నిన్నటి వరకూ జగన్.. ఇప్పుడు అవినాష్.. వైనాట్ 175

Publish Date:Jul 7, 2023

Advertisement

వచ్చే ఎన్నికల్లో వైయస్ఆర్ సీపీకి 175కి 175 సీట్లు ఖాయమని సీఎం   జగన్ సోదరుడు, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు ముఖ్యమంత్రి  జగన్‌నే ఆదరిస్తున్నారని చెప్పారు.    గురువారం (జూన్ 6) పులివెందుల బాకరాపురం సీఎం క్యాంప్ కార్యాలయంలో వైయస్ అవినాష్ రెడ్డి ప్రజా దర్భార్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీ జాతీయ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేశ్ ఎన్ని మాయ మాటలు చెప్పినా.. ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. సీఎం జగన్ సుపరిపాలన అందిస్తున్నారంటూ సోదరుడిపై అవినాష్ రెడ్డి ప్రశంసల జల్లు కురిపించారు. ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా.. సీఎం జగన్‌ను ఎవరు ఏమీ చేయలేరన్నారు. జగన్ ప్రవేశపెట్టిన పథకాలే.. ఆయన్నిమరోసారి ముఖ్యమంత్రి చేస్తాయని   అవినాష్ రెడ్డి క్లియర్ కట్‌గా స్పష్టం చేశారు. 

అయితే అవినాశ్ రెడ్డి వ్యాఖ్యలపై   నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. గత ఎన్నికల వేళ.. మీ చిన్నాన్న వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురయ్యారని... ఆ హత్య కేసులో మీరు, మీ తండ్రి  భాస్కరరెడ్డిలు  రోపణలు ఎదుర్కొంటున్నారని.. అయితే తెరచాటు రాజకీయం చేసి.. మిమ్మల్ని రక్షిస్తోంది ఎవరో.. ప్రతీ ఒక్కరికి తెలిసిన బహిరంగ రహస్యమేనని వారు పేర్కొంటున్నారు.  వివేకా హత్య కేసుకు ముగింపు చెప్పకుండా.. దోషులు ఎవరో అధికారికంగా ప్రకటించకుండా.. వారికి శిక్షలు పడకుండా.. మీరు ఎన్నికలకు వెళ్లితే జరిగే పరిణామాలు మాత్రం తీవ్రంగా ఉంటాయని పేర్కొంటున్నారు. ముందుగా వాటికి సిద్దంగా ఉండాలని కడప ఎంపీ   అవినాష్ రెడ్డికి నెటిజన్లు హితవు పలుకుతున్నారు. 

 హత్య కేసులో వివేకా మాజీ కారు డ్రైవర్ దస్తగిరి.. అప్రూవర్‌గా మారి సీబీఐ ఏదుట హత్య జరిగిన తీరు తెన్నుల నాటి నుంచి నిన్న మొన్నటి వరకు అంటే.. మీ తల్లిగారి అనారోగ్యంతో బాధపడుతూ కర్నూలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్రమంలో మీరు అక్కడే ఉండిపోవడం... ఆ సమయంలో సీబీఐ, మీరు ఆడిన దొంగా.. పోలీస్ ఆట మాత్రం.. చాలా రసవత్తరంగా సాగిందంటూ వైయస్ అవినాష్ రెడ్డిపై నెటిజన్లు సెటైర్లు కురిపిస్తున్నారు.   

మరోవైపు 2019 ఎన్నికలకు ముందు కోడికత్తి దాడి, వైయస్ వివేకా హత్యల వెనుక నాటి చంద్రబాబు ప్రభుత్వం ఉందంటూ నాటి ప్రతిపక్ష నేత   జగన్.. స్వయంగా ఆరోపణలు  గుప్పించారని.. అలా ఆ ఎన్నికల్లో గెలిచిన మీరు.. ఈ కేసులో నిజా నిజాలు ఇప్పటి వరకు బహిర్గతం చేయలేని స్థితిలో ఉండిపోవడం నిజంగా సిగ్గు చేటని అంటున్నారు. 

మరి ఈ కేసులో దోషులు ఎవరో తేలకుండా..  ఎన్నికలకు వెళ్లితే.. మీకు, మీ పార్టీకే నష్టమని... ఈ నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా ఈ వివేకా హత్య కేసు దర్యాప్తునకు ముగింపు పలకాలని వారు సూచిస్తున్నారు. ఈ హత్య కేసులో దోషులు ఎవరో తేలి... వారికి కఠిన శిక్ష పడితే..  వరుసగా మళ్లీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పీఠంపై   జగన్ కూర్చుంటారని వారు ఢంకా భజాయించి మరీ చెబుతుండడం విశేషం.  

ఇక గత ఎన్నికల్లో జగన్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే.. రాష్ట్ర ప్రజలే కాదు.. వైయస్ జగన్ తల్లి, సోదరి వైయస్ విజయమ్మ, వైయస్ షర్మిల తదితరులంతా ఒక్కటై   జగన్ వెంటే అడుగులో అడుగు వేసి నడిచారని.. కానీ నేడు వారంతా ఎక్కడున్నారని ప్రశ్నిస్తున్నారు.  రానున్న ఎన్నికల్లో మీ కోసం, మీ పార్టీ కోసం ఐ ప్యాక్‌ తప్ప రంగంలోకి దిగేవారు ఎవరు ఉన్నారంటూ   అవినాష్‌రెడ్డిని నెటిజన్లు సూటిగా ప్రశ్నస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఫ్యాన్ పార్టీ గెలుపు అనేది నల్లేరు మీద నడకే అవుతోందా? అనేది ఒక్క సారి మనస్సాక్షిని అడగాలంటూ   కడప ఎంపీ అవినాష్ రెడ్డికి నెటిజన్లు సూచిస్తున్నారు. అయినా.. ఫ్యాన్ పార్టీ అధికారంలో ఉండి.. సొంత బాబాయి హత్య కేసు... నేటికి తెలకపోవడం చూస్తుంటే.. మీ గొయ్యి మీరే తవ్వుకొన్నట్లుగా ఉందనే ఓ చర్చ సైతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోందని.. ఈ విషయాన్ని కాస్త శ్రద్ద పెట్టి పరిశీలించాలంటూ  నెటిజన్లు సూచిస్తున్నారు.

By
en-us Political News

  
తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు  ఢిల్లీలో  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత  ఆసక్తిని రేకెత్తించింది. 
ఒకనాడు ప్రత్యర్థుల విమర్శల దాడులను చిటికెలో   చిత్తు చేసే నేర్పు ఉన్న నేతగా నిలిచిన హరీష్ రావు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులను ప్రశ్నిస్తూ, సోషల్ మీడియా,  మీడియా సమావేశాల ద్వారా విమర్శలు గుప్పిస్తోంది. డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, అభ్యర్థుల మార్కులు  పరిశీలనా ప్రక్రియలో గందరగోళం నెలకొందని ఆరోపిస్తున్నది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
కేసీఆర్ కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులపేర్ల మీద అధికారికంగా నమోదై ఉన్న భూముల వివరాలను అసెంబ్లీ వేదికగానే  రేవంత్ రెడ్డి బయటపెట్టారు.  
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.