ఎవరా నలుగురు? తొలగని సందేహాలు...

Publish Date:Jun 8, 2022

Advertisement

జూబ్లీహిల్స్ అత్యాచారం కేసులో దర్యాప్తు పూర్తయింది. ఇందుకు సంబందించిన పూర్తి వివరాలను హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీపీ ఆనంద్, మీడియాకు వివరించారు. ఈ కేసుకు సంబంధించి చాలా లోతుగా దర్యాప్తు జరిపి ఆరుగురు నిందితులను, అదుపులోకి తీసుకున్నామని సీపీ చెప్పారు. కేసు పూర్వాపరాలను సీపీ పూసగుచ్చినట్లు, ఏ క్షణానికి ఏమి జరిగిందో సవివరంగా వివరించారు. నిందితులపై పెట్టిన సెక్షన్ల ప్రకారం జీవిత ఖైదు లేదా మరణ శిక్ష పడే అవకాశం కూడా ఉంటుందని సీపీ పేర్కొన్నారు.

కఠిన చట్టాలు పెట్టినందు వల్లే.. అత్యంత జాగ్రత్తగా దర్యాప్తు చేశామన్నారు. కేసు దర్యాప్తులో ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవని... బలమైన ఆధారాల సేకరణ వల్లే కొంత ఆలస్యమైందని వివరణ ఇచ్చారు. కేసులో ఎవరినీ తప్పించే ప్రయత్నం జరగలేదని సీపీ స్పష్టం చేశారు. అయితే నిజంగానే, సీపీ  ఆనంద్ చెప్పిన విధంగా, నిందితులపై పెట్టిన సెక్షన్ల ప్రకారం జీవిత ఖైదు లేదా మరణ శిక్ష పడే అవకాశం వుందా? కఠిన చట్టాలు పెట్టినందున బలమైన ఆధారాల సేకరణకు కోసమే కేసు దర్యాప్తు కొంత ఆలస్యం అయిందన్న సీపీ వాదనలు నిజమేనా? ‘ఈ ఘటనలో అమాయకులను బలి చేయొద్దన్న ఉద్దేశంతో జాగ్రత్త తీసుకున్నాం. కేసులో ఎవరినీ తప్పించే ప్రయత్నం జరగలేదు’ అన్న సీపీ పలుకుల్లో సత్యముందా? లేక జాప్యానికి ఇంకేదైనా కారణం వుందా? ఇప్పుడు పబ్లిక్’ లో ఇవే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. 

అన్నిటికంటే ముఖ్యంగా, పోలీసులు అదుపులోకి తీసుకున్న ఐదుగురు నిదితుల్లో ఏ-1 సాదుద్దీన్‌ మాలిక్‌ (18) మాత్రమే మేజర్‌.మిగిలిన నలుగురు మైనర్లు..అందుకే, సుప్రీం కోర్టు ఆదేశాలను అనుసరించి, ఆ నలుగురి పేర్లు, ఇతర వివరాలు వేటినీ సీపీ బయట పెట్ట లేదు. అందుకే ఆ నలుగురు  ఎవరు?  అనేప్రశ్న ఇంకా ప్రశ్నగానే మిగిలిపోయింది. గతంలో దిశ సాముహిక అత్యాచారం కేసులో, మైనర్ నిందితుల పేర్లే కాదు, ఫోటోలు కూడా పత్రికలో పబ్లిష్ చేశారు. అయినా అప్పుడు పోలీసులు పట్టించుకోలేదు. కానీ, ఇప్పడు మైనర్ నిందితుల వివరాల చుట్టూ ఇనుప గోడలు కట్టేయడం ఎందుకు, అనేది సామాన్యుల నుంచి, ప్రజా ప్రతినిధుల వరకు వ్యక్తపరుస్తున్న సదేహం. అయితే, సుప్రీం కోర్టు ఆదేశాలు అలా ఉన్నాయి కాబట్టి, ఎవరూ గట్టిగా ప్రశ్నించ లేక పోవచ్చును కానీ, ఏ చిన్న సమాచారం బయటకు పొక్కకుండా పోలీసులు తీసుకుంటున్న జాగ్రత్తలు, అనుమానాలకు ఆస్కారం కల్పిస్తున్నాయని, పబ్లిక్ టాక్ వినవస్తోంది.  

అదొకటి అలా ఉంటే, నిదితుల పై పెట్టిన కేసుల విషయంలోనూ కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీపీ ఆనంద్, నిందితులపై పెట్టిన సెక్షన్ల ప్రకారం జీవిత ఖైదు లేదా మరణ శిక్ష పడే అవకాశం కూడా ఉంటుంది అని పేర్కొన్నారు. అది నిజమే కావచ్చును, కానీ, పోలీసులు పెట్టిన అత్యాచారం (376 డి) గాయపరచడం (366 ఏ)పోక్సో – మైనర్ బాలిక కిడ్నాప్’  తో పాటుగా ఐటీ చట్టం సెక్షన్ 76 పరిధిలో వీడియో సర్క్యులేషన్ కేసు, బాల నేరస్తులకు వర్తిస్తాయా? సీపీ ఆనంద్ చెప్పిన విధంగా మైనర్ నిదితులకు మరణ శిక్ష లేదా జీవిత ఖైదు శిక్ష పడే అవకాశం వుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజమే, నిర్భయ చట్టం పరిధిలో, బాల నేరస్తులకు మరణ శిక్ష, జీవిత ఖైదు శిక్షలు విధించే అవకాశం ఉన్నా, జువేనియల్ జస్టిస్ ఆక్ట్’ (జేజేఎ) ప్రకారం, ఇలాంటి కేసుల్లో 16 -18 సంవత్సరాల మధ్య వయసున్న మైనర్ నిందితులను, మేజర్ నిందితులతో సమానంగా, వారిని విచారించిన పద్దతిలోనే విచారించవచ్చును. కానీ, బాల నేరస్తులకు మరణ శిక్ష, యావజ్జీవ శిక్షలు విధించరాదని ఉందని, మాజీ  జేడీ., లక్ష్మినారాయణ,, ఒక టీవీ చానల్’ చర్చలో చెప్పారు. ఈ నేపధ్యంలో ఈ కేసులో మైనర్ నిందితులు నలుగురికి మరణ శిక్ష, యావజ్జీవ శిక్ష పడే అవకాశాలు ఎంత వరకు ఉన్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

న్యాయస్థానం విచారణ సమయంలో చట్టాల మధ్య ఉన్న కాన్ఫ్లిక్ట్ ను నిందితుల తరపు న్యాయవాదులు వినియోగించుకుంటే? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే, అందుకే, ముందు చూపుతో  ఒక ఎస్కేప్ రూట్ ను పోలీసులే తెరిచి ఉంచారా, అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే, ఈ కేసు దర్యాప్తు పూర్తయిందని, పోలీసులు చేతులు దులుపు కున్నా, ఈ మొత్తం వ్యవహారంలో వెలుగు చూడని రహస్యాలు ఇంకా ఉన్నాయనే సామాన్యుల సందేహాలు అయితే, ఇంకా ఆలాగే ఉన్నాయి.

By
en-us Political News

  
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో  కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.  కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.   గతంలో ఏపీలో బీజేపీ  మద్దతు  వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ  వాస్తవాన్ని సీఎం  చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్   బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.