నాకు మండిందంటే అణుబాంబు వేస్తా!
Publish Date:Oct 4, 2024
Advertisement
తమ దేశం మీద దక్షణ కొరియాగానీ, ఆ దేశ మిత్రపక్షమైన అమెరికాగానీ దాడి చేయడానికి ప్రయత్నిస్తే నిర్దాక్షిణ్యంగా అణ్వాయుధాలు ప్రయోగిస్తామని ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ హెచ్చరించారు. 'ఒకవేళ శత్రువులు మా దేశ సార్వభౌమాధికారాన్ని ఆక్రమించేలా సాయుధ బలగాలను ఉపయోగించేందుకు ప్రయత్నిస్తే వాటిపై నిస్సంకోచంగా అణ్వాయుధాలతో దాడి చేస్తాం' అని కిమ్ పేర్కొన్నట్లు ఓ వార్తా సంస్థ పేర్కొంది. ఉత్తర కొరియా రాజధాని పాగ్యాంగ్‌లోని ప్రత్యేక దళాల సైనిక శిక్షణ స్థావరాన్ని కిమ్ సందర్శించిన అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు. ఈమధ్య దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ 'ఒకవేళ ఉత్తర కొరియా మాపై అణ్వాయుధాలను ప్రయోగిస్తే అమెరికా కూటమితో కలిసి ఎదుర్కొంటాం. ఆ రోజుతో ఉత్తర కొరియాలో కిమ్ పాలన ముగుస్తుంది' అని వ్యాఖ్యానించారు. ఇందుకు బదులు ఇస్తూ కిమ్ పై వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఈమధ్యకాలంలో ఉత్తర కొరియా, దక్షిణ కొరియాల మధ్య సంబంధాలు మరింత దారుణమైన స్థితికి చేరుకున్నాయి. గత కొన్ని నెలలుగా ఉత్తర కొరియా వేల సంఖ్యలో చెత్త బెలూన్లను దక్షిణ కొరియా వైపు వదులుతోంది.
http://www.teluguone.com/news/content/north-korea-kim-jong-un-threatens-use-of-nuclear-weapons-if-attacked-25-186173.html





