ఏపీలో సంచలనం సృష్టిస్తోన్న మద్యం కుంభకోణం కేసులో రాజ్ కేసిరెడ్డిని వారం రోజులు కస్టడీకి అప్పగిస్తూ ఏసీబీ కోర్టు అనుమతిచ్చింది. అదే టైంలో రాజ్ కేసిరెడ్డి పీఏ దుబాయ్ పరారవ్వడానికి ప్రయత్నిస్తూ దొరికిపోవడంతో ఆ కేసులో కీలక వ్యక్తుల గుట్టు రట్టవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక తాజాగా లిక్కర్ స్కాంకు సంబంధించి జగన్ బ్యాచ్‌కు హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. లిక్కర్ స్కాం కేసులో ముందస్తు బెయిల్ కోసం మాజీ సీఎం జగన్ మాజీ సెక్రటరీ కె.ధనంజయ రెడ్డి, పీఏ పి.కృష్ణమోహన్ రెడ్డి, భారతి సిమెంట్స్ డైరెక్టర్, జగన్ సతీమణి భారతి తరఫున ఆర్థిక వ్యవహారాలు చూసే బాలాజీ గోవిందప్ప హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో వివరాలు సమర్పించేందుకు ప్రాసిక్యూషన్ సమయం కోరింది. ఈ క్రమంలో ప్రాసిక్యూషన్ సమయం కోరుతున్న నేపథ్యంలో ఈ దశలో అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణను హైకోర్టు ధర్మాసనం వచ్చే బుధవారానికి వాయిదా వేసింది.
మద్యం స్కాంలో ఇప్పటికే అరెస్ట్ అయిన కొందరు నిందితులు తమ పేర్లు చెప్పారని, అందువల్ల తమకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని పిటిషనర్లు హైకోర్టును ఆశ్రయించారు. అయితే తాము ప్రభుత్వం నుంచి ఆదేశాలు తీసుకోవాల్సి ఉందని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ దశలో ముందస్తు బెయిల్ ఇవ్వలేమని ధర్మాసనం తేల్చి చెప్పింది. కాగా.. మద్యం స్కాం కేసులో లోతుగా విచారణ జరుగుతుండటంతో జగన్ బ్యాచ్‌లో వణుకు మొదలైంది. ఇప్పటికే ఈ కేసులో రాజ్ కేసిరెడ్డి, ఆయన పీఏ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ కేసు తమ వరకూ రాబోతోందన్న భయంతో హైకోర్టులో పిటిషన్ వేశారు జగన్ బ్యాచ్. తమకు అరెస్ట్ లేకుండా చూడాలంటూ ముందస్తు బెయిల్‌కు అప్పీలు చేసుకున్నారు.
జగన్ సెక్రటరీ కె.ధనంజయ రెడ్డి, పీఏ పి.కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీ హైకోర్టులో పిటిషన్ వేయగా, ఎలాంటి ముందస్తు అరెస్ట్ లేకుండా ఆదేశాలు ఇవ్వలేమని కోర్టు స్పష్టం చేసింది. అంతే కాకుండా ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే చాలా మంది నుంచి దర్యాప్తు అధికారులు సమాచారాన్ని రాబట్టారు. మరికొంత మంది విచారణ కూడా జరుగుతోంది. ఈ కేసులో మరికొంత మందికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉండటంతో ముందస్తు చర్యల్లో భాగంగా ఈ ముగ్గురు హైకోర్టులో పిటిషన్ వేయగా.. వారికి ఎదురుదెబ్బ తగిలింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/no-respite-to-jagan-batch-in-ap-highcourt-hearing-39-197331.html
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది. 25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు.
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు.
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది.
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్, విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు.
2021 లో జగన్ మోహన్ రెడ్డి కుప్పంలో నాటిన విత్తనం మహావృక్షమై దాని వేర్లు పులివెందుల వరకు పాకుతాయని జగన్ ఊహించి ఉండరు. 2021 జగన్ కుప్పం మునిసిపాలిటీ ని తెలుగుదేశంకు దక్కకుండా చేసి, చంద్రబాబు ముఖం ఇప్పుడు చూడాలి అన్న పరుష వ్యాఖ్యలే పులివెందులతో పులివెందులపై తెలుగుదేశం గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది.