హై‘డరా’బాద్..!

Publish Date:Jun 8, 2022

Advertisement

సామూహిక అత్యాచారాలు, హత్యాచారాలతో తెలంగాణ రాష్ట్ర రాజధాని గొప్ప అపకీర్తి మూటగట్టుకుంటోంది. భద్రత లేని నగరంగా విశ్వ విఖ్యాతి చెందుతోంది. ఒక వైపు ప్రభుత్వం విశ్వనగరంగా అభివృద్ధి చెందుతోందంటూ హైదరాబాద్ ను కీర్తిస్తుంటే.. మరోపైపు మహిళలపై జరుగుతున్న వరుస అఘాయిత్యాలు శాంతి భద్రతల జాడ లేని విశ్వనరకంగా విమర్శల పాలౌంతోంది. 
విశ్వగరం పరిస్థితి విశ్వనరకంగా మారడానికి కారణం ప్రధానంగా విచ్చలవిడిగా పెరిగిపోయిన పబ్బులు, నిబంధనలను యథేచ్ఛగా తోసి రాజని ఇష్టారాజ్యంగా వాటిని నిర్వహిస్తున్న తీరే కారణమన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

విశ్వనగరంగా హైదరాబాద్ మహానగరం అభివృద్ధి చెందుతోందని తమ భుజాలను తామే చరిచేసుకుంటున్న ప్రభుత్వ పెద్దలు ఈ మహానగరం బాలికల పాలిట ‘అ’భాగ్యనగరంగా మారిపోవడానికి కారణమేమిటో చెప్పాలి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, గచ్చి బౌలి వంటి ప్రాంతాలలో అత్యంత విలాసవంతమైన బార్ అండ్ రెస్టారెంట్లు, పబ్బుల యజమానులు ఎవరు, వాటిలో వాటాదారులెవరే, ఎవరెవరి భాగస్వామ్యంతో ఇవి వర్థిల్లుతున్నాయి వంటి వివరాలు సేకరించాల్సి ఉంది. ఎందుకంటే వాటి వెనుక ఉన్నది బడా బడా నేతలేనన్నది బహిరంగ రహస్యమే. అయినా ఎవరూ బయటకు చెప్పరు. వాటకి నిబంధనలతో పని లేకుండానే అనుమతులు మంజూరైపోతాయి. కనీస నిబంధనలను పాటించకపోయినా వాటిపై చర్యలు ఉండవు. ఒక వేళ అనివార్యంగా చర్యలు తీసుకోవలసిన పరిస్థితి వస్తే జరిమానాతో సరిపెట్టేయడానికి వీలైన సెక్షన్ల కిందే కేసులు నమోదౌతాయి. సమయ నియంత్రణ ఉండదు,

మైనర్లను అనుమతించకూడదన్న నిబంధన ఈ పబ్బులు, బార్లు, రెస్టారెంట్లలో పాటించరు. పోలీసులూ చూసీ చూడనట్లు వదిలేస్తారు. ఈ పరిస్థితికి కారణం ఎవరు. వెనకుండి ఈ దందాలకు సహకరిస్తున్నదెవరు? అందరికీ తెలిసన రహస్యమే అయినా అందరూ తెలియనట్టే ఉంటారు.  విశ్వనగరంలో ఖరీదైన బార్లు రెస్టారెంట్లు పబ్బులు హుక్కాసెంటర్లు ఆరోగ్య కేంద్రాలు పేరుతో మసాజ్ పార్లర్లు వ్యభిచార కేంద్రాలు నడుపుతున్నది  సంపన్నులు, రాజకీయ నాయకుల ఉన్నతాధికారుల పేరెన్నికగన్న న్యాయవాదులు డాక్టర్లు కుటుంబాల సభ్యులు వారసులేనని పోలీసు శాఖ వారు ఆఫ్ ది రికార్డ్ అంగీకరిస్తూనే ఉన్నారు.

జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 36, 45, 10 లలో, మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్ లాంటి ప్రాంతాల్లో, బంజారాహిల్స్ లో నిత్యమూ పగలు, రాత్రి తేడా లేకుండా జరుగుతున్న చీకటి దందా పాలకులకు అధికారులకు తెలియదంటే ఎవరైనా నమ్మగలరా?. చీమ చిటుక్కు మంటే ఏలిన వారికి క్షణాల్లో నివేదికలందించే పటిష్ట నిఘా ఉన్న రాష్ట్రంలో.. రాష్ట్ర రాజధానిలో నిబంధనలను తోసి రాజని పబ్బులలో జరుగుతున్న తంతు ప్రభుత్వానికి తెలియదంటే ఎలా నమ్మడం.  తల్లిదండ్రులు ఆరాచకంగా అక్రమంగా అన్యాయంగా అవినీతితో సంపాదించిన సొమ్ముతో వాళ్ళ సంతానం బార్లు రెస్టారెంట్లు పబ్బులు జూద గృహాలు(క్లబ్బులు) మాసాజ్ కేంద్రాలు, హుక్కాసెంటర్లు నడుపుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

వీటిల్లో రష్యా యూరోప్ నేపాల్ ఫిలిప్పీన్స్ లాంటి దేశాల నుండి , ఈశాన్య రాష్ట్రాలు నుండి అమ్మాయిలను తీసుకొచ్చి బార్లలో పబ్బుల్లో మసాజ్ సెంటర్లలో వెయిటర్లుగా సర్వర్లుగా డాన్సర్లుగా పెట్టి నడిపిస్తున్నారు. నేడు హైదరాబాద్ నగరంలో నడుస్తున్న అత్యంత విలాసవంతమైన బార్లు పబ్బులు రెస్టారెంట్లులో వాటాదారులు ఎవరో? వాటికి అనుమతులు ఎలా ఇచ్చారో,ఎలా వచ్చాయో? తెలుసుకోవడానికి నిజాయితీ కలిగిన మేధావులతో విచారణ కమిటీ వేయడానికి నేడు రాష్ట్ర ప్రభుత్వం కానీ, విపక్షాలైన కాంగ్రెస్ బీజేపీలు కానీ ఎందుకు ముందుకు రావడం లేదు?  జూబ్లీహిల్స్ అమ్నేషియా  పబ్బుల్లో జరిగిన ఘటన  అనంతరం ఆ కేసులో నిందితులను కాపాడేందుకు పోలీసులు పడిన తాపత్రయం, ఆత్రుత చూస్తుంటే.. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ చేయాల్సిన వాళ్లు చేస్తున్నదేమిటి? అన్న అనుమానాలు కలుగుతున్నాయి.

అసలింతకీ ఆ పబ్బు వాటాదారులు నిర్వాహకులు ఎవరో వాళ్ళను, అనుమతులు ఇచ్చిన అధికారులను, కనీస వయసు కూడా లేని మైనర్లను పబ్బులోకి అనుమతిస్తుంటే తెలిసీ ఊరకుంటున్న సంబంధిత పోలీసు అధికారులను   ఆ యువకుల తల్లిదండ్రులను దోషులుగా పోలీసులు మీడియా ముందు నిలబెట్టాలి? అలా ఎందుకు చేయరు? దొంగకు తేలు కుట్టినట్టుగా అందరూ మౌనం వహిస్తున్నారు. పెద్దల ఒత్తిడి, ప్రమేయంతోనే పబ్బుల ఇష్టారాజ్య అరాచకాలను పోలీసులు అరికట్టలేకపోతున్నారన్న ఆరోపణల్లో నూటికి నూరు శాతం వాస్తవం ఉందన్న ఆరోపణలు అవాస్తవం కాదని సామాజిక ఉద్యమ కారులు అంటున్నారు. ఈ దుష్ట సంస్కృతికి చరమగీతం పాడనంత వరకూ విశ్వనగరం అమ్మాయిల పాలిట ‘అ’భాగ్యనగరంగానే ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
 

By
en-us Political News

  
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో  కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.  కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.   గతంలో ఏపీలో బీజేపీ  మద్దతు  వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ  వాస్తవాన్ని సీఎం  చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్   బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.