హిందుపురంలో బాలయ్య విజయం నల్లేరుమీద బండి నడకే

Publish Date:Jul 8, 2023

Advertisement

ఈ నియోజకవర్గం ఆ నియోజకవర్గం అని లేదు.. ఏపీలోని   175 అసెంబ్లీ నియోజకవర్గాలలోనూ వైసీపీలో వర్గ విభేదాలు భగ్గుమంటూనే ఉన్నాయి. నెల్లూరు జిల్లా నుంచి మొదలైన అసమ్మతి గళం రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకూ వ్యాపించింది. తాజాగా ఉమ్మడి అనంతపురం జిల్లాలోనూ వైసీపీ కూర్చున్న కొమ్మను నరుక్కునే కార్యక్రమం మొదలైంది. జిల్లాలోని అత్యంత కీలకమైన హిందూపురం అసెంబ్లీ సెగ్మంట్లో వైసీపీ వర్గపోరు తార స్థాయికి చేరింది.

ఈ నియోజకవర్గం నుంచి నందమూరి బాలకృష్ణ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. వరుసగా ఇదే నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా గెలుస్తూ వస్తున్న బాలకృష్ణను ఈ సారి ఎలాగైనా ఓడించాలన్నది సీఎం జగన్ టాస్క్ గా పెట్టుకున్నారు. అయితే నియోజకవర్గంలోని క్షేత్ర స్థాయి పరిస్థితులు మాత్రం జగన్ టాస్క్ నెరవేరేందుకు ఎంత మాత్రం అనుకూలంగా లేవు. హిందుపురం ఇన్ జార్జీ, మాజీ ఐపీఎస్ అధికారి అయిన ఇక్బాల్ కు నియోజవర్గంలో తీవ్ర వ్యతిరేకత ఎదురౌతోంది. ఆ వ్యతిరేకత సొంత వైసీపీ నుంచే కావడంతో నియోజకవర్గంలో ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించే కార్యక్రమం నత్తనడకన నడుస్తోంది. దీనికి తోడు ఇక్బాల్  వ్యతిరేక వర్గం ఆయనకు వ్యతిరేకంగా ఇటీవల భారీ ర్యాలీ నిర్వహించింది. 

పార్టీ ఇన్ చార్జి తీరును గర్హిస్తూ నగరంలోని ఎన్టీఆర్ విగ్రహానికి ఇక్బాల్ వ్యతిరేక వర్గం వినతి పత్రం కూడా సమర్పించింది. నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాల ప్రభావం పార్టీ విజయావకాశాలపై పడకుండా ఉండాలంటే ఈ హిందూపురం నుంచి ముఖ్యమంత్రి జగన్ ఇక్కడ నుంచి పోటీ చేయడమొక్కటే మార్గమని ఇక్బాల్ వ్యతిరేక వర్గం వారు గట్టిగా చెబుతున్నారు. తమ డిమాండ్ జగన్ చెవికి చేరే వరకూ ఇలాంటి నిరసన కార్యక్రమాలు మరిన్ని నిర్వహిస్తామని అంటున్నారు. 

 నియోజకవర్గంలో  నవీన్ నిశ్చల్, ఇక్బాల్ ల మధ్య వర్గపోరు  తీవ్రంగా ఉంది. గత ఎన్నికల్లో ఇక్బాల్ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు.  ఆయన ఓటమికి వర్గపోరే కారణమని పార్టీ శ్రేణులే చెబుతున్నాయి. ఇప్పుడు వచ్చే ఎన్నికలలో కూడా ఇక్బాలే ఇక్కడ నుంచి వైసీపీ అభ్యర్థిగా మరో సారి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి.  దీంతో నవీన్ నిశ్చల్ వర్గీయులు ఇక్బాల్ కు వ్యతిరేకంగా ఆందోళనా కార్యక్రమాలు చేపట్టారు. అందుకు ప్రతిగా  ఇక్బాల్ వర్గం కూడా ప్రతి చర్యలు మొదలు పెట్టింది. దీంతో హిందూపురం నియోజకవర్గంలో నిత్యం వైసీపీ వర్గ పోరు విపక్షాలకు ఆనందాన్ని కలిగిస్తోంది. జగన్ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతకు తోడు వైసీపీలో విభేదాలు హిందుపురంలో వైసీపీని నామమాత్రంగా మార్చేశాయని పరిశీలకులు అంటున్నారు. ఈ పరిస్థితి ఇక్కడ నందమూరి బాలకృష్ణ విజయాన్ని నల్లేరుమీద బండినడకగా మార్చేస్తాయని చెబుతున్నారు. ఇక్బాల్ స్థానంలో మరో ఇన్ చార్జిని నియమించి వైసీపీ అధిష్ఠానం నష్ట నివారణకు చర్యలు చేపట్టినా.. ఇప్పటికే ఆలస్యమైందని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. 

By
en-us Political News

  
తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు  ఢిల్లీలో  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత  ఆసక్తిని రేకెత్తించింది. 
ఒకనాడు ప్రత్యర్థుల విమర్శల దాడులను చిటికెలో   చిత్తు చేసే నేర్పు ఉన్న నేతగా నిలిచిన హరీష్ రావు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులను ప్రశ్నిస్తూ, సోషల్ మీడియా,  మీడియా సమావేశాల ద్వారా విమర్శలు గుప్పిస్తోంది. డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, అభ్యర్థుల మార్కులు  పరిశీలనా ప్రక్రియలో గందరగోళం నెలకొందని ఆరోపిస్తున్నది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
కేసీఆర్ కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులపేర్ల మీద అధికారికంగా నమోదై ఉన్న భూముల వివరాలను అసెంబ్లీ వేదికగానే  రేవంత్ రెడ్డి బయటపెట్టారు.  
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.