Publish Date:Apr 10, 2026
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఇంటి పోరు ముదురుతోంది. ఆమె భర్త పరకాల ప్రభాకర్ తమిళనాడు ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. ఇందుకోసం ఆయన జీరో బీజేపీ ఇనీషియేటివ్ చేపట్టడం గమనార్హం. చెన్నైలోని ప్రెస్ క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీకి ఓటేస్తే.. సామాజిక న్యాయానికి పాడె కట్టడమేనన్నారు. రాష్ట్రంలోని బీజేపీని అడుగుపెట్టనీయవద్దని, ఒక్క సీటు కూడా వారికి ఇవ్వకుండా తమిళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పరకాల కోరారు.
ఏప్రిల్ 23న జరగనున్న తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో బీజేపీ ఒక్క సీటు కూడా గెలవకూడదని అఖిల భారత ప్రజా ఉద్యమ తమిళనాడు సమన్వయ కమిటీ ఉద్ఘాటించింది. జీరో బీజేపీ ప్రచారాన్ని ప్రారంభించిన ఆ కమిటీ... 234 మంది సభ్యులున్న అసెంబ్లీలో బీజేపీకి ఒక్క సీటు కూడా దక్కకుండా చూడటమే లక్ష్యమని పేర్కొంది.
ఈ కార్యక్రమ నిర్వాహకులలో ఒకరైన డాక్టర్ పరకాల ప్రభాకర్ మాట్లాడుతూ.. జీరో బీజేపీ ’ చాలా ముఖ్యమని, ఆ సిద్ధాంతాన్ని ప్రచారం చేసేందుకే తాను తమిళనాడుకు వచ్చానని పరకాల ప్రభాకర్ పేర్కొన్నారు. తమిళనాడు ప్రజలంతా ఈ సిద్ధాంతం వైపు నిలబడాలని పిలుపునిచ్చారు. బీజేపీకి వేసే ప్రతి ఓటు మన రాజ్యాంగ విలువలకు సమాధి కట్టుకోవడమేనన్నారు. ప బీజేపీకి ఓటేస్తే తమిళనాడులో మత సామరస్యం దెబ్బతింటుందని, వివిధ సామాజిక వర్గాలకు చెందిన ప్రజలు కలిసిమెలిసి జీవించలేరని అన్నారు. స్వేచ్ఛ, సమానత్వం నాశనమవుతాయని పరకాల హెచ్చరించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/parakala-prabhakar--zero-bjp-campaign-in-tamilnadu-25-217108.html
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సవాల్ విసిరారు. సోషల్ మీడియాలో సవాళ్లు విసరడం మానేసి, EVMలు మరియు SIR అంశాలపై పార్లమెంట్లో చర్చకు రావాలని ఆమె డిమాండ్ చేశారు.
2021 లో జగన్ మోహన్ రెడ్డి కుప్పంలో నాటిన విత్తనం మహావృక్షమై దాని వేర్లు పులివెందుల వరకు పాకుతాయని జగన్ ఊహించి ఉండరు. 2021 జగన్ కుప్పం మునిసిపాలిటీ ని తెలుగుదేశంకు దక్కకుండా చేసి, చంద్రబాబు ముఖం ఇప్పుడు చూడాలి అన్న పరుష వ్యాఖ్యలే పులివెందులతో పులివెందులపై తెలుగుదేశం గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది.
ఆంధ్రప్రదేశ్ పురపాలక ఎన్నికల ఫలితాల్లో కడప జిల్లాలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి
విశాఖపట్నం మేయర్ పీఠాన్ని తెలుగుదేశం పార్టీ దక్కించుకుంది
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తన సత్తా చాటింది.
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన మద్యం రవాణా కాంట్రాక్టుల కుంభకోణం కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత కారుమూరి వెంకట నాగేశ్వరరావుకు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
20 వార్డుల్లో 17 స్థానాలు గెలుపు.!
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాతావరణ మార్పుల కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరో పెను తుపాను ముప్పును ఎదుర్కొంటోంది.
కడప పులివెందుల మున్సిపాలిటీ ఛైర్పర్సన్ ఎన్నికల కౌంటింగ్‌లో తెలుగుదేశం పార్టీ విజయపథంలో దూసుకుపోతోంది
ఆ పసివాడికి చట్టాలు తెలియవు.. నిబంధనలు అసలే తెలియవు. తెలిసిందల్లా అమ్మానాన్నల ప్రేమ మాత్రమే!
ఏపీలో జరుగుతున్న పురపాలక సంఘం ఎన్నికల ఫలితాల్లో అధికార కూటమి పక్షాలు తమ జోరును ప్రదర్శిస్తున్నాయి.