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/now-jumpings-from-trs-25-135024.html
ఈ ఎన్నికలకు సంబంధించి దాఖలైన నాలుగు నామినేషన్ పత్రాలు పూర్తిగా సక్రమంగా ఉన్నాయని రిటర్నింగ్ అధికారి, అసెంబ్లీ సంయుక్త కార్యదర్శి ఆర్. వణితా రాణి ప్రకటించారు. శాసనసభ భవనంలోని తన చాంబర్‌లో అభ్యర్థుల సమక్షంలో జరిగిన ఈ స్కృటినీ ప్రక్రియలో ఎలాంటి సాంకేతిక లోపాలు లేవని తేలడంతో కూటమి శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో 2027 సంవత్సరం ఒక సరికొత్త సంచలనానికి వేదిక కాబోతోందా? అంటే రాజకీయ పరిశీలకులు ఔననే ఉంటున్నారు. 2024లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న జగన్, అలాగే 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పరాజయాన్ని చవిచూసిన కేసీఆర్ ఇద్దరూ 2027 సంవత్సరంలో మళ్లీ ప్రజలతో మమేకమై పూర్వ వైభవాన్ని అందిపుచ్చుకోవాలన్నవ్యూహరచనలో ఉన్నారు.
సాక్షాత్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగి ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. క్షేత్రస్థాయిలో అధికారులు ఆ ఫైళ్లను పక్కన పెట్టేయడం రాజకీయ, అధికార వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
మహారాష్ట్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన 20 అడుగుల ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ వేడుకలో వివాదం తలెత్తింది. ఈ భారీ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అయిన ఏక్‌నాథ్ షిండేకు కనీసం ఆహ్వానంఅందలేదు.
దేశరాజకీయాల్లో ప్రతిపక్ష ఇండియా కూటమి అత్యంత కీలకమైన అడుగులు వేస్తోంది.
రాజ్యసభ ఎంపీ అభ్యర్థులుగా తెలుగు దేశం పార్టీ తరుపున సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ లు నామినేషన్ లు దాఖలు చేశారు.
కేవలం తన కోటరీ మాటలు నమ్మి ప్రజా క్షేత్రానికి దూరం కావడం వల్లే ఘోర పరాజయాన్ని చవిచూశారు. అయితే 2024 ఎన్నికలలో విజయం సాధించి అధికారం చేపట్టిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నిత్వం ప్రజలకు చేరువగానే ఉంటోంది. ఇక తాజాగా ఈ నెల 9 నుంచి 15 వరకూ ప్రజాబాట కార్యక్రమాలను నిర్వహించనుంది.
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై తన విమర్శల మోతాదు పెంచారు. ఒక భూమి విషయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పెరు లాగి మీడియా దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నించారు. ఆ క్రమంలో కల్వకుంట్ల కవిత ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలకు సంబంధించి అధికార తెలుగుదేశం పార్టీ (టీడీపీ) తమ అభ్యర్థుల ఎంపికను అధికారికంగా పూర్తి చేసింది.
ఈ గ్లోబల్ ఎక్స్‌పోజర్, కమ్యూనికేషన్ స్కిల్స్ నేడు ఆయనను జాతీయ స్థాయి రాజకీయాలకు, ముఖ్యంగా రాజ్యసభ కు సమర్థుడైన అభ్యర్థిగా నిలబెడుతున్నాయి. 2019 ఎన్నికలలో తెలుగుదేశం ఓటమి తరువాత టీడీపీ తీవ్ర సంక్షోభంలో ఉన్న తరుణంలో.. సాంప్రదాయ మీడియా కంటే డిజిటల్ మీడియా ద్వారా అధికార పక్షాన్ని ఎదుర్కోవడం ముఖ్యమని పార్టీ గుర్తించింది
ప్రస్తుత జాతీయ రాజకీయాల పరిస్థితులు, పార్టీ భవిష్యత్ ను పరిగణనలోకి తీసుకుని చింతకాయల విజయ్ రాజ్యసభకు పంపడమే సముచితమని ఆయన నిర్ణయించారు.
ప్రస్తుతం కేంద్రంలో తెలుగుదేశం పార్టీ అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తోంది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న తరుణంలో పార్లమెంట్‌లో పార్టీ గళాన్ని బలంగా వినిపించగల యువ, విద్యావంతులైన నాయకత్వం అవసరమని చంద్రబాబు భావించినట్లు కనిపిస్తోంది.
అన్నామలై ఇప్పుడు నేరుగా సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో చేతులు కలపబోతున్నారనే వార్త దావానలంలా వ్యాపిస్తోంది. వీరిద్దరూ కలిసి తమిళనాడులో ఒక సరికొత్త ప్రాంతీయ పార్టీని స్థాపించేందుకు సన్నాహాలు చేస్తున్నారనే వదంతులు తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
అలాగే అంతర్జాతీయ వాణిజ్యాన్ని ఊహించని రేంజ్‌లో పెంచడానికి ఈ ప్రాజెక్ట్ దేశానికి ఎంతో రక్షణ, ఆర్థిక ప్రయోజనకరమని కేంద్ర ప్రభుత్వం బలంగా చెప్తోంది. అయితే ఈ మెగా ప్రాజెక్టుపై లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ, ఇది దేశ చరిత్రలోనే అతి పెద్ద స్కామ్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు.